
సమంత ప్రధాన పాత్రలో నటించిన పాన్ ఇండియా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సమంత శకుంతలగా నటించగా దుష్యంతుడి పాత్రలో దేవ్ మోహన్ నటించారు. ఫిబ్రవరి 17న విడుదల కానున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఇప్పటికే ప్రమోషన్స మొదలుపెట్టిన మేకర్స్ ఈ సినిమా నుంచి రెండు పాటలను విడుదల చేశారు.
తాజాగా మరో పాటను రిలీజ్ చేశారు. 'ఏలేలో ఏలేలో ఏలో యాలా .. ఏటీలోన సాగే నావా' అనే సాంగ్‌ను విడుదల చేశారు.శకుంతల తన భర్తను కలుసుకోవడానికి నావలో బయల్దేరి వెళ్తున్న సందర్భంలో వచ్చే పాట ఇది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించారు.