Madhubala
-
అలనాటి అందాల తార.. అరుదైన ఫోటోలు
-
మధుభాల బయోపిక్ షురూ
‘ప్యార్ కియా తో డర్నా క్యా..’ అంటూ ‘మొఘల్ ఎ అజం’ (1960) చిత్రంలో వెండితెరపై అనార్కలిగా ప్రేమ కురిపించిన మధుబాలను నాటి తరం అంత సులువుగా మర్చిపోదు. ఈ తరం ప్రేక్షకుల కోసం ఆమె జీవితం వెండితెరకు రానుంది. ‘ఇండియన్ సినిమా సౌందర్య దేవత’గా కితాబులందుకున్న మధుబాల తన ఇరవయ్యేళ్ల కెర్ర్లో అరవైకి పైగా చిత్రాల్లో నటించారు. ‘మిస్టర్ అండ్ మిసెస్ 55, హాఫ్ టికెట్, మహల్, బాదల్’.. ఇలా పలు చిత్రాల్లో తన అందం, అభినయంతో ఆకట్టుకున్నారు మధుబాల. 1933లో జన్మించిన మధుబాల అతి చిన్న వయసు (36)లోనే కన్ను మూశారు. ఈ 36 ఏళ్ల జీవితంలో మధుబాల సినీ, వ్యక్తిగత జీవితం గురించి తెలియని చాలా విషయాలను బయోపిక్‌లో చూపించనున్నారు. ప్రముఖ నటుడు దిలీప్‌కుమార్‌తో అనుబంధం, ప్రముఖ గాయకుడు, నటుడు కిశోర్‌కుమార్‌తో వివాహం వంటి విషయాలూ ఈ చిత్రంలో ఉంటాయట. ఆలియా భట్‌తో ‘డార్లింగ్స్’ చిత్రాన్ని తెరకెక్కించిన జస్మీత్ కె రీన్ మధుబాల బయోపిక్‌కి దర్శకురాలు. ఈ చిత్రాన్ని మధుబాల వెంచర్స్ పతాకంపై మధుబాల సోదరి మధుర్ బ్రిజ్ భూషణ్ నిర్మించనున్నారు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రోడక్షన్స్, బ్రూయింగ్ థాట్స్ ్రౖపైవేట్ లిమిటెడ్ కూడా నిర్మాణ భాగస్వాములుగా ఉంటాయి. ‘‘ఈ చిత్రంతో ఎవరి మనోభావాలనూ దెబ్బ తీయాలనే ఆలోచన లేదు. మధుబాల జీవితం గురించి ఉన్న కొన్ని అపోహలను ఈ చిత్రం తొలగిస్తుంది. సినిమా కోసం కొంత స్వేచ్ఛ తీసుకున్నప్పటికీ నిజాయితీగానే రూపొందిస్తాం’’ అని మధుర్ పేర్కొన్నారు. ఇంకా కథానాయిక ఖరారు కాలేదు. కాగా శుక్రవారం ఈ బయోపిక్ ప్రకటన వచ్చినప్పట్నుంచి మధుబాలగా నటించే చాన్స్ ఏ కథానాయికకు దక్కుతుందనే చర్చ మొదలైంది. -
రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ నేపథ్యంలో ‘గేమ్ ఆన్’
ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్ టైమ్ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అన్న ఇత్తివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ...గేమ్ ఆన్ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మిగతా పాటలు, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాను ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రథం చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గీతానంద్ ఈ చిత్రంతో హీరోగా నెక్ట్స్ లెవల్ కు వెళ్తాడన్న నమ్మకం ఉంది. అలాగే నేహ సోలంకి తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం విభిన్నమైన కథలతో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ కోవలో వస్తోన్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం` అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. కచ్చితంగా మా సినిమా ప్రేక్షకులకు న్యూ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందన్నారు. -
సమ్మర్లో గీతానంద్ ‘గేమ్ఆన్’
ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్ టైమ్ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అన్న ఇత్తివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధు బాల, ఆదిత్య మీనన్ కీలక పాత్ర నటిస్తున్నారు. ఈ సనిమాను సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ ‘‘రథం చిత్రం తర్వాత గీతానంద్‌ని మరోస్థాయిలో నిలబెట్టే చిత్రమిది. గీతానంద్, దయానంద్ ఇద్దరిలో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. ప్రతి ఫ్రేమ్ మిమ్మల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. అలాగే ఈ సినిమాకు మేము చేసే ప్రతి ప్రమోషన్ కూడా వినూత్నమైన రీతిలో ఉంటుంది. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’అని అన్నారు. ‘ట్విస్టులు, టర్నులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కథ సాగుతుంది. సినిమాలో యాక్షన్, రొమాన్స్. ఎమోషన్స్... అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’అని దర్శకుడు దయానంద్ అన్నారు. ‘ఈ చిత్రంలో పాత్రలన్ని గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’అని హీరో గీతానంద్ చెప్పారు. -
నిజజీవితంలో జరిగే సంఘటనలే 'సత్యం వధ ధర్మం చెర'
పూజ, మధుబాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సత్యం వధ ధర్మం చెర'. వి.శ్రీనివాస్ ఆర్ట్ క్రియేషన్స్, త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై ఎదుబాటి కొండయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 31న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది. దర్శకుడు బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ..' చిన్న పిల్లలకి నిద్రపుచ్చడానికి కథలు చెప్తు ఉంటాం. కానీ పెద్దలను మేలుకొల్పటానికి కొన్ని కథలు చెప్పాల్సిందే. ఈ చిత్ర కథ మన నిజ జీవితంలో ప్రతిరోజూ జరిగే సంఘటనలే. మనం ప్రతి రోజు ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాం. మన రాజ్యాంగం చాలా గొప్పది. మన చట్టం చాలా గట్టిది. మరీ నిజంగా చట్టం ఎలా పనిచేయాలో మా సినిమాలో చుపించాం. ఈ చిత్రం మార్చి 31న విడుదల కానుంది.' అని అన్నారు. హీరోయిన్ పూజ మాట్లాడుతూ..'నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకి ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. అందరు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా.' అని అన్నారు. మరో నటి మధుబాల మాట్లాడుతూ..'నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకి ధన్యవాదాలు. నాది చాలా కీలక పాత్ర. బాలకృష్ణ గారి సినిమా డైలాగు తో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో నేను నటించాను. ఆ పాట చూస్తే బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే. మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.' అని అన్నారు. ఈ చిత్రంలో స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, సుధానిసా, రాధికా చౌదరి, అర్జు, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనంతలక్ష్మి, నాని తదితరులు నటించారు. -
మేనకగా సీనియర్ నటి మధుబాల.. ఆకట్టుకుంటున్న లుక్
సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం శాకుంతలం. గుణశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మించిన ఈ సినిమా అనేక వాయిదాల అనంతరం ఏప్రిల్ 14న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ చిత్రంలో సమంత శకుంతలగా నటించగా, మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటించాడు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో కొన్ని క్యారెక్టర్లను పరిచయం చేస్తూ మేకర్స్ పోస్టర్లు వదిలారు. తాజాగా అప్సర మేనక పాత్రలో సీనియర్ హీరోయిన్ మధుబాల కనిపించనుంది. ఈ మేరకు ఆమె లుక్‌ని రివీల్ చేశారు మేకర్స్. మేనక కూతురే శకుంతల. అంటే ఈ చిత్రంలో మధుబాల సమంతకు తల్లిగా కనిపించనుంది. ఇప్పటికే ఆమె లుక్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. -
తమ్ముడి దర్శకత్వంలో అన్నయ్య గేమ్ ఆన్
ఇంతకుముందు అన్నయ్య దర్శకత్వంలో తమ్ముడు కథానాయకుడిగా నటించిన చిత్రాలు చూశాం. అలా నటుడు మోహన్ రాజా దర్శకత్వంలో జయం రవి కథానాయకుడిగా, సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. కాగా తాజాగా తమ్ముడు దర్శకత్వంలో అన్నయ్య కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం రూపొందడం విశేషం. ఆ చిత్రమే గేమ్ ఆన్ బాబు.జి సమర్పణలో కస్తూరి క్రియేష¯న్స్, గోల్డెన్ రింగ్స్ ప్రొడక్ష¯న్స్ సంస్థల ద్వారా రవి కస్తూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దయానంద్ కథ కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయన అన్నయ్య గీతానంద్ కథానాయకుడుగా నటిస్తున్న ఇందులో నేహా సోలంగి నాయకిగా నటిస్తున్నారు. ప్రధాన పాత్రలో నటి మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, వాసంతి కృష్ణన్ తదితరులు నటిస్తున్నారు. దీనికి అభిõÙక్ ఏఆర్ సంగీతాన్ని, అరవింద్ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ సిద్ధార్థ అనే 27 ఏళ్ల యువకుడు ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో వ్యాపార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడన్నారు. అతనికి రాహుల్ అనే మిత్రుడు మోక్ష అనే స్నేహితురాలు ఉంటారన్నారు. అయితే ఒకరోజు ఉద్యోగం పోవడంతో తన ఇంటికి వచ్చిన సిద్ధార్థకు అక్కడ తాను ఎంతగానో ప్రేమించే మిత్రులు చేస్తున్న ఓ పని చూసి షాక్‌కు గురౌతున్నారు. తన జీవితంలో తాను ప్రేమిస్తున్న అందరూ తనను అవసరానికి వాడుకుంటున్నారనీ, ఎవరూ నిజమైన ప్రేమను అందించడం లేదని గ్రహించి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడతాడన్నారు. అలాంటి సమయంలో అనూహ్యంగా ఒక వ్యక్తి రక్షించడంతో ప్రాణాపాయం నుంచి రక్షించబడి రియల్ టైం సైకాలజికల్ అనే గేమ్ లోకి అడుగు పెడతాడని చెప్పారు. ఆ తర్వాత అతని జీవితం ఎటువైపు మళ్లిందనే పలు ఆసక్తికరమైన అంశాలతో గేమ్ ఆన్ చిత్రం రూపొందినట్లు పేర్కొన్నారు. -
ప్రేమ దేశం చిత్రంలో నటించడం నా అదృష్టం: నటి మధుబాల
‘‘ప్రేమదేశం’ వంటి మంచి సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీకాంత్ సిద్ధం చెప్పిన కథ, నా పాత్ర నచ్చి ఈ సినిమా చేశా’’ అన్నారు నటి మధుబాల. త్రిగున్, మేఘా ఆకాష్, మధుబాల ప్రధాన పాత్రల్లో శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమదేశం’. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న రిలీజ్ కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకకి ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ‘హిట్ 1, 2’ డైరెక్టర్ శైలేష్ కొలను అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మధుబాల మాట్లాడుతూ.. ‘‘మా నాన్న నన్ను డాక్టర్‌గా చూడాలనుకున్నారు. అయితే నాకు ‘ఫూల్ ఔర్ కాంటే’ సినిమాకి చాన్స్ రావడం, అది హిట్టవడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు’’ అన్నారు. ‘‘ఈ చిత్రాన్ని షార్ట్ ఫిలింగా తీద్దామనుకున్నాను. అయితే నా ఫ్రెండ్స్ సపోర్ట్ చేయడంతో పెద్ద సినిమా అయింది’’ అన్నారు శ్రీకాంత్ సిద్ధం. -
అందుకే ఆ పాత్రకు మధుబాలను తీసుకున్నాం: ‘ప్రేమదేశం’ డైరెక్టర్
‘హైదరాబాద్ లో బి.టెక్ చదువుకొని అమెరికా వెళ్లి సాఫ్ట్ వెర్ లో జాబ్ చేస్తున్న నాకు సినిమా తియ్యాలనే ప్యాషన్ ఉండడంతో ఇండియాకు రావడం జరిగింది. . డైరెక్షన్ పరంగా నేను ఎవరి దగ్గర పని చేయలేదు. షార్ట్ ఫిలిం తీసిన నేను నెక్స్ట్ స్టెప్ లో మంచి లవ్ సబ్జెక్టు ఉన్న ఫ్యూచర్ ఫిలిం తీస్తే బాగుంటుందని, ‘ప్రేమదేశం’ తీశా’ అని చిత్ర దర్శక, నిర్మాత శ్రీకాంత్ సిద్ధం అన్నారు. .సిరి క్రియేటివ్ వర్క్స్’ బ్యానర్ పై త్రిగున్ , మేఘా ఆకాష్ హీరో హీరోయిన్లుగా శ్రీకాంత్ సిద్ధం స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమదేశం’. అలనాటి అందాల తార మధుబాల ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 3న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత శ్రీకాంత్ సిద్దం మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ► రెండు విభిన్నమైన ప్రేమ కథలను తీసుకొని చేసిన సినిమానే ‘ప్రేమదేశం’. మంచి కంటెంట్ ఉన్న ఈ సినిమాలో మంచి మోడరన్ గెటప్ ఉన్న తల్లి పాత్రకు ఇదివరకే చేసిన వారితో చేస్తే రొటీన్ గా ఉంటుందని అలాగే ప్రేక్షకులకు కొంత ఫ్రెస్ నెస్ తో పాటు ఆ క్యారెక్టర్ లో కొంత బబ్లీ నెస్ ఉంటుందని భావించి మధుబాల గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. వారితో పాటు విలక్షణ నటుడైన తనికెళ్ల భరణి గారు ఈ చిత్రంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. ► ఇందులో తల్లీ,కొడుకుల రిలేషన్ చాలా చక్కగా చూపించడం జరిగింది. త్రిగున్ , మేఘా ఆకాష్ పెయిర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. వారిద్దరూ మంచి పర్ఫామెన్స్ ఇవ్వడమే కాకుండా ఎంతో సహజంగా నటించారు. ఇంకా మిగిలిన నటి,నటులు కొత్తవారైనా చాలా చక్కగా నటించారు ► ప్రేమదేశం అంటే ఎక్కువగా కనెక్ట్ అయ్యేది యూత్. యూత్ బేస్డ్ గా చూస్తే సాంగ్స్ పరంగా, సీన్స్ పరంగా, కాలేజీ బ్యాక్ డ్రాప్ పరంగా చాలా కేర్ తీసుకొని చేయడంతో యూత్ ని బాగా ఆకట్టుకుంటుంది. ► నాటి “ప్రేమదేశం” సినిమాకు ఏఆర్ రహమాన్ ప్రాణం పోస్తే.. నేడు మణిశర్మ తన బ్యాగ్రౌండ్ స్కోర్ తోను సంగీతం తోను అంతే ప్రాణం పోశాడు. మేము విడుదల చేసిన “ప్రేమదేశం” టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.. ఇందులోని “పదములే లేవు పిల్ల” పాట, తెలవారెనే స్వామి ఇలా ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు కూడా అన్ని మాధ్యమాలలో టాప్ చార్ట్ బస్టర్ గా నిలిచాయి . ► ఈ సినిమా కథ విషయంలో విజువల్ గా నా మైండ్ లో బౌండ్ స్క్రిప్ట్ రికార్డ్ అయిన అందువల్ల అదే వేలో వెళ్ళాను. డైరెక్టర్ గా నాకు ఎటువంటి ఇబ్బందులు కలగలేదు కానీ ఓన్ గా ప్రొడక్షన్ చేయడం, అలాగే కొంత మంది ఫ్రెండ్స్ తో కలసి ఈ సినిమా చేయడం జరిగింది. సినిమా బాగా రావాలనే క్రమంలో కొంత బడ్జెట్ పెరిగింది. దాంతో ఫైనాన్స్ పరంగా కొంత ఇబ్బంది ఎదురైనా కూడా ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేశాం. ఆలా చెయ్యడానికి కారణం మాకు కథ మీద ఉన్న నమ్మకం, అలాగే మణి శర్మ గారిమీద ఉన్న విశ్వాసం. ఈ రెండు ఉండడం వలన ప్రేక్షకులను కచ్చితంగా థియేటర్స్ రప్పిస్తుందనే నమ్మకం ఉంది. ► అప్పటి బ్లాక్ బస్టర్ ప్రేమదేశం సినిమాకు ఎ మాత్రం తగ్గకుండా కాలేజ్ బ్యాక్ డ్రాప్‌తో ఔట్ అండ్ అవుట్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ సినిమా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ అందరినీ కచ్చితంగా అలరిస్తునే నమ్మకం ఉంది. -
కామెడీ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధమే: మధుబాల
‘‘ప్రేమ దేశం’ సినిమాలో తల్లీకొడుకుల బంధాన్ని చక్కగా చూపించారు. ‘ప్రేమ దేశం’లో నేను ఒక హీరోయిన్లాంటి పాత్రలోనే కనిపిస్తాను’’ అని నటి మధుబాల అన్నారు. త్రిగుణ్, మేఘా ఆకాష్ జంటగా శ్రీకాంత్ సిద్ధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమ దేశం’. శిరీష సిద్ధం నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. ఈ చిత్రంలో తల్లి పాత్ర చేసిన మధుబాల మాట్లాడుతూ.. ‘‘ప్రేమ దేశం’లో త్రిగుణ్, మేఘా ఆకాష్ బాగా నటించారు. నా కెరీర్ ప్రారంభంలో అన్ని భాషల్లో సినిమాలు చేశాను. ఇప్పుడు తెలుగులో చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది.. అందుకే తెలుగు సినిమాల మీద ఫోకస్ పెట్టాను. నేను నటించిన మరో తెలుగు సినిమా ‘గేమ్’ మంచి కథతో రాబోతోంది. కథ బాగుంటే నెగెటివ్ రోల్ అయినా, కామెడీ రోల్ అయినా ఓకే. ప్రస్తుతం హిందీలో ‘కర్తమ్ హుక్తమ్’తో పాటు మరో సినిమా చేస్తున్నాను. అలాగే ‘దేజావు’ అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రం, వివేక్ శర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాను. జీ5లో ఓ వెబ్ సిరీస్ చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. చదవండి: విడాకుల పుకార్లను తీవ్రంగా ఖండించిన శ్రీకాంత్ సినీ నటి జీవిత టార్గెట్‌గా.. జియో పేరుతో టోకరా! -
'డేజావు' కాన్సెప్ట్‌తో నవీన్ చంద్ర 'రిపీట్'.. నేరుగా ఓటీటీలో
Naveen Chandra Repeat Movie Sneak Peek Video Out: థియేటర్, ఓటీటీ అని సంబంధం లేకుండా తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలను అన్నింటినీ చేసుకుంటూ పోతున్నాడు నటుడు నవీన్ చంద్ర. ఇటీవలే పరంపర రెండో సీజన్లో సీరియస్ పాత్రలో అదరగొట్టిన ఈయన తాజాగా మరో కొత్త సినిమాతో అలరించబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిపీట్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతోంది. ఆగస్టు 25 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్ ఇటీవల ప్రకటిస్తూ ట్రైలర్ కూడా విడుదల చేసింది. తాజాగా రిపీట్ స్నీక్ పీక్ పేరిట మూడున్నర నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్ చేశారు. ''ఈ వీడియోలో ఒక రైటర్ ఏదో సీరియస్‌గా రాస్తుంటాడు. ఎదురుగా చిరాకుగా ఉన్న ఒకామె అతన్ని చూసి ఏం రాశాడో చదవమని ఒకరికి సైగ చేస్తుంది. ఆ పేపర్ తీసుకున్న వ్యక్తి చదివాక వెంటనే ఆమె విక్రమ్‌కి కాల్ చేయండి అని అంటుంది. ఫోన్ కాల్ మాట్లాడిన విక్రమ్‌కు ఒక బ్రిడ్జి కింద నీటిలో అమ్మాయి మృతదేహం దొరుకుతుంది.'' అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ రైటర్ ఎవరు? అతను రాసినట్లుగా ఎందుకు జరిగింది? పోలీసులు అతని మాటలు ఎందుకు నమ్మారు? అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 25 వరకు ఆగాల్సిందే. చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్ ఇక సినిమా విషయానికొస్తే అరవింద శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రిపీట్'. నవీన్ చంద్ర, మధుబాల, అచ్యుత్ కుమార్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళ్ మూవీ 'డేజావు'కు రీమేక్‌గా రానుంది. ఈ సినిమాలో డేజావు (ప్రస్తుతం జరుగుతున్న విషయం ఇంతకుముందే జరిగినట్లుగా అనిపించే అనుభూతి) ప్రధానాంశంగా ఉండి, ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందని డైరెక్టర్ అరవింద శ్రీనివాసన్ పేర్కొన్నారు. -
మధుబాల సోదరికి టార్చర్, డబ్బు, నగలు లాక్కొని గెంటేసింది!
అత్తను తల్లిగా, కోడలిని కూతురిగా భావించాలంటారు. కానీ అలా అల్లుకుపోయి అన్యోన్యంగా ఉండే కుటుంబాలు చాలా తక్కువ. రెక్కలొచ్చాక కన్నపేగును దూరం పెడుతూ బతికుండగానే నరకం చూపిస్తున్నవాళ్లే ఎక్కువ. కొన్నిసార్లు కొడుకులు చూసుకున్నా కోడళ్లు మాత్రం రాక్షసంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితే అలనాటి హీరోయిన్ మధుబాల అక్కకు ఎదురైంది. కొడుకు అంటే పంచప్రాణాలైన ఆమె అతడితో పాటే విదేశాలకు వెళ్లింది. కానీ కోడలు ఆమెను కనీసం మనిషిగా కూడా చూడకుండా తిండి పెట్టకుండా చిత్రహింసలు పెట్టింది. ఆమెకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడామె ఎలా ఉంది? అనేది చదివేయండి.. మధుబాల అక్క కనీజ్ బల్సారాకు కొడుకు ఫరూఖ్ అంటే ప్రాణం. అతడికి కూడా తల్లంటే వల్లమాలిన ప్రేమ. అందుకే న్యూజిలాండ్‌కు వెళ్లేటప్పుడు భార్య సమీనాతో పాటు తల్లిదండ్రులను కూడా తీసుకెళ్లాడు. కానీ సమీనాకు అతడి పేరెంట్స్ అంటే గిట్టదు. సరిగా చూసుకునేది కాదు. వాళ్లకు భోజనం కూడా పెట్టకపోతే ఫరూఖ్ బయట నుంచి తీసుకువచ్చి మరీ పేరెంట్స్‌కు తిండి పెట్టేవాడు. అయినా సరే కనీజ్.. కొడుకుతో ఉంటే చాలనుకుంది. అప్పుడప్పుడు కూతురు పర్వీజ్‌ను చూసేందుకు ఇండియా వచ్చి వెళ్లేది. తర్వాత భర్త చనిపోవడంతో ఒంటరయ్యింది. అనారోగ్య సమస్యల కారణంగా గత ఐదేళ్లుగా భారత్‌కు రావడం కూడా మానేసింది. ఇంతలో జనవరి 8న కొడుకు కన్నుమూయడంతో పుట్టెడు శోకంలో మునిగిపోయింది. ఇలాంటి విషాద సమయంలో అత్త మీద మరింత జులుం ప్రదర్శించింది సమీనా. ఆమె దగ్గరున్న డబ్బులు, నగలు అన్నింటినీ లాగేసుకుని ఇంటి నుంచి వెల్లగొడుతూ.. జనవరి 29న ఇండియాకు ఫ్లైట్ ఎక్కించింది. ఆమెను పంపించేసిన ఈ విషయాన్ని భారత్‌లో ఉన్న బంధువులకు ఫోన్ చేసి తెలిపింది. ఇది తెలిసిన కనీజ్ కూతురు పర్వీజ్ హుటాహుటిన ముంబై విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడ కనీజ్కు కరోనా పరీక్ష చేసుకునేందుకు డబ్బులు కూడా లేవని తెలియడంతో వెంటనే తన దగ్గరున్న డబ్బును సిబ్బందికి అందించింది. కరోనా పరీక్ష ముగిసి బక్కచిక్కిన దేహంతో బయటకు వచ్చిన ఆమె 'బేటా, ఫరూఖ్ చనిపోయాడు తెలుసా? అది చెప్పడానికే నేను వచ్చాను. నాకు చాలా ఆకలైతుంది బిడ్డా, తినడానికి ఏదైనా ఇస్తావా?' అని దీనంగా అడగడంతో కన్నీటి పర్యంతమైంది పర్వీజ్. తల్లిని ఇంటిని తీసుకువచ్చి కడుపునిండా భోజనం పెట్టి స్నానం చేయించింది. తన తల్లి ఇంకా బతికే ఉన్నందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూనే గయ్యాలి సమీనాను తిట్టిపోసింది. -
శ్యామ్ సింగరాయ్‌పై మధుబాల వీడియో.. సాయిపల్లవి రిప్లై
నాని హీరోగా 'టాక్సీవాలా' ఫేం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదలైంది. క్రిస్మస్ కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. జనవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. మూవీలో దేవదాసి పాత్రకు ప్రాణం పోసిన నేచురల్ బ్యూటీ సాయిపల్లవి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా సీనియర్ నటి మధుబాల శ్యామ్ సింగరాయ్ సినిమా చూడటమే కాక దీనిపై రివ్యూ ఇచ్చింది. 'శ్యామ్ సింగరాయ్ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సాయిపల్లవి సహజ నటన, అందం, అంతకుమించిన డ్యాన్స్ అన్నీ బాగున్నాయి. నేను ఆమెకు పెద్ద అభిమానిని. నాని ఫెంటాస్టిక్‌గా నటించాడు' అని పేర్కొంటూ సెల్ఫీ వీడియో పోస్ట్ చేసింది. దీనికి సాయిపల్లవి స్పందిస్తూ.. 'మీ ప్రశంసలకు ధన్యవాదాలు మేడమ్. మీ పొగడ్తలకు నేను ఉప్పొంగిపోతున్నాను' అని ట్వీట్ చేసింది. I feel like I received a warm hug, I’m so overwhelmed🥺🙈 Thank you so much for the kind words, ma’am ♥️ lots of love to you ♥️🙏🏻 https://t.co/fjK1joF7P9 — Sai Pallavi (@Sai_Pallavi92) January 29, 2022 -
మరోసారి అరవింద్ స్వామితో జతకట్టిన మధుబాల
సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జయలలిత పాత్రలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నటిస్తుండగా, ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామి నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్దమవుతుండగా తాజాగా దీని నుంచి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఇందులో ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ పాత్రలో ప్రముఖ నటి మధుబాల నటిస్తున్నారు. ఇందులో ఆమె లుక్‌ను తాజాగా మేకర్స్ విడుదల చేశారు. ఎంజీఆర్(అరవింద్ స్వామి), మధుబాల సన్నివేశానికి సంబంధించిన వారిద్దరి ఫొటోను షేర్ చేశారు. 1992లో వచ్చిన మణిరత్నం మ్యుజికల్ హిట్ చిత్రం ‘రోజా’లో అరవింద్ స్వామి, మధుబాల జోడి హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక 28 ఏళ్ల తర్వాత వీరిద్దరూ మరోసారి ‘తలైవి’ కోసం జతకట్టారు. ఈ సందర్భంగా మధుబాల మాట్లాడుతూ.. ‘తలైవి మూవీ షూటింగ్ చాలా బాగా వచ్చింది. ఈ మూవీ ఎప్పుడేప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న క్రమంతో కరోనా సెకండ్ వేవ్ వచ్చింది. దీంతో మార్చిలో విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. అయితే థియేటర్లోకి ఎప్పుడు వస్తుందో క్లారిటీ లేదు. కానీ ‘తలైవి’ మాత్రం ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం’ అంటూ చెప్పుకొచ్చారు. కాగా మధుబాల రోజా మూవీ తర్వాత పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత బ్రేక్ తీసుకున్నారు. 2017లో వచ్చిన కన్నడ చిత్రం ‘కాలేజీ కుమార్’తో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీకి అంతగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు తాజాగా ఆమె మరోసారి తలైవి మూవీతో ప్రేక్షకులను అలరించబోతున్నారు. View this post on Instagram A post shared by Thalaivi (@thalaivithefilm) -
శ్రీమతి ఎంజీఆర్
మధుబాల మంచి నటి. ‘రోజా’, ‘జెంటిల్‌మేన్’ వంటి సినిమాలు చాలు.. ఆమె ఎంత మంచి నటో చెప్పడానికి. కథానాయికగా మంచి పాత్రలు చేసిన మధు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అలాంటి పాత్రలే చేస్తున్నారు. వచ్చే నెల 23న విడుదల కానున్న ‘తలైవి’లో ఆమె ఓ నిజజీవిత పాత్ర చేశారు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కంగనా టైటిల్ రోల్ చేశారు. ఇందులో ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ పాత్రను మధుబాల చేశారు. శుక్రవారం (మార్చి 26) మధుబాల బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్ విడుదలైంది. ఆస్పత్రిలో ఎంజీఆర్ పక్కన కూర్చుని, ఆయన్ను చూస్తున్న జానకీ రామచంద్రన్ లుక్‌కి మంచి స్పందన లభించింది. -
లాక్డౌన్లో ఏం చేస్తున్నారు?
నెలరోజులయింది అందరం లాక్డౌన్లో ఉండి. గృహ నిర్భందనను, ప్రభుత్వ నిబంధనలను క్రమంగా పాటిస్తూ కరోనా దరి చేరకుండా పోరాటం చేస్తున్నాం. ఈ 30 రోజుల్లో ఏం చేశాం? ఏం నేర్చుకున్నాం? ఈ లాక్డౌన్ పూర్తయ్యేలోగా ఎలాంటి విషయాలు నేర్చుకొని బయటకు రావాలనుకుంటున్నాం? ఒక్కసారి అందరం స్వీయ పరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది. ఇవే ప్రశ్నలను కొందరు స్టార్స్‌ని అడిగితే ఇలా సమాధానమిచ్చారు. అంత్యక్రియలకు కూడా అడ్డుపడుతోంది - భూమిక ‘‘ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సమానమే. మన కులం, మతం, స్టేటస్ ఇవేమీ మనల్ని ఎక్కువ... తక్కువ చేయవు. ఈ విషయం కంటికి కనిపించని ఒక్క సూక్ష్మ జీవి మళ్లీ మనందరికీ గుర్తు చేస్తోంది’’ అన్నారు భూమిక. లాక్డౌన్ సమయంలో ఏం చేస్తున్నారు అనే విషయం గురించి ఈ విధంగా చెప్పారు. కరోనా వైరస్ మనకు తెలియకుండానే దాడి చేస్తుంటుంది. చివరకు మనకు సరైన అంత్యక్రియలు కూడా జరగనివ్వకుండా చేస్తోంది. గోల్డెన్ టెంపుల్లో ఆధ్యాత్మిక గీతాలు ఆలపించే నిర్మల్ సింగ్ కల్సా పద్మశ్రీ పొందారు. ఆయన ఇటీవలే కరోనాతో మరణించారు. ఆయన అంత్యక్రియలు ఊరి స్మశానంలో జరపొద్దని, వైరస్ వ్యాప్తి చెందుతుందని గ్రామ ప్రజలు అడ్డుపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో టైమ్ గడుపుతున్నాను. ఇంటి పని, వంట పని, మా పిల్లాడిని చదివిస్తూ, వాడితో ఆడుకుంటున్నాను. మొక్కల్ని పెంచుతున్నాను. మా కుక్కల్ని చూసుకుంటున్నాను. కరోనా నిజంగా మ్యాజిక్ చేసింది. అందరూ తమ ఇంటి సభ్యులతో ఎక్కువసేపు గడిపేలా చేస్తోంది. వ్యాయామం చేస్తున్నాను. పంజాబీ మాట్లాడటం వచ్చు కానీ రాయడం, చదవడం రాదు. ప్రస్తుతం పంజాబీ నేర్చుకుంటున్నా. అలాగే కరోనా మనందరిలో క్రమశిక్షణ, కంట్రోల్‌ను చాలావరకూ నేర్పింది. సాధారణంగానే నేను చాలా పరిశుభ్రతను పాటించే వ్యక్తిని. అందుకని శుభ్రం గురించి కొత్తగా నేర్చుకున్న విషయాలే లేవు. మానవత్వం మీద గౌరవం పెరిగింది - మధుబాల ‘‘ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే మానవత్వం, కృతజ్ఞతాభావం వంటి వాటి పట్ల నాకు ఉన్న గౌరవం పెరిగింది. ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న ఈ కరోనా గడ్డు పరిస్థితుల నుంచి మనందరం త్వరగా బయటపడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నటి మధుబాల. ఇంకా పలు విషయాలను ఇలా పంచుకున్నారు. ప్రస్తుతం అందరం కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. సాధారణంగా నా భర్త, పిల్లలు చాలా బిజీగా ఉంటారు. నిజానికి ఒక రోజులో మేం అందరం ఇంట్లో కలుసుకునే సందర్భాలు కూడా తక్కువ. ప్రస్తుతం అందరం ఇంట్లోనే ఉంటున్నాం. రోజంతా మా ముఖాలు మేమే చూసుకుంటున్నాం. నా భర్త, నా పిల్లలు కొంచెం ఆన్లైన్ వర్క్ చేస్తున్నారు. నాకు అలా కుదరదు కాబట్టి వ్యాయామం, యోగ, డ్యాన్స్, రీడింగ్ వంటివి చేస్తున్నాను. రోజులో సమయం కుదిరినప్పుడు అమేజాన్, నెట్‌ఫ్లిక్స్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో సినిమాలు చూస్తున్నాను. వ్యాయామానికి, రీడింగ్‌కు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నాను. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నేను మానసికంగా ధృడంగా ఉండాలని కోరుకుంటాను. నా బాడీ, మైండ్ ఆరోగ్యంగా ఉండేందుకు శ్రమిస్తాను. నేను బుక్స్ ఎక్కువగా చదువుతాను. ప్రస్తుతం ఫిక్షన్‌కి చెందినవి కాకుండా కొన్ని సీరియస్ బుక్స్ చదువుతున్నాను. దీని వల్ల నాకు తెలియని విషయాలను తెలుసుకోగలుగుతున్నాను. నాలెడ్జ్ పెంచుకుంటున్నాను. శారీరకంగా, మానసికంగా మరింత స్ట్రాంగ్‌గా ఉండేందుకు ఈ లాక్డౌన్ సమయాన్ని ఉపయోగించు కుంటున్నాను. ప్రకృతిని గౌరవించడం మర్చిపోయాం - తేజ ‘‘మనుషులందరం ప్రకృతిని గౌరవించడం మర్చిపోయాం. ఆ వైఖరి మారాలి’’ అంటున్నారు దర్శకుడు తేజ. లాక్డౌన్ సమయాల్లో ఆయన ఏం చేస్తున్నారు? అనే విషయాలు పంచుకున్నారు. ‘‘ఈ లాక్ డౌన్ వల్ల మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే.. భూమి కేవలం మనకు (మనుషులకు) మాత్రమే కాదు. భూమి మీద నివశించే ప్రతీ ఒక్కరికీ అంతే హక్కు ఉంటుంది. ప్రస్తుతం ఇంట్లోనే ఉంటూ పుస్తకాలు చదువుతున్నాను, రాసుకుంటున్నాను, గిన్నెలు శుభ్రం చేస్తున్నాను, మా కుక్కపిల్లలకు స్నానం చేయించడం, మొక్కలకు నీళ్లు పోయడం, గార్డెనింగ్ చేయడం, మా ఆవిడ నిత్యావసర సరుకులు కొనడానికి బయటకు వెళ్లినప్పుడు తనకు డ్రైవర్‌గా ఉండటం వంటి పనులు చేస్తున్నాను. లాక్డౌన్ పరిస్థితుల ఆధారంగా ఓ కథ రాస్తున్నాను. గాలి ద్వారా వ్యాప్తి చెందే వైరస్ల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థలో కోర్స్ నేర్చుకుంటున్నాను. ఇది ఎలా వస్తుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలను అవగాహన చేసుకుంటున్నాను. ఈ కోర్స్ పాస్ అవుతాననే అనుకుంటున్నాను. తేజ, అల్లరి నరేష్ వంట చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు - అల్లరి నరేష్ ‘‘లాక్డౌన్లో భాగంగా గడిచిన ఈ 30 రోజులు ఓ వినూత్నమైన అనుభవాన్నిస్తున్నాయి. కరోనా కారణంగా మనకంటే తీవ్రంగా నష్టపోయిన కొన్ని దేశాల్లోని ప్రçస్తుత పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి’’ అన్నారు ‘అల్లరి’ నరేష్. ఇంకా పలు విషయాలను పంచుకున్నారు. మనం ఆగర్యోం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక దూరం, ఐసొలేషన్ వంటివాటితోనే మనం కరోనాను కట్టడి చేయగలం. ప్రస్తుతానికి దీనికి ప్రత్యామ్నాయం లేదు. ఇలాంటి సమయాల్లో మన మానసిక ఆరోగ్యం, సహనం కూడా ముఖ్యమే. మన ఇంట్లో చిన్నారులు ఉన్నప్పుడు రోజును తప్పనిసరిగా ఓ క్రమపద్ధతిలో ప్లాన్ చేసుకోవాల్సిందే. మా దినచర్య మా మూడున్నరేళ్ల పాప సమయపాలనను బట్టి ప్రారంభం అవుతుంది. నా భార్య (విరూప) నా కూతుర్ని ఎప్పుడూ అంటి పెట్టుకునే ఉంటుంది. అందుకే నా భార్య ఈ లాక్డౌన్ పరిస్థితులను బాగా బ్యాలెన్స్ చేస్తోంది. మా చిన్నారికి పాఠాలు చెప్పడం, ఆడుకోవడం, కథలు చెప్పడం వంటివి చేస్తున్నాం. అయితే లాక్డౌన్ వల్ల మన రోటీన్ లైఫ్ తప్పక ప్రభావితం అవుతుంది. నేను వంట చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కానీ రెండు వారాలుగా అదే పనిలో ఉన్నాను (సరదాగా). వంట చేయడం అంటే రెసిపీని ఫాలో కావడమే కాదు. తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నేను వంట చేయడాన్ని నా భార్య, నా కుమార్తె బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో ముగ్గురం కలిసి వంట పనులు చేయాలనుకున్నాం. మా పాప వెల్లుల్లి తొక్క తీయడం, ఆకుకూరలను తుంచడం వంటి పనులు చేస్తుంటే చాలా సరదాగా అనిపిస్తోంది. నాకు హలీమ్ అంటే ఇష్టం. ప్రస్తుతం లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లి తినలేం. అందుకని ఈ ఏడాది నేనే స్వయంగా హలీమ్ చేయడం నేర్చుకోవాలనుకుంటున్నాను. -
రాహుల్ పెద్ద హీరో కావాలి : గోపిచంద్
తమని యాక్షన్ హీరోలుగా మలచిన విజయ్ మాస్టర్ కుమారుడు రాహుల్ పెద్ద హీరో కావాలని హరో గోపిచంద్ ఆకాంక్షించారు. ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కాలేజ్ కుమార్’. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రంతో హరి సంతోష్ తెలుగులో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో రాహుల్ విజయ్ సరసన ప్రియా వడ్లమాని హీరోయిన్గా నటిస్తున్నారు. ఇంకా ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్, మధుబాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 6న విడుదల కానున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు హీరో గోపిచంద్, దర్శకుడు గోపిచంద్ మలినేని, ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్‌లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. ‘ఈ కథ లో అన్ని ఎమోషన్స్ ఉన్నాయి. ట్రైలర్ చాలా బాగుంది. రాహుల్, రాజేంద్రప్రసాద్ గారి కెమిస్ట్రీ బాగుంటుందని ట్రైలర్ చూస్తే తెలిసింది. రాజేంద్రప్రసాద్ గారిని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆయనకు వయసు పెరుగుతుందో, తగ్గుతుందో తెలియడం లేదు. ఆయన ఎనర్జీ చూస్తే అలా అనిపిస్తుంది. ఆయన ఈ చిత్రంలో మెయిన్ రోల్ చేయడం సినిమా బాగా వచ్చిందనే నమ్మకాన్ని పెంచింది. దర్శకుడికి ఈ సినిమా తెలుగులో మంచి బ్రేక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఈవెంట్ కి రావడానికి కారణం విజయ్ మాస్టర్. ఆయన మాట నేనెప్పుడూ కాదనను. మాలాంటి హీరోలకు యాక్షన్ ఇమేజ్ వచ్చిందంటే కారణం విజయ్ మాస్టర్, రామలక్ష్మణ్ మాస్టర్ల కృషే కారణం. అలాంటి మాస్టర్ ఇంట్లో నుంచి వస్తున్న అబ్బాయి రాహుల్. మమ్మల్ని హీరోలను చేసిన మాస్టర్ కొడుకు పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్’ అన్నారు. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీ అనేది ఒక కుటుంబం అని ఈ ఈవెంట్ మరోసారి ప్రూవ్ చేసింది. స్టార్టింగ్ డేస్ తమకు విజయ్ మాస్టర్ ఎలా సాయం చేసాడో రామ్ లక్ష్మణ్ లు చెప్పారు. గోపీచంద్ తనకు యాక్షన్ ఇమేజ్ తెచ్చిన విజయ్ మాస్టర్ కొడుకు రాహుల్ హీరో గా నిలబడాలని అతని కోసం ఇక్కడికి వచ్చాడు. ఇదంతా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఏ ఆర్టిస్ట్ అయినా నటిస్తున్నంత కాలం చాలా సంతోషంగా ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు నేను మీకు వినోదాన్ని అందిస్తున్నానంటే అది నా పూర్వ జన్మ సుకృతం. జనవరిలో నేను నటించిన ‘సరిలేరు నీకెవ్వరూ’, ‘అల.. వైకుంఠపురములో..’ చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సెంకండాఫ్లో నవ్వలేక మీ పొట్టలు చక్కలవుతాయి. అలాగే దర్శకుడు హరి చాలా టాలెంటెడ్. అతను తనకున్న వనరులతోనే అద్బుతమైన కంటెంట్‌ని తీసుకురాగలడు. అతని కోసం ఈ సినిమా మరింత సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. గోపీచంద్ మనకున్న మంచి హీరోలలో ఒకరు. అతను ఈ ఈవెంట్లో భాగం అవడం సంతోషంగా ఉంది. ఒక తండ్రిని కోడుకు ఎందుకు చదవించాడు.. అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది గమ్మత్తుగా ఉంటుంది. ఈ పాయింట్‌నే ఆసక్తిగా తెరమీదకు తీసుకొచ్చాడు దర్శకుడు. విషయం సీరియస్‌గా ఉన్న చెప్పే విధానం హాయిగా ఉంటుంది. అదే ఈ సినిమాను ప్రేక్షకులను దగ్గర చేస్తుంది’ అన్నారు. రాహుల్ మాట్లాడుతూ.. ‘చదవడం గొప్పా.. చదివించడం గొప్పా అనే లైన్‌తో ఫాదర్ అండ్ సన్ మద్య వచ్చే కాన్ప్లిక్ట్ని దర్శకుడు బాగా హ్యాండిల్ చేసారు. ఈ సినిమా నా కెరియర్లో గుర్తుండిపోతుంది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అని నమ్ముతున్నాను. రాజేంద్ర ప్రాసద్ గారితో కలసి పనిచేయడం నన్ను బెటర్ ఆర్టిస్ట్‌ని చేసింది. ఈసినిమా మీకునచ్చితే అందులో ఎక్కువ క్రెడిట్ రాంజేంద్ర ప్రసాద్ గారికే చెందుతుంద’ని చెప్పారు. మధుబాల మాట్లాడుతూ.. ఈ కథ అందరికీ కనెక్ట్ అవుతుందన్నారు. ప్రతి ఇంట్లో ఈ పరిస్థితి ఎదురవుతుందని.. దానిని దర్శకుడు హరి అందంగా తెరమీదకు తెచ్చారని తెలిపారు. ఇలాంటి కథలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు. దర్శకుడు మలినేని గోపీచంద్ మాట్లాడుతూ..‘స్క్రీన్ మీద రాజేంద్ర ప్రసాద్ గారి టైమింగ్ ని పట్టుకోవడం తేలికైన విషయం కాదు. రాహుల్ ఈ సినిమాలో బెటర్ ఆర్టిస్ట్ గా కనిపిస్తాడు అని నమ్ముతున్నాను. ఈ చిత్రంలో ప్రతి ఇంట్లో తండ్రికొడుకుల మద్య ఉండే కథను పట్టుకోని చాలా బ్యూటిఫుల్‌గా చెప్పారు. కొడుక్కి కోపం వచ్చి తండ్రిని చదువుకోవడానికి పంపుతున్నాడు అది నాకు బాగానచ్చింది. ఈ చిత్రం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు. దర్శకుడు హరి మాట్లాడుతూ.. ‘మంచి సినిమాను తెలుగు, తమిళ్లో చేయడానికి నన్ను ఎంచుకున్నందుకు నిర్మాతకు థ్యాంక్స్. మంచి కథ ఉంటే ఏ లాంగ్వేజ్ లో అయినా కథ చెప్పవచ్చు అని నమ్ముతాను. ఒక సెట్ అసిస్టెంట్ కొడుకుగా జర్నీ మొదలు పెట్టి ఇక్కడి వరకు వచ్చాను. ఈ ప్రయాణం లో నాకు సపోర్ట్ చేసిన వారికి థ్యాంక్స్. ఈ కథకు లాంగ్వేజ్ బారియర్స్ ఉండవు. ఒక యూనివర్సల్ పాయింట్ కనిపిస్తుంది. మీ ఆశీస్సులు కావాలి’ అన్నారు. హీరోయిన్ ప్రియ వడ్లమాని మాట్లాడుతూ.. ‘ ఈ చిత్రంలో మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ని రియలిస్టిక్‌గా కనిపిస్తాయి. మా పాటలు.. ట్రైలర్ నచ్చితే సినిమా కి రండి. మా సినిమాలో ట్విస్ట్ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఆర్టిస్ట్ గా నాకు ఈ సినిమాలో పనిచేయడం ఎప్పటికీ గుర్తిండిపోతుంది. రాజేంద్ర ప్రసాద్ గారి కాంబినేషనల్ సీన్స్ మీకు బాగా నచ్చుతాయి. రాహుల్ బెస్ట్ కో ఆర్టిస్ట్’ అని అన్నారు. ఫైట్ మాస్టర్ రామ్ మాట్లాడతూ.. ‘రాహుల్‌కి నేను చెప్పేది ఒక్కటే నువ్వు నీ పని ని నమ్ముకో. అదే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అదే నిన్ను నిలబడెతుంది. ఆ నమ్మకమే మమ్మల్ని ఇంత వరకూ తెచ్చింది. ఫైట్ మాస్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఇందులో రాహుల్ నటన బాగా నచ్చిందన్నారు. రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి పనిచేయడం ఒక అదృష్టంగా అని చెప్పారు. -
‘కాలేజ్ కుమార్.. లైఫే డమార్’
నటకిరీటీ రాజేంద్రప్రసాద్, సీనియర్ నటి మధుబాల ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కాలేజ్ కుమార్’. రాహుల్ విజయ్, ప్రియ వడ్డమాని జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంతో దర్శకుడిగా హరి సంతోష్ టాలీవుడ్‌కు పరిచయమవుతున్నాడు. లక్ష్మణ్ గౌడా సమర్పణలో ఎల్ పద్మనాభ నిర్మించారు. కన్నడ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ మూవీ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. చిత్ర ట్రైలర్‌ను నటుడు సాయికుమార్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క తండ్రి కనెక్ట్ అయ్యే సినిమా ‘కాలేజ్ కుమార్’అని పేర్కొన్నాడు. విజయ్ మాస్టర్ అబ్బాయి రాహుల్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నాడని తెలిసి ఆనందంగా ఫీలయ్యానన్నాడు. మంచి ఎమోషన్, ఫీల్ ఉన్న సినిమా అని.. మార్చి 6న ఈ చిత్రాన్ని అందరూ చూసి ఆశీర్వదించాలని సాయి కుమార్ కోరాడు. ‘ఈ సినిమాలో మర్చిపోలేని పాత్ర చేశాను. రాహుల్ విజయ్ నా కుమారుడి పాత్రలో అద్భుతంగా నటించాడు. మంచి సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ఈసినిమాను కూడా తప్పకుండా సక్సెస్ చేస్తారని నమ్ముతున్నాను. సెంటిమెంట్, ఫన్ ఇలా అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. రెగ్యులర్ పాత్రలకు భిన్నంగా ఈ సినిమాలో నా పాత్ర ఉంటుంది. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా’అని రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నాడు. ఈ కార్యక్రమంలో ఫైట్ మాస్టర్ విజయ్, డైరెక్టర్ హరి సంతోష్, సురేష్ కొండేటి, హీరో హీరోయిన్లు, ఇతర తారాగణం, టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: లక్ష్మీ పార్వతి ప్రధాన పాత్రలో ‘రాధాకృష్ణ’ ‘కరెంట్ పోయిందంటే కచ్చితంగా మర్డరే’ -
మహా శివరాత్రికి శివలింగాపురం
ఆర్.కె. సురేష్, మధుబాల జంటగా తోట కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శివలింగాపురం’. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకట స్వామి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రావూరి వెంకట స్వామి మాట్లాడుతూ– ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ భక్తిరస చిత్రమిది. శివలింగాపురం అనే గ్రామంలో అత్యంత మహిమగల శివలింగం దొంగలించబడుతుంది. ఆ శివలింగాన్ని విద్రోహుల చెర నుంచి ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి హీరో ఎలా రక్షించాడు? అనే కథని తోట కృష్ణ చక్కగా తెరకెక్కించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న మా సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మహా శివరాత్రి పర్వదినాన విడుదల చేస్తున్నాం’’ అన్నారు. డీఎస్ రావు, బేబీ హర్షిత తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘన శ్యామ్. -
దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి
స్వాతంత్య్రం అంటే తెలుసుకున్నా... కొన్నేళ్ల క్రితం వరకు స్వాతంత్య్ర దినోత్సవం అంటే సెలవు రోజు.. కుటుంబసభ్యులతో ఇంట్లో గడపవచ్చని భావించేదానిని. అది తెలియనితనం. కానీ బాధ్యతాయుత పౌరురాలిగా మారాక నా ఆలోచనలో మార్పు వచ్చింది. నిజమైన స్వాతంత్య్రం అంటే ఏంటో తెలుసుకున్నా. సైద్ధాంతిక భావజాలం, అంధ విశ్వాసాల చట్రంలో ఇరుక్కుపోకుండా వాటి నుంచి బయటకు రావాలి. దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలి. – ‘రోజా’ ఫేమ్ మధుబాల దేశానికి ఏమిస్తున్నామో తెలుసుకోవాలి స్వాతంత్య్రం కోసం పోరాడిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతగా ఉండాల్సిన రోజు. మనకు లభించిన స్వాతంత్య్రం విలువను చూపించాల్సిన రోజు. అమరుల త్యాగాలను స్మరించుకునేందుకు వేడుకల్లో పాల్గొనాలి. మువ్వన్నెల జెండాకు సెల్యూట్ చేయడం మన బాధ్యత. ఆ రోజు ఎవరికి తోచిన విధంగా వారు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలి. మన వంతుగా మనం దేశానికి ఏం ఇస్తున్నాం అనేది తెలుసుకోవాల్సిన రోజు. – సినీ నటి పూజా హెగ్డే -
శివతాండవం హైలైట్
‘‘కొక్కొరొకో, మా తల్లి గంగమ్మ, లిటిల్ హార్ట్స్’ వంటి చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు రావూరి వెంకటస్వామి. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘శివలింగాపురం’. ఆర్.కె. సురేష్, మధుబాల జంటగా, శివుడిగా డాక్టర్ భూమారెడ్డి, పార్వతిగా మేఘనా శ్రీలక్ష్మి నటించారు. తోట కృష్ణ దర్శకత్వంలో రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటస్వామి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘శివలింగాపురంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఈ చిత్రకథ సాగుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. శివశంకర్ మాస్టర్ చేసిన శివతాండవం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో 35 రోజుల పాటు జరిపిన షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని, ప్రస్తుతం రీరికార్డింగ్, గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. జూన్‌లో విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రఫి, సంగీతం: ఘనశ్యామ్. -
మళ్లీ డ్యూయెట్
డ్యూయెట్ అంటే కలిసి పాడక్కర్లేదు. స్టెప్పులు వేయక్కర్లేదు.. ఆడక్కర్లేదు.మళ్లీ ఈ కాంబినేషన్ తెర మీద కనపడితే చాలు.. మన హార్ట్ బీట్ స్టెప్పులేస్తుంది. వెల్కమ్ బ్యాక్. జనం ఒకసారి ఒక హిట్ పెయిర్‌ను కన్ఫర్మ్ చేశారంటే వాళ్లమాట వాళ్లే వినరు. హిందీలో అలా రాజ్ కపూర్– నర్గీస్ జంటను కన్ఫర్మ్ చేశారు. తెలుగులో అక్కినేని– సావిత్రి జంటను కన్ఫర్మ్ చేశారు. తమిళంలో ఎం.జి.ఆర్–జయలలిత జంటను కన్ఫర్మ్ చేశారు. ఆ మధ్య చిరంజీవి– రాధిక, బాలకృష్ణ–విజయశాంతి, నాగార్జున–అమల, వెంకటేశ్– సౌందర్య హిట్ పెయిర్‌గా నిలిచారు. ఇటీవల నాగ చైతన్య– సమంత, నితిన్–నిత్యామీనన్, రాజ్‌తరుణ్–అవికా గోర్ వంటి పెయిర్స్ కూడా జనానికి నచ్చాయి. ఇలా ఒకసారి హిట్ అయితే ఎన్నాళ్ల గ్యాప్ వచ్చినా మళ్లీ ఒకసారి వారు తెర మీదకు వస్తే చూడాలనుకుంటారు. ఈ విషయం కనిపెట్టే చాలా గ్యాప్ తర్వాత తిరిగి శోభన్‌బాబు–వాణిశ్రీ–శారదల కాంబినేషన్‌తో ‘ఏమండీ... ఆవిడ వచ్చింది’ సినిమా తీసి పెద్ద హిట్ కొట్టారు ఈ.వి.వి. సత్యనారాయణ. సినిమా వారికి కాసులు కావాలి. కనుక పాత మేజిక్‌ను రిపీట్ చేయడానికి వాళ్లూ ఉత్సాహం చూపుతుంటారు. అలాంటి ‘రీ– యూనియన్లు’ ఈ ఏడాది చాలానే చూడబోతున్నాం. ప్రభు–మధుబాల ‘రోజా’, ‘అల్లరి ప్రియుడు’, ‘జెంటిల్‌మేన్’ సినిమాలతో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశారు మధుబాల. ఆ తర్వాత కుటుంబం కోసం టైమ్ కేటాయిస్తూ ఇండస్ట్రీకి కొంచెం గ్యాప్ ఇచ్చారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తన పాత కో–స్టార్ ప్రభుతో కలిసి తిరిగి యాక్ట్ చేయనున్నారు. 