Shaakuntalam Motion Poster Out: Shakuntalam Movie Release Date Announced - Sakshi
Sakshi News home page

Shaakuntalam Movie : 'శాకుంతలం' మోషన్‌ పోస్టర్‌ వచ్చేసింది.. రిలీజ్‌ డేట్‌ అప్పుడే

Published Fri, Sep 23 2022 10:21 AM | Last Updated on Fri, Sep 23 2022 10:55 AM

Samantha Shaakuntalam Movie Gets Release Date - Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. దిల్ రాజు సమర్పణలో డిఆర్‌పి, గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  పౌరణిక నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శాకుంతలగా సమంతగా నటిస్తుండగా,  దుశ్యంతుడిగా మలయాళ నటుడు దేవ్ మోహన్ కనిపించనున్నారు. చిట్టి భరతుడి పాత్రలో అల్లు అర్హ నటించింది.

ఈ సినిమాతోనే అర్హ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ సినిమా నుంచి తాజాగా మరో కీలక అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్‌ సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా ప్రకటించారు. నవంబర్‌4న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో  గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement