Peddamma talli temple
-
జూబ్లిహిల్స్ పెద్దమ్మ గుడికి పోటెత్తిన భక్తులు
-
Shaakuntalam: జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయంలో సమంత పూజలు (ఫొటోలు)
-
పెద్దమ్మ తల్లి గుడిలో సమంత పూజలు.. పిక్స్ వైరల్
యశోద సినిమా తర్వాత రిలీజ్ కాబోతున్న సమంత మూవీ శాకుంతలం. డైరెక్టర్ గుణ శేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైథిలాజికల్ మూవీగా రూపొందించిన ఈ శాకుంతలం సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించగా, దుష్యంతుడిగా దేవ్ మోహన్ నటించారు. పాన్ ఇండియా మూవీ గా ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. హీరోయిన్ సమంతతో పాటు డైరెక్టర్ గుణశేఖర్, నిర్మాత నీలిమ, దేవ్ మోహన్ లు కూడా ఉన్నారు. కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రంలో మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల, అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ కీలక పాత్రలుపో షించారు. -
రేవంత్‌పై పరువు నష్టం దావా వేస్తా: మాజీ ఎమ్మెల్యే విష్ణు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పబ్ లైంగిక దాడి ఘటనపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడి ఆవరణలో మైనర్‌నపై లైంగికదాడి జరిగిందని ఆరోపించారు. అయితే రేవంత్ వ్యాఖ్యలను ఆలయ ట్రస్ట్ సభ్యులు ఖండించారు. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పెద్దమ్మ గుడి ఆలయ ట్రస్ట్ సభ్యులు ఫిర్యాదు చేశారు. మరోవైపు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత విష్ణువర్దన్‌రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాలయంలో ఎలాంటి ఆసాంఘిక కార్యక్రమాలు జరగలేదన్నారు. రేవంత్‌రెడ్డి అసత్య ఆరోపణలు చేశారని, ఆలయ ఆవరణలో బాలికపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. సీపీ క్లారిటీ ఇచ్చినా రేవంత్ బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది పార్టీ వ్యవహారం కాదని.. పెద్దమ్మ తల్లి భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు తప్పు, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. రేవంత్‌పై టెంపుల్ తరపున పరువు నష్టం దావా వేస్తామని తెలిపారు.. పెద్దమ్మ టెంపుల్‌పై మాట్లాడేముందు తనను రేవంత్ కనీసం సంప్రదించలేదని పేర్కొన్నారు. -
ముగ్గురు విద్యార్థినుల అదృశ్యం
జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకే రోజు ముగ్గురు యువతులు అదృశ్యమయ్యారు. కనిపించకుండాపోయిన ముగ్గురూ ఒకే ప్రాంతానికి చెందినవారు. జవహర్‌నగర్‌లో నివసించే ఎ. శ్రీనిఖిత(21) హిందూ డిగ్రీ కళాశాలలో బీకాం సెకండియర్ చదువుతోంది. ఈ నెల 19నుంచి జరగనున్న పరీక్షల కోసం హాల్ టికెట్ తెచ్చుకుంటానని గురువారం ఉదయం మేనత్త కూతురు రితికతో కలసి వెళ్లింది. హాల్‌టికెట్ తీసుకున్న తర్వాత జూబ్లీహిల్స్ శ్రీపెద్దమ్మ దేవాలయానికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా ఇంటికి రాలేదు. ఫోన్‌చేయగా స్విచ్చాఫ్ వచ్చింది. అన్ని ప్రాంతాలు గాలించారు. స్నేహితులు, బంధువులతో పాటు స్వగ్రామంలోనూ ఆరా తీసినా ఉపయోగం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనతో కూడా వెళ్లిన రితిక కూడా కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబసభ్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరీక్షలు రాయడానికి వెళ్లి... బోరబండ ఎస్పీఆర్ హిల్స్ వినాయకనగర్‌లో నివసించే బి. ఎలీష(20) డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. చార్మినార్ వద్ద రాయల్ ఉమెన్స్ కాలేజీలో పరీక్షా కేంద్రం ఉండటంతో గురువారం ఉదయం 7గంటలకు బస్సులో చార్మినార్ వెళ్లింది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష సమయం కావడంతో సాయంత్రం 5 అవుతున్నా ఎలీషా ఇంటికి రాకపోవడంతో ఆమె స్నేహితురాలు శ్రీదేవికి ఫోన్ చేశారు. అయితే ఎలీషా పరీక్ష రాయడానికి రాలేదని శ్రీదేవి వెల్లడించింది. దీంతో ఆందోళన చెందిన కుటుంబీకులు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ఖమ్మంలో ఘనంగా బోణాలు
ఖమ్మం: ఖమ్మం నగరంలోని పంపింగ్‌వెల్ రోడ్‌లోని పెద్దమ్మతల్లి ఆలయంలో ఆదివారం బోణాల పండగ ఘనంగా జరుగుతోంది. భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తడంతో ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకటలాడుతున్నాయి. ఆదివారం మధ్యాహ్నం ఖమ్మం ఎంపీ, వైఎస్సార్సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, అధికారులు ఉన్నారు.