1996లో వచ్చిన ‘పాంచాలకురుచ్చి’ అనే సినిమాలో తొలిసారిగా వీరిద్దరూ కలిసి నటించారు. మళ్లీ 23 ఏళ్ల తర్వాత ఓ రీమేక్ కోసం నటిస్తున్నారు. కన్నడంలో సూపర్ హిట్ అయిన ‘కాలేజ్ కుమార్’ సినిమా తమిళ రీమేక్‌లో వీరిద్దరూ జోడీ కడుతున్నారు. అరుణ్ విజయ్, ప్రియా వడ్లమాని హీరో హీరోయిన్లు. ప్రియదర్శన్ దర్శకుడు. అమితాబ్–రమ్యకృష్ణ కెరీర్ పీక్‌లో ఉండగా దక్షిణాది భాషల సినిమాలను తన గ్లామర్‌తో నింపిన రమ్యకృష్ణ హిందీసినిమా రంగాన్ని కూడా ఆకర్షించారు. అంతేనా? ఏకంగా అమితాబ్ పక్కన నటించే చాన్స్ కొట్టేశారు. వీరిద్దరూ కలిసి ‘బడే మియా ఛోటే మియా’లో నటించారు. ఆ సమయంలో ఫ్లాపుల్లో ఉన్న హీరో మోహన్‌బాబుకు రమ్యకృష్ణ నట భాగస్వామ్యంతో వచ్చిన ‘అల్లుడుగారు’ హిట్ అయినట్టు డౌన్లో ఉన్న అమితాబ్‌కు ‘బడే మియా చోటే మియా’ కూడా బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా రిలీజ్ అయిన 20 ఏళ్ల గ్యాప్ తర్వాత బిగ్ బి, రమ్యకృష్ణ ఒక తమిళ సినిమాలో కలసి నటిస్తున్నారు. 50 ఏళ్ల సినీ కెరీర్లో అమితాబ్ తొలిసారిగా ఓకే చేసిన తమిళ చిత్రం ‘ఉయంవర మణిదన్’లో ఆయన పక్కన నటించే అవకాశం రమ్యకు దక్కింది. తమిళవానన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో యస్.జె. సూర్య ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. శోభన–సురేశ్ గోపి మలయాళ ఇండస్ట్రీలో శోభన–సురేష్ గోపీది హిట్ కాంబినేషన్. ‘మణిచిత్రతాళే’, ‘ఇన్నలే’, ‘కమిషనర్’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలను ఆడియన్స్‌కు ఈ జంట అందించింది. ‘కమిషనర్’ 2005లో రిలీజ్ అయింది. మళ్లీ పద్నాలుగేళ్ల గ్యాప్ తర్వాత శోభన–సురేశ్ గోపీ ఒక లేడీ ఓరియంటెడ్ సబ్జెక్ట్‌గా రూపొందుతున్న సినిమాలో కలిసి కనిపిస్తారు. జూలైలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. రాధిక–శరత్ కుమార్ రాధిక– శరత్ కుమార్ ఆఫ్‌స్క్రీన్ కపుల్. ఆన్‌స్క్రీన్ కూడా హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ‘నమ్మ అన్నాచ్చి’, ‘సూర్యవంశం’ సినిమాల్లో జోడీగా నటించారు ఈ ఇద్దరూ. 2013లో వచ్చిన ‘చెన్నైయిల్ ఒరు నాళ్’ సినిమాలో శరత్‌కుమార్, రాధిక నటించినప్పటికీ జంటగా యాక్ట్ చేయలేదు. 20 ఏళ్ల తర్వాత ‘వానమ్ కొట్టటుమ్’లో జోడీగా కనిపించనున్నారు. విక్రమ్ ప్రభు హీరోగా తెరకెక్కే ఈ చిత్రానికి ధన దర్శకుడు. కథను ధనతోపాటు మణిరత్నం అందిస్తున్నారు. సెట్స్ మీద ఉన్నవే కాదు. ఆల్రెడీ మూడు భారీ రీ యూనియన్లు ఈ ఏడాది జరిగిపోయాయి. ‘కళంక్’ చిత్రం కోసం సంజయ్ దత్–మాధురీ దీక్షిత్ 25 ఏళ్ల తర్వాత కలిశారు. ఈ నెల 17న ఈ చిత్రం విడుదలైంది. ‘సాజన్’, ‘ఖల్నాయక్’ వంటి హిట్ సినిమాలు వీరిద్దరి జాయింట్ అకౌంట్లో ఉన్నాయి. మరో జంట అనిల్ కపూర్, జూహీ చావ్లాది కూడా హిట్ పెయిర్. ‘సలామ్ ఏ ఇష్క్’ (2007) వీరి లాస్ట్ చిత్రం. పదకొండేళ్ల తర్వాత ‘ఏక్ లడ్కీకో దేఖాతో ఏసా లగా’ కోసం మళ్లీ çకలిశారు. ఫిబ్రవరిలో ఈ సినిమా రిలీజైంది. అలాగే అనిల్ కపూర్– మాధురి దీక్షిత్లది కూడా మంచి జోడి. ‘ధక్ ధక్ కర్నే లగా’.. పాటలో అనిల్ కపూర్, మాధురీ దీక్షిత్‌ల కెమిస్ట్రీని అంత సులువుగా మరచిపోలేం. ఈ ఇద్దరూ సుమారు 18 సినిమాల్లో కలసి నటించారు. పద్ధెనిమిదేళ్ల తర్వాత ‘టోటల్ ధమాల్’లో అనిల్ కపూర్– మాధురీ దీక్షిత్ కలసి యాక్ట్ చేశారు. స్వీట్ కపుల్–గులాబ్ జామూన్ ఈ ఏడాది మరో రీ–యూనియన్ని సిల్వర్ స్క్రీన్ చూడబోతోంది. ఈ జోడీ కలిసి స్క్రీన్ మీద కనిపించి ఎనిమిదేళ్లు అయింది. ఈ రియల్ లైఫ్ స్వీట్‌కపుల్ అభిషేక్ బచ్చన్–ఐశ్వర్యారాయ్ ఇన్నేళ్ల తర్వాత ‘గులాబ్ జామూన్’ అనే సినిమా కోసం జతకట్టారు. 2010లో నటించిన ‘రావణ్’ ఈ జంట కలిసి నటించిన చివరి చిత్రం. నువ్వు నేను – మరో సినిమా కోలీవుడ్‌లో సూర్య–జ్యోతికలది సూపర్‌హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరూ జోడీగా సుమారు 5 సినిమాల్లో కనిపించారు. వాటిలో దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ‘కాక్క కాక్క’ బ్లాక్‌బస్టర్. సూర్య కెరీర్ యూటర్న్ తిప్పిన సినిమా. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనల్లో దర్శక–నిర్మాతలు ఉన్నారని వినిపించింది. ఇందులో సూర్య, జ్యోతికలనే యాక్ట్ చేయించాలని అనుకుంటున్నారట. పదమూడేళ్లయింది వీరిద్దరూ స్క్రీన్ మీద కనిపించి. ‘సిల్లును ఒరు కాదల్’ (తెలుగులో ‘నువ్వు నేను ప్రేమ’) జంటగా వీరిద్దరి చివరి చిత్రం. – ఇన్పుట్స్: గౌతమ్ మల్లాది -
ముద్దు ముద్దు ఆశ
చిన్ని చిన్ని ఆశ..నిజానికి ఆశ చిన్నదిగా ఉండదు.చిన్నదిగా ఉండేది ఆసలు ఆశే కాదేమో! చెట్టుకొమ్మ చివరన ఉన్న పండు చేతికి అందుతుందిగా.చిన్ని ఆశ కూడా అలాంటిదే!పై కొమ్మకు ఉన్న పండు ముత్యమంత ఆశ.మధుబాల ఎప్పుడూ పై కొమ్మనున్న పండుపైనే గురి పెట్టుకుంది.అందుకే ఎన్నో చిన్ని చిన్ని ఆశలు ఈజీగా అందాయి.అందనివి కూడా అందుకుంటానంటోంది. సినిమాలకు దూరమైతే కొందరు ఫిజిక్, గ్లామర్ గురించి పట్టించుకోరు. చాలా గ్యాప్ తర్వాత దాదాపు నాలుగేళ్ల క్రితం క్యారెక్టర్ నటిగా ఎంట్రీ ఇచ్చారు. కానీ కథానాయికగా చేసినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు? నేను పని చేసినా, చేయకపోయినా నా మనసులో నేనెప్పుడూ ఆర్టిస్ట్‌నే. నటిగా 15 ఏళ్లు గ్యాప్ వచ్చినా ప్రస్తుతానికి సినిమాలు చేయడం లేదంతే అనుకున్నాను. అందుకే నా లుక్స్ హీరోయిన్‌లానే ఉండాలనుకున్నాను. అవకాశం ఎప్పుడు తలుపు తట్టినా నేను రెడీగా ఉండాలి. డోర్ తట్టగానే రెడీ అయిపోయి షూటింగ్‌కి వెళ్లాలి. అంతేకానీ పాత గ్లామర్ తెచ్చుకోవడానికి అప్పటికప్పుడు కసరత్తులు మొదలు పెట్టకూడదు. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నా ఫిజిక్ అలానే మెయిన్టైన్ చేసుకుంటూ వచ్చాను. ‘చిన్ని చిన్ని ఆశ...’ అంటూ ‘రోజా’లో సందడి చేశారు. ప్రొఫెషనల్‌గా ఏవైనా చిన్ని చిన్ని ఆశలు మిగిలిపోయాయా? విభిన్నమైన పాత్రల్లో నటించాలనుకున్నాను, చాలా వరకూ ప్రయత్నించాను. అందరి ప్రసంశలు అందుకోవాలనుకున్నాను. అందుకున్నాను. ఆవార్డులు అందుకోవాలనుకున్నాను. ఆ చిన్న ఆశ మిగిలిపోయింది. ‘నువ్వు మంచి ఆర్టిస్ట్’ అని అందరూ చెబుతుంటారు. కానీ అవార్డుల రూపంలో ఆ ధ్రువీకరణ కావాలి. నటిగా కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అవార్డులు గురించి పెద్దగా ఆలోచించలేదు. ప్రేక్షకుల ప్రశంసలు చాలనుకున్నాను. అయితే అవార్డ్ అనేది ఓ అద్భుతమైన ఫీలింగ్. మన కోలీగ్స్, మనల్ని అభిమానించేవాళ్ల ముందు అవార్డు అందుకుంటూ ‘అమ్మానాన్న, దేవుడు, నన్ను సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్యూ’ అంటూ హ్యాపీగా స్పీచ్ ఇస్తుంటే ఓ మంచి ఫీలింగ్ కలుగుతుంది. మంచి ఆర్టిస్ట్ అని ప్రేక్షకులతో అనిపించుకున్నాక అవార్డు అనే ధ్రువీకరణ అవసరమంటారా? స్పిరిచ్యువల్‌గా ఆలోచిస్తే అక్కర్లేదు. కానీ హ్యూమన్‌గా ఆలోచిస్తే నా ప్రైజ్ నాకు కావాలి. ధ్రువీకరణ అన్నది ముఖ్యమే. ప్రైజ్ ఎవరికి నచ్చదు? నటనని గుర్తించి ఓ అవార్డు ఇస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అందుకే కథ చెప్పడానికి ఎవరు వచ్చినా అవార్డు వస్తుందా? అని అడుగుతుంటాను. వాళ్ల సినిమాల్లో నటింపజేయడం కోసం కచ్చితంగా వస్తుంది అంటుంటారు (నవ్వుతూ). ‘రోజా’లో చేసిన పాత్రకు నేషనల్ అవార్డు వస్తుందనుకున్నాను.. రాలేదు. కొంచెం నిరుత్సాహపడ్డాను. ఆ సినిమాకు తమిళనాడు స్టేట్ అవార్డ్ వచ్చింది. జయలలితగారి చేతుల మీదగా అవార్డు అందుకున్నాను. నేనెప్పుడూ ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకోలేదు. ఇప్పుడంటే లెక్కలేనన్ని అవార్డులు ఉన్నాయి కానీ మేం చేస్తున్నరోజుల్లో ఫిల్మ్‌ఫేర్ అంటే ఐకానిక్ అవార్డులాగా భావించేవాళ్లం. ఆ అవార్డు నాకు రాలేదు. అది నా మైండ్‌లో అలా స్ట్రక్ అయిపోయింది. ‘పెహచాన్’ అనే సినిమా చేయడానికి అప్పట్లో ఎవరూ సాహసించలేదు. లీడ్ హీరోయిన్ వ్యాంప్ పాత్ర పోషించడం ఆ టైమ్‌లో రిస్క్. కానీ నేను చేశాను. అందరూ అభినందించారు కూడా. కానీ అవార్డు రాలేదు. పర్సనల్ లైఫ్‌లో ఏదైనా చిన్ని చిన్ని ఆశ ? దేవుడి దయ వల్ల నా లైఫ్ హ్యాపీ. మా అమ్మాయిల కలలు నెరవేరడం, నెరవేర్చడమే నాకు ఉన్న ఆశ. పెద్దమ్మాయి అమయా హీరోయిన్ అవ్వాలనుకుంటోంది. ‘నాకు తెలిసినవారిని నీకు పరిచయం చేస్తాను. నీ వర్క్ నువ్వు సరిగ్గా చేయగలిగితే, నీ విధి బావుంటే హీరోయిన్ అవుతావు’ అని తనతో చెప్పాను. చిన్నమ్మాయి కియా పదో తరగతి చదువుతోంది. మీ పిల్లలు మీ సినిమాలు చూసే ఉంటారు. మీలో నటి గురించి వాళ్ల కామెంట్? నేను కథానాయికగా చేసిన సినిమాలను వాళ్లు సరిగ్గా చూడలేదు. యూ ట్యూబ్‌లో కొంచెం కొంచెం చూశారు. నా కమ్‌బ్యాక్ చిత్రం ‘లవ్ యూ మిస్టర్ కళాకార్’ మా పిల్లలకు నచ్చలేదు. ప్రస్తుతం వాళ్లు అనుష్కా శర్మ, ప్రియాంకా చోప్రా, ఆలియా భట్ లాంటి యూత్‌ఫుల్ హీరోయిన్లను ఇష్టపడుతున్నారు. ‘నువ్వు మరీ ఓల్డ్ స్టైల్ బాలీవుడ్ హీరోయిన్లా ఉన్నావు మమ్మీ’ అని అమయా చెప్పింది. ఓల్డ్ స్టైల్ అంటే ఏంటి? అని అడిగాను. ‘నీ సినిమాల్లో నీ ఎక్స్ప్రెషన్స్ అన్నీ సినిమాటిక్‌గా, డ్రమాటిక్‌గా ఉన్నాయి’ అని వివరించింది. ఇప్పటివరకూ నేను చాలా నాచురల్ యాక్టర్‌ని అనుకుంటూ వచ్చాను. ఆడియన్స్ కూడా అలానే చెప్పారు. ఇప్పుడు నా పిల్లలకు నా నటన నాచురల్ అనిపించలేదు. ఆ కామెంట్ నా మైండ్‌లో స్టక్ అయిపోయింది. వెంటనే కొత్త హీరోయిన్లు ఏం చేస్తున్నారు? ఇండస్ట్రీలో ఏం మార్పులు వచ్చాయి? అని గమనించాను. కాపీ చేయడానికి కాదు... తెలుసుకోవడానికి. కొన్ని రోజుల తర్వాత ‘సబ్ టీక్ హై’ అనే షార్ట్‌ఫిల్మ్ చేశా. దాని ప్రీమియర్‌కు పిల్లలిద్దర్నీ తీసుకెళ్లాను. చూసి ‘సబ్ టీక్ హై’ (అంతా బాగుంది) అన్నారు. వాళ్లకు చాలా నచ్చింది. ఎందుకంటే అందులో నేను యాక్ట్ చేయలేదు. జస్ట్ రియాక్ట్ అయ్యాను. నేను బాలచందర్‌గారి స్కూల్ నుంచి వచ్చాను. ఫేస్‌లో ఎక్స్ప్రెషన్ కనబడాలి అని నమ్మే దర్శకుడు ఆయన. ఇప్పుడు అంతగా ఎక్స్ప్రెషన్స్ అవసరంలేదనిపిస్తోంది. మీరేమో మీ అమ్మాయిని హీరోయిన్ని చేస్తానంటున్నారు. ఇండస్ట్రీల్లో ఉన్న చాలా మంది ‘మనం కష్టపడ్డాం. మన పిల్లల్ని కూడా ఎందుకు ఇందులోకి?’ అని అనుకుంటారు. దానికి మీరేమంటారు? నాక్కూడా అలాంటి ఆలోచన ఉండేది. వర్క్ చేయడానికి ఈ ఇండస్ట్రీ మంచి ప్లేస్ కాదని కాదు. మంచిది కాకపోతే నేను ఇండస్ట్రీకి మళ్లీ ఎందుకు తిరిగొస్తాను? ఐ లవ్ మై ఇండస్ట్రీ. కానీ నా పిల్లలను ఇండస్ట్రీ వద్దనుకోవడానికి ఓ కారణం ఉంది. శ్రీదేవి, నేను ఎప్పుడూ మా పిల్లల గురించే మాట్లాడుకునేవాళ్లం. మొదటిది.. మా పిల్లల్ని మాతో కచ్చితంగా పోలుస్తారు. రెండోది.. అభినందనలు, పేరు మాత్రమే కాదు చాలా విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి కొన్నేళ్లు పనిలేకుండా ఇంట్లో కూర్చోవాల్సి ఉంటుంది. కష్టపడినా సినిమా హిట్ అవదు. సినిమాలో బాగాలేవు అంటారు. ఇవన్నీ తట్టుకుని, ‘అయితే ఏంటి?’ అని పట్టించుకోని స్వభావం ఉండాలి. అప్పట్లో నేనలానే ఉండేదాన్ని. ఇప్పుడు నా కూతురు నా అంత స్ట్రాంగ్‌గా ఉండగలుగుతుందా? అని చిన్న భయం. అప్పట్లో నా సినిమా నచ్చిందా? వెల్ అండ్ గుడ్. నచ్చలేదా? ఐ డోంట్ కేర్. నాకు అలాంటి స్వభావం ఉండేది. దాంతో నన్ను యారోగెంట్ అనుకునేవారు. అయితే ఆ స్వభావం వల్ల నన్ను నేను రక్షించుకుంటున్నట్టుగా భావించాను. రక్షణ అంటే ఏ విధంగా? ఫ్రెండ్లీగా కనిపిస్తే అన్నీ మొహం మీద చెప్పొచ్చు అనుకుని చనువు తీసుకునే అవకాశం ఉంది. అందుకే గంభీరంగానే ఉండేదాన్ని. దాంతో వెకిలిగా మాట్లాడే సాహసం చేసేవారు కాదు. ఇక వెకిలిగా ఎక్కడ ప్రవర్తిస్తారు? ఇది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ ఈ జనరేషన్ అంతా చాలా సెన్సిటివ్, సాఫ్ట్. మేం చాలా టఫ్‌గా ఉండేవాళ్లం అని నా అభిప్రాయం. అప్పట్లో మీడియా చాలా తక్కువ. సినిమా బాగాలేదని రాసినా ఆ రోజు న్యూస్ చూడకపోతే ఆ విషయం మాకు తెలియదు. కానీ డిజిటల్ మీడియా వల్ల మనం ఎప్పుడో వేసుకున్న డ్రెస్ మీద కూడా టాపిక్‌లు నడుస్తాయి. బెస్ట్ లుక్స్, బ్యాడ్ లుక్స్ అని ప్రోగ్రామ్‌లు కూడా చేస్తుంటారు. ఒక హీరోయిన్ను మరో హీరోయిన్‌తో పోలుస్తూ ఈవిడకంటే ఆవిడ బాగుందని అని రాస్తారు. ట్వీటర్, ఫేస్బుక్, వాట్సాప్‌లో స్టార్స్ గురించి తరచూ వాళ్ల అభిప్రాయాలు పంచుకుంటుంటారు. గతంలో ఓ మేగజీన్ చూడకపోతే మా గురించి ఏమనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు అలా లేదు పరిస్థితి. అయినా మా అమ్మాయి హీరోయిన్ అవ్వాలను కుంటోంది కాబట్టి క్లిక్ అయితే గుడ్. అవ్వాలని కోరుకుంటున్నాను. నాకంటే పెద్ద సూపర్‌స్టార్ అవాలని ఆశ. సపోజ్ ఎవరైనా ‘నువ్వు ఆర్టిస్ట్‌గా బాలేవు’ అని అంటే తట్టుకుంటుందా? హ్యాండిల్ చేస్తుందా? అని భయం. అందుకని ఇండస్ట్రీ వద్దనుకున్నాను. కానీ పిల్లలకు నచ్చినది చేయనివ్వాలి. అందుకని ఓకే అన్నాను. మీరు చాలా టఫ్‌గా ఉన్నాను అన్నారు. మరి ఆ స్వభావాన్ని మీ పిల్లలకు నేర్పిం లేదా? పిల్లలకు మాటల ద్వారా జీవిత పాఠాలు చెప్పలేం. పరిస్థితులు నేర్పుతుంటాయి. పడాలి, లేవాలి. ఒకటీ రెండుసార్లు దెబ్బ తింటే టఫ్‌గా మారతాం. వాళ్ల డెస్టినీ అదే అయితే వాళ్ల పాఠం వాళ్లే నేర్చుకుంటారని అనుకుంటున్నాను. విమర్శను ఎదుర్కొంటూ ముందుకెళ్తే ఓకే. అమ్మో నేను తట్టుకోలేను అంటే ఇంటికొచ్చేయ్ అంటాను. కానీ వాళ్ల ప్రయాణానికి మాత్రం అడ్డు చెప్పను. ఒక్కోసారి వాళ్లు ఈ పరిస్థితులను ఈజీగా హ్యాండిల్ చేసేస్తారేమో? నేనే ఓవర్‌గా థింక్ చేస్తున్నానేమో? అనిపిస్తుంటుంది. మా పేరెంట్స్ కూడా పిల్ల కష్టపడకూడదనుకుంటే నేనిక్కడిదాకా వచ్చేదాన్ని కాదుగా. అప్పట్లోనూ ‘క్యాస్టింగ్ కౌచ్’ ఉందని కొందరు సీనియర్ ఆర్టిస్టులు చెప్పారు. ప్రస్తుతం ‘మీటూ’ గురించి ఎక్కువగా వింటున్నాం. మరి ఇండస్ట్రీ సేఫ్ అంటారా? ఇప్పుడు ప్రతిదీ ఓ టాపిక్ అవుతోంది. క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పుడూ ఉంది. అలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొని, ధైర్యంగా బయటకు వచ్చి చెప్పినవాళ్లందరికీ నా సెల్యూట్. అయితే ఇప్పుడు దేని గురించైనా టూ మచ్‌గా మాట్లాడుకుంటున్నాం అని నా నమ్మకం. అప్పట్లో స్త్రీలు ఏదీ బయటకు చెప్పలేదు. ఒకవేళ చెబితే వాళ్లనే తప్పుబడతారనే భయం ఉండేది. ప్రస్తుతం స్త్రీలకు బయటకు వచ్చి చెప్పుకోగలిగే ధైర్యం వచ్చింది. ఏదైనా చెప్పుకుంటే నువ్వే తప్పు అనకుండా వింటున్నారు. ఇప్పుడు ఓ నటి నాకు ఇలా జరిగింది అని చెబితే ఆరోపణలు ఎదుర్కొన్నవారికి అవకాశాలు పోతున్నాయి. స్త్రీ ఫిర్యాదు చేస్తే తమ జాబ్ పోతుందేమో అని తప్పు చేయడానికి భయపడుతున్నారు. ఈ మార్పు ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ వచ్చింది. అందుకని మహిళలు సేఫ్‌గా ఉండొచ్చనే అనుకుంటున్నాను. అయితే స్త్రీ దీన్ని దుర్వినియోగం చేయకూడదు. ఒకవేళ తప్పుగా ఉపయోగిస్తే ‘మీటూ’ ఉద్యమానికి అర్థం ఉండదు. మీ వైవాహిక జీవితం గురించి? మొన్నే 20వ యానివర్శరీ పూర్తి చేసుకున్నాం. 1999 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్నాం. మ్యారీడ్ లైఫ్‌ని వివరించమంటే ‘రోలర్ కోస్టర్ రైడ్’ అని చెబుతాను. రోలర్ కోస్టర్ రైడ్‌ని ఫెంటాస్టిక్‌గా మొదలుపెడతాం. అలా పైకి వెళ్తాం. రయ్‌మని కిందకు వస్తాం. లైఫ్ కూడా అంతే. రోలర్ కోస్టర్ ఎక్కమని మనల్ని ఎవరూ ఫోర్స్ చేయరు. మనమే టికెట్టు కొనుక్కుని మరీ ఎక్కి భయపడతాం, ఆనందపడతాం, థ్రిల్ అవుతాం. ఎత్తుకు ఎగిరేప్పుడు చాలా బావుంటుంది, కిందకు వస్తున్నప్పుడు అసలెందుకు ఇది? అనే ఆలోచనలు కూడా వస్తాయి. కొద్దిసేపు స్మూత్‌గా ట్రావెల్ అవుతాం. మళ్లీ పైకి, కిందకు. లైఫ్ కూడా అంతే. రైడ్‌లో రయ్‌మని కిందకు వస్తున్నప్పుడు అసలెందుకు ఎక్కాం అనుకుంటా అన్నారు. మ్యారీడ్ లైఫ్‌లోకి ఎందుకు ఎంటరయ్యామని ఎప్పుడైనా అనిపించిందా? నా లైఫ్‌లో నేను బెటర్ పర్సన్ అవ్వడానికి నా పెళ్లి, మా పిల్లలు కారణం. వీళ్లు పర్ఫెక్ట్గా ఉన్నారని, అన్ని పనులు సక్రమంగా చేస్తారని మనం మన కుటుంబ సభ్యులను ప్రేమించం. వాళ్లు ఎలా ఉన్నా, ఏం చేసినా ప్రేమించాలి. దానికి చాలా సహనం, భరించగలగడం, నేర్పు కావాలి. వాళ్లను యాక్సెప్ట్ చేయగలగాలి, మన్నించగలగాలి. అంతేకానీ ‘నీకంటే మంచివాళ్లు నా లైఫ్‌లోకి వచ్చి ఉండేవాళ్లేమో?’ అనుకుంటే దాంపత్య జీవితం బాగుండదు. ఎందుకంటే ప్రపంచంలో ఎవరూ పర్ఫెక్ట్ కాదని నా అభిప్రాయం. అందుకే మన జీవిత భాగస్వామి గురించి ఈ ప్రపంచం మొత్తంలో నువ్వే నాకు బెస్ట్ అని ఫీల్ అవగలిగాలి. మన పిల్లలకు మనం జన్మనిచ్చాం కాబట్టి సర్వ హక్కులూ మనకే అని వాళ్లను ఇబ్బందిపెట్టకూడదు. పక్కింటి పిల్లలతో పోల్చకూడదు. మీరు నా పిల్లలు అవ్వడం నేనెంతో లక్కీ, నువ్వు నా భర్తగా రావడం లక్కీ అనుకునే స్టేజ్‌కు రాగలిగితే అది ఓ గొప్ప స్పిరిచ్యువల్ లెసన్ అవుతుంది. మన అమ్మానాన్నల మీద కోపం వస్తే మధ్యలో వదిలేయం కదా. జీవిత భాగస్వామికి కూడా అదే ఆపాదించగలగాలి. జీవిత భాగస్వామి, పిల్లలు మన లైఫ్‌లో ఉండటం మన సంతోషం అని భావిస్తే అదే మంచి ఆధ్యాత్మిక పాఠం. మీ స్పిరిచ్యువల్ గురువు ఎవరు? ప్రత్యేకంగా ఎవరూ లేరు. కానీ చాలా మంది గురువులను కలిశాను. కొన్నాళ్లుగా శివానంద్ బాబాను యూట్యూబ్‌లో ఫాలో అవుతున్నాను. అయితే ఆయనే నా గురువు అని పూర్తిగా చెప్పలేను. కొందరు ఫ్రాడ్ బాబాల గురించి వింటున్నాం... ఓ చిన్న లాజిక్ చెప్పనా? బాబాలు, మనం అందరం మనుషులమే. మనకు ఉన్నట్లుగానే కాళ్ల నొప్పులనో, తల నొప్పులనో వాళ్లకూ ఉంటాయి. ఎవరూ దేవుడు కాదు. అందరికీ దేవుడు లోపలుంటాడు. సాధన, జ్ఞానంలో బాబాజీలు మనకంటే కొంచెం గొప్ప వ్యక్తులు అవొచ్చు. అందుకే వాళ్లను టీచర్లా భావించాలి. అంతవరకే. కానీ బాబాలకు మనమే దేవుడి స్థాయినిస్తాం. అక్కడి నుంచి వాళ్లు పడిపోతే వాళ్లను నమ్మొద్దు.. ఫ్రాడ్ అంటాం. ఓషో రాసినట్టు ఎవ్వరూ రాయలేరని నమ్ముతాను. ఆ ఫిలాసఫీ ఎంతో గొప్పగా ఉంటుంది. కానీ ఆయన పర్సనల్ లైఫ్‌లోకి వెళ్తే కొన్ని తప్పులుండొచ్చు. అసలు స్వామిజీలను కిందపడేంత పైకి లేపకూడదు. స్వామి నిత్యానంద మీద చాలా కేసులున్నాయి. కానీ ఆయన టీచింగ్స్ అద్భుతంగా ఉంటాయి. వాళ్లను కేవలం టీచర్స్లా భావించి, అనుసరిస్తే సంతోషంగా ఉంటాం. అలా కాకుండా వాళ్లకు బాబాగిరి (పాదాభివందనాలు, దేవుడికి ఇచ్చేలా హారతులు ఇవ్వడం) చేస్తానంటే నాకు ఇష్టముండదు. గుడ్డి నమ్మకం ఏర్పరచుకోకూడదు. నేను దేవుడికి సరెండర్ అవ్వడానికి ఇష్టపడతాను, దేవుడని చెప్పుకునే మనిషికి కాదు. ఫైనల్లీ.. ఈ 26 న మీ బర్త్‌డే కదా... ప్లాన్స్ ఏంటి? ప్రతి సంవత్సరం బర్త్‌డేను గ్రాండ్‌గా చేసుకుంటాను. బాంబేలో వందమంది ఫ్రెండ్స్ వరకూ కలుస్తాం. పార్టీ చేసుకుంటాం. ఈసారి ఐదుగురు స్నేహితులం యూరప్ వెళ్తున్నాం. బర్త్‌డేకు రెండు రోజుల ముందు లండన్ వెళతాను. నా పిల్లలు అక్కడ ఉన్నారు. మా ఫ్యామిలీ అంతా కలిసి ఓ వారం రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. నా బర్త్‌డే సెలబ్రేషన్స్ మొత్తం పది రోజులు సాగుతాయి. 