
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలాకాలం తర్వాత మీడియా ముందుకు వచ్చింది. శాకుంతలం సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఆమె సందడి చేసింది. యశోద సినిమా రిలీజ్ టైంలో తాను మయోసైటిస్‌తో బాధపడుతున్న పేర్కొన్న సమంత అప్పటినుంచి ఇంటికే పరిమితమైంది. సుమతో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ మినహా మిగతా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో ఎక్కడా కనిపించలేదు.
తాజాగా అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత తొలిసారి ఆమె మీడియా ముందుకు వచ్చింది. వైట్‌శారీలో దేవకన్యలా మెరిసిపోయింది. దీనికి తోడు సమంత చేతిలో జపమాల కూడా కనిపించడం మరో విశేషం. కాగా గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
చదవండి: 'మాయ ప్రేమను మరిపిస్తుందేమో కానీ అవమానాన్ని కాదు'.. శాకుంతలం ట్రైలర్ అవుట్
Comments
Please login to add a commentAdd a comment