
సమంత ప్రధానపాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలోనే సమంత శకుంతల పాత్రలో నటించగా, ఆమెకు జోడీగా దుష్యంతుడి పాత్రలో మలయాళ హీరో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న ఈ సినిమా పాన్‌ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు.
'ఈ భూమ్మిద అమ్మానాన్నలకు అక్కర్లేని తొలి బిడ్డ.. మేనకా విశ్వామిత్రుల ప్రేమకు గుర్తుగా ఈ బిడ్డ పుట్టింది. శకుంతల ఒక కారణ జన్మురాలు.. నవ నాగరికతకు నాంది పలకబోతోంది' అంటూ ట్రైలర్ ఆరంభం అవుతుంది. విజువల్స్, మణిశర్మ సంగీతం కట్టిపడేస్తుంది.
ఇక చివర్లో సింహం మీద అల్లు అర్హ ఎంట్రీ మరో హైలైట్ అని చెప్పొచ్చు. సమంత లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మరి ట్రైలర్‌లో కనిపిస్తున్న మ్యాజిక్ సినిమాలోనూ వర్కవుట్ అవుతుందా? అన్నది చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment