సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో వరుస ఇంటర్వ్యూలతో ప్రమోషన్స్ జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి శకుంతల, దుష్యంతుల అమర ప్రేమగాథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ముంబయిలో నిర్వహించిన ప్రమోషన్లలో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు సమంత.
సమంత మాట్లాడుతూ.. 'నేను చిన్నప్పటి నుంచీ డిస్నీ జోనర్ సినిమాలను చాలా ఇష్టపడేదాన్ని. నేను ఆనందంగా ఉన్నా, బాధలో ఉన్నా వాటినే చూసేదాన్ని. ఈ సినిమాలో యువరాణిగా నటించడం చాలా ప్రత్యేకంగా అనిపించింది. శాకుంతలం కథ నా దగ్గరకు వచ్చినప్పుడు చాలా ఆలోచించాను. కాస్త భయపడ్డా. కానీ, కొన్నేళ్లుగా సవాళ్లు స్వీకరించడం నాకు అలవాటైపోయింది. నా చిన్నతనంలో శకుంతల పాత్ర గురించి చాలా కలలు కనేదాన్ని. అమ్మాయిలు, మహిళలు, ఫ్యామిలీలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ పాత్రలో నటిస్తున్నంత సేపు ఓ ప్రేక్షకురాలిగా నేను సినిమాను ఆస్వాదించా. కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఇది. నా దృష్టిలో దర్శకుడు గుణశేఖర్ ఫెమినిస్ట్. ఆయన ఫీమేల్ ఓరియంటెడ్ కథలు రాస్తారు. ' అని అన్నారు.
అల్లు అర్జున్ గారాల పట్టి గురించి మాట్లాడుతూ.. 'నా దృష్టిలో అల్లు అర్హ స్వతంత్రురాలు. తనకు కావాల్సిన నిర్ణయాలు తానే తీసుకోగలదు. అర్హ కెరీర్ విషయంలో అల్లు అర్జున్ జోక్యం అవసరం లేదు. అర్హ కెరీర్‌లో ఇది అద్భుతమైన చిత్రం. అర్హ రోల్ చాలా అద్భుతంగా వచ్చింది. అందుకే పిల్లలు, ఫ్యామిలీస్ ఈ కథను ఆస్వాదిస్తారని నమ్ముతున్నా.' అని తెలిపింది.
పాన్ ఇండియా స్టార్ అయ్యాక జీవితం ఎలా మారింది? అని అడగ్గా సమంత సరదాగా స్పందించారు. తాను పాన్ ఇండియా స్టార్‌ననే విషయాన్ని తన పెంపుడు జంతువులకి ఎవరైనా చెబితే బాగుంటుందని అన్నారు. నేనింకా వాటి మలాన్ని ఎత్తిపోస్తున్నానంటూ నవ్వేశారు. నా జీవితం మారిందని నేను అనుకోలేదని.. కేవలం నేను ఆరు గంటల దాకానే స్టార్‌ని.. ఆ తర్వాత నా జీవితం చాలా సాదాసీదాగా ఉంటుందని సమంత అన్నారు. నేను చేస్తున్న పాత్రల విషయంలో చాలా ఆనందంగా ఉన్నానని..యాక్షన్ పాత్రలు కూడా చేస్తున్నట్లు వెల్లడించింది. ఫ్యామిలీమేన్2లో నేను చేసిన పాత్ర అలాంటిదేనని..ఎప్పుడూ అబలగానే కాదు.. సబలగా నటించాలని ఆమె అన్నారు.
(ఇది చదవండి: శాకుంతలం నుంచి విడుదలైన 'మల్లికా' వీడియో సాంగ్)
Comments
Please login to add a commentAdd a comment