5 డేస్ నా ఫ్రెండ్స్‌తో, 5 డేస్ నా ఫ్యామిలీతో. యూరప్, లండన్ నుంచి ముంబైకొచ్చి మళ్లీ సెలబ్రేట్ చేసుకుంటా. డి.జి. భవాని తెలుగులో చేస్తున్న ‘కిట్టీ పార్టీ’ ఎలా ఉండబోతోంది? ఉమెన్ కూడా ఆడియన్స్‌ను «థియేటర్లకు తీసుకు రాగలరని నమ్మి దర్శకుడు పవన్ దీప్తీ భట్నాగర్, నన్ను, సుమన్ రంగనాథ్‌ని, భాగ్యశ్రీని, సదాని.. ఇలా ఆరుగురిని పెట్టి ఈ సినిమా తీస్తున్నాడు. నటీమణులకు ఫార్టీ ప్లస్ ఏజ్ ఉమెన్ ఉన్నా సినిమాలు చూస్తారు అని నమ్మకం ఏర్పడింది. సినిమాలు సమాజానికి రిఫ్లెక్షన్. 40 ఏళ్ల వయసులో ఉన్న నటీమణులను చూస్తున్నారంటే ఆడియన్స్‌లో మార్పు వచ్చింది. ఒకప్పుడు 30 ప్లస్ అంటే కెరీర్ ఫినీష్. 18కి లాంచ్ అయి 25 వరకూ కెరీర్ ఉండి పెళ్లి చేసుకోగానే తల్లి పాత్రలు ఇస్తారు. ఇప్పుడు అలా లేదు. మార్పు వచ్చింది. మీ డైట్ ఏంటి? నేను వెజిటేరియన్‌ని. ఆకలేసినప్పుడు మాత్రమే తింటాను. టెస్టీ ఫుడ్ ముందుంది కదా, లేకపోతే తినే టైమ్ అయింది కదా అని తినను. అది బాగా హెల్ప్ అయిందనుకుంటాను. పిజ్జా, పానీపూరీ అన్నీ తింటాను. తినడానికి టైమింగ్ కూడా పెట్టుకోను. కొన్నిసార్లు నా లంచ్ 12కే అయిపోతుంది. కొన్నిసార్లు 3 వరకూ ఆకలి అవ్వదు. టైమ్ టూ టైమ్ తినమంటారు. మీరు పాటిస్తున్నది కరెక్టేనంటారా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పింది కాదు, మీ కడుపు చెప్పింది వినండి. రోజుకి ఒక్కసారి తినేవాళ్లు యోగి. రెండుసార్లు తినేవాళ్లు భోగి, మూడుసార్లు తినేవాళ్లు రోగి. (నవ్వుతూ). తక్కువ తినడం వల్ల ఎవ్వరూ ఇబ్బంది పడరు. ఇబ్బందల్లా ఎక్కువ తినప్పుడే కదా. ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో తక్కువ తిని జబ్బులు తెచ్చుకున్నవాళ్ళు లేరు. ఓవర్ ఈటింగ్ వల్లే అనారోగ్యం. జనరల్‌గా సౌత్ ఇండియన్ ఫుడ్ బెస్ట్ అంటారు. మా తాతలు, అమ్మమ్మలు నెయ్యి తిన్నారు. కానీ సైన్స్ నెయ్యి తినొద్దు అని చెప్పింది. అయితే ఇప్పుడు నెయ్యిని సూపర్ ఫుడ్ అంటున్నారు. పరగడుపుతోనే ఓ స్పూన్ నెయ్యి తినండి అంటున్నారు. ఒకప్పుడు ఇడ్లీ, చపాతి, అన్నంలో ఓ రెండు స్పూన్లు నెయ్యి వేసేవారు. కారణం ఏంటి? కార్బోహైడ్రేట్స్, ఫాట్స్ రెండూ కలిపి తింటే అరగడానికి సమయం పడుతుంది. ఆకలి వేయదు. మళ్లీ నాలుగైదు గంటల వరకూ ఏమీ తినం. ఉత్తి కార్బోహైడ్రేట్స్ మాత్రమే తింటే గంటలోనే ఆకలి అవుతుంది. మళ్లీ తింటాం. అందుకే నెయ్యి తినాలి. -
మహిళల గురించి చెప్పే సినిమా
‘మైనే ప్యార్ కియా’ (‘ప్రేమ పావురాలు’) ఫేమ్ భాగ్యశ్రీ, ‘రోజా’ ఫేమ్ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్ దీప్తీ భట్నాగర్, ‘జయం’ ఫేమ్ సదా, సుమన్ రంగనాథ్, హరితేజ, పూజా ఝవేరి, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రల్లో తెరకెక్కనున్న చిత్రం ‘కిట్టిపార్టీ’. ఈ సినిమాతో సుందర్ పవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా లోగోని హైదరాబాద్‌లో విడుదల చేశారు. సుందర్ పవన్ మాట్లాడుతూ– ‘‘ఇదొక ఫీమేల్ బడ్డీ డ్రామా. అలాగని మహిళలకు సంబంధించిన సినిమా కాదు. కానీ, సినిమాలో మహిళలే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఏ సినిమాకూ రీమేక్ కాదు. ఆరుగురు మహిళల చుట్టూ కథ తిరుగుతుంది. భోగేంద్ర గుప్తా లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. అతిత్వరలో చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అన్నారు. ‘‘సినిమాలో నటించడానికి అంగీకరించిన నటీనటులకు థ్యాంక్స్’’ అన్నారు భోగేంద్ర గుప్తా. ‘‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్ చేయడమే పురుషులకు కష్టమైన పని. మా దర్శకుడు సెట్లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్ చేయాలి’’ అన్నారు భాగ్యశ్రీ (నవ్వుతూ). ‘‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసే ఇండస్ట్రీలో.. హీరో లేని ఒక సినిమాకు నేను సంతకం చేశా. ఈ చాన్స్ ఇచ్చినందుకు పవన్, గుప్తాగారికి థ్యాంక్స్’’ అన్నారు మధుబాల. ‘‘మహిళల గురించి చెప్పే చిత్రమిది’’ అన్నారు సదా. ‘‘20 ఏళ్ల తర్వాత హైదరాబాద్ రావడం హ్యాపీగా ఉంది. ‘పెళ్లి సందడి’ సినిమా చేసిన రోజులు ఇంకా గుర్తున్నాయి’’ అన్నారు దీప్తీ భట్నాగర్. సుమన్ రంగనాథ్, హరితేజ, పూజా ఝవేరి పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సిద్దార్థ సదాశివుని, కెమెరా: సాయిశ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎస్. రమణారెడ్డి, సహ నిర్మాత: శివ తుర్లపాటి. -
ఫీమేల్ బడ్డీ డ్రామా ‘కిట్టి పార్టీ’
ఆచార్య క్రియేషన్స్, బ్లూ సర్కిల్ కార్పొరేషన్ పతాకాలపై భోగేంద్ర గుప్తా నిర్మిస్తున్న సినిమా ‘కిట్టి పార్టీ’. సుందర్ పవన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ‘మైనే ప్యార్ కియా’ (తెలుగులో ‘ప్రేమ పావురాలు’) ఫేమ్ భాగ్య శ్రీ, ‘రోజా’ ఫేమ్ మధుబాల, ‘పెళ్లి సందడి’ ఫేమ్ దీప్తీ భట్నాగర్, సదా, సుమన్ రంగనాథ్, హరితేజ, హర్షవర్ధన్ రాణే, పూజా జవేరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ సినిమా లోగో విడుదల చేశారు. అనంతరం దర్శకుడు సుందర్ పవన్ మాట్లాడుతూ ‘ఇదొక ఫీమేల్ బడ్డీ డ్రామా. అలాగని, ఆడవాళ్ళకు సంబంధించిన సినిమా అని చెప్పను. కానీ, సినిమాలో ఆడవాళ్ళు మాత్రమే ఎక్కువసేపు కనిపిస్తారు. నాకు తెలిసిన కొన్ని నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. స్ట్రయిట్ తెలుగు సినిమా ఇది. ఏ పరభాషా సినిమాకూ రీమేక్ కాదు. వేరే సినిమా స్ఫూర్తితో తీయడం లేదు. ముఖ్యంగా ఆరుగురు మహిళలు చుట్టూ కథ తిరుగుతుంది. భాగ్య శ్రీ, దీప్తీ భట్నాగర్, సుమన్ రంగనాథ్, మధుబాల, సదా, హరితేజ, పూజా జవేరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో మరిన్ని సినిమా వివరాలు వెల్లడిస్తాం’ అన్నారు. భాగ్య శ్రీ మాట్లాడుతూ ‘జీవితంలో ఒక్క మహిళను హ్యాండిల్ చేయడమే పురుషులకు కష్టమైన పని! నవ్వుతూ... మా దర్శకుడు సెట్లో మా ఏడుగురు మహిళలను హ్యాండిల్ చేయాలి. ఎలా చేస్తాడో! మహిళల దృక్కోణం నుంచి ఆలోచించి ఈ కథ రాసిన దర్శకుడు పవన్‌ని అభినందిస్తున్నా. మహిళల మనస్తత్వాలను అర్థం చేసుకున్నటువంటి దర్శకుడితో పని చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా హాలీవుడ్లో వచ్చిన ‘డెస్పరేట్ హౌస్‌వైఫ్స్’, ‘సెక్స్ అండ్ ది సిటీ’ సినిమాల తరహాలో ఉంటుంది. ప్రేక్షకులకు తమ జీవితాల్లో ప్రతిరోజూ తారసపడే మహిళల్లో ఎవరో ఒకరు మా పాత్రల్లో ఏదో పాత్రలో కనిపిస్తారు.’ అన్నారు. మధుబాల మాట్లాడుతూ ‘హీరోపై మాత్రమే ఎక్కువ ఫోకస్ చేసే ఇండస్ట్రీలో... హీరో ఎవరూ లేని ఒక సినిమాకు నేను సంతకం చేశా. ఇంటర్వ్యూలలో మెరిల్ స్ట్రీప్ వంటి హాలీవుడ్ తారలు మెయిన్ లీడ్స్‌గా సినిమాలు చేస్తున్నారని చెబుతుంటాం. మేముందుకు అటువంటి సినిమాలు, అటువంటి అద్భుతమైన పాత్రల్లో నటించలేం? ఇప్పుడు చేస్తున్నాం. ఇందులో నేనొక మెయిన్ లీడ్‌గా, పూజా జవేరికి తల్లిగా నటిస్తున్నా. నా చిన్ననాటి స్నేహితురాళ్ళు సుమన్, భాగ్య శ్రీతో నటిస్తుండటం సంతోషంగా ఉంది’ అన్నారు. దీప్తీ భట్నాగర్ మాట్లాడుతూ ‘హైదరాబాద్ రావడం, అదీ 20 ఏళ్ళ తర్వాత రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సిటీ నా ఫస్ట్ లవ్. నాకింకా ‘పెళ్లి సందడి’ సినిమా షూటింగ్ చేసిన రోజులు గుర్తున్నాయి. ఈ సినిమా ఎప్పటికీ నా మనసులో ఉంటుంది. చాలా విరామం తర్వాత మళ్ళీ తెలుగు సినిమాలో నటిండచం సంతోషంగా ఉంది’ అన్నారు. సుమన్ రంగనాథ్ మాట్లాడుతూ ‘నేను తెలుగులో రెండు మూడు సినిమాలు చేశాను. మళ్ళీ తెలుగులో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమాలో కథే హీరో’ అన్నారు. హరితేజ మాట్లాడుతూ ‘నిజంగానే పార్టీలా ఉంటుందీ సినిమా. చక్కగా, హాయిగా మూడు గంటలు ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. ప్రేక్షకులు అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. ఒక అమ్మాయి జీవితంలో పార్టీలు, సరదాలు, ఫన్ ఒక స్టేజ్ తర్వాత అయిపోయాక... బాధ్యతలు పెరిగాక... వాటి నుంచి మళ్ళీ ఒక టీనేజ్‌లోకి వచ్చే స్టోరీ ఎంత గమ్మత్తుగా ఉంటుందో? అక్కడ స్నేహితులు ఎలా ఉంటారో? అనే విషయాలు సినిమాలో చూడొచ్చు. నేను చెప్పింది సినిమాలో ఇసుక రవ్వంతే. ఇంకా చాలా ఉంది’’ అన్నారు.