
‘లేడి కన్నులు.. నెమలి నడక.. సివంగి నడుము...’ అంటూ నటుడు దేవ్ మోహన్ డైలాగ్‌తో ‘శాకుంతలం’ సినిమా ట్రైలర్ విడుదలైంది. సమంత టైటిల్ రోల్‌లో దేవ్ మోహన్ ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రం ‘శాకుంతలం’. ‘దిల్’ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించారు. ఈ నెల 14న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్.
‘మనసెటు పోతే అటు పోరాదని ముని వాక్కు’, ‘పుట్టగానే తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను.. మీ ప్రేమకు కూడా దూరమైతే’ (సమంత), ‘నీ కష్టానికి కన్నీళ్లు పెట్టగలమే కానీ.. నీ కర్మను పంచుకోలేం’ (గౌతమి) వంటి డైలాగులు ట్రైలర్‌లో ఉన్నాయి. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, మధుబాల, గౌతమి, అదితీ బాలన్, అనన్య నాగళ్ల, జిస్సు సేన్ గుప్తా తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, అడిషనల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: టబ్బీ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: హేమాంబర్ జాస్తి, కొమ్మినేని వెంకటేశ్వరరావు, లైన్ ప్రొడ్యూసర్: యశ్వంత్.
Comments
Please login to add a commentAdd a comment