
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రంలో సమంత శకుంతలగా నటించగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు.
ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కొన్ని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ మేకర్స్ పోస్టర్లు వదిలారు. తాజాగా అప్సర మేనక పాత్రలో సీనియర్ హీరోయిన్ మధుబాల కనిపించనుంది.
ఈ మేరకు ఆమె లుక్‌ని రివీల్ చేశారు మేకర్స్. మేనక కూతురే శకుంతల. అంటే ఈ చిత్రంలో మధుబాల సమంతకు తల్లిగా కనిపించనుంది. ఇప్పటికే ఆమె లుక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది.
Comments
Please login to add a commentAdd a comment