Samantha Visits Jubilee Hills Peddamma Talli Temple With Shakunthalam Team, Pics Goes Viral - Sakshi
Sakshi News home page

పెద్దమ్మ తల్లి గుడిలో సమంత పూజలు.. పిక్స్‌ వైరల్‌

Published Wed, Mar 15 2023 1:42 PM | Last Updated on Wed, Mar 15 2023 1:55 PM

Samantha Visits Jubilee Hills Peddamma Talli Temple With Shakunthalam Team - Sakshi

యశోద సినిమా తర్వాత రిలీజ్ కాబోతున్న సమంత మూవీ శాకుంతలం. డైరెక్టర్ గుణ శేఖర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మైథిలాజికల్ మూవీగా రూపొందించిన ఈ శాకుంతలం సినిమాలో సమంత లీడ్ రోల్ పోషించగా, దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ నటించారు. పాన్ ఇండియా మూవీ గా ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది.  

ఈ నేపథ్యంలో తాజాగా జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మతల్లిని ఆ సినిమా యూనిట్ దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేసింది. హీరోయిన్ సమంతతో పాటు డైరెక్టర్ గుణశేఖర్, నిర్మాత నీలిమ, దేవ్ మోహన్ లు కూడా ఉన్నారు. కాళిదాసు రచించిన ప్రేమకావ్యం ‘అభిజ్ఞాన శాకుంతలం’ ఆధారంగా రూపొందిన చిత్రంలో మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, గౌతమి, మధుబాల, అల్లు అర్జున్‌ కుమార్తె అల్లు అర్హ కీలక పాత్రలుపో షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement