నిజజీవితంలో జరిగే సంఘటనలే 'సత్యం వధ ధర్మం చెర' | Satyam Vadha Dharmam Chera Movie release on March 31st | Sakshi
Sakshi News home page

Satyam Vadha Dharmam Chera: నిజజీవితంలో జరిగే సంఘటనలే 'సత్యం వధ ధర్మం చెర'

Published Fri, Mar 24 2023 9:29 PM | Last Updated on Fri, Mar 24 2023 9:30 PM

Satyam Vadha Dharmam Chera Movie release on March 31st - Sakshi

పూజ, మధుబాల ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'సత్యం వధ ధర్మం చెర'. వి.శ్రీనివాస్ ఆర్ట్ క్రియేషన్స్,  త్రిదేవ్ క్రియేషన్స్ పతాకంపై ఎదుబాటి కొండయ్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి బాబు నిమ్మగడ్డ దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 31న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రెస్ మీట్ నిర్వహించింది.

దర్శకుడు బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ..' చిన్న పిల్లలకి నిద్రపుచ్చడానికి కథలు చెప్తు ఉంటాం. కానీ పెద్దలను మేలుకొల్పటానికి కొన్ని కథలు చెప్పాల్సిందే. ఈ చిత్ర కథ మన నిజ జీవితంలో ప్రతిరోజూ జరిగే సంఘటనలే. మనం ప్రతి రోజు ఇలాంటి వార్తలు చదువుతూ ఉంటాం. మన రాజ్యాంగం చాలా గొప్పది. మన చట్టం  చాలా గట్టిది. మరీ నిజంగా చట్టం ఎలా పనిచేయాలో మా సినిమాలో చుపించాం.  ఈ చిత్రం మార్చి 31న విడుదల కానుంది.' అని అన్నారు.

హీరోయిన్ పూజ మాట్లాడుతూ..'నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకి ధన్యవాదాలు. ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రం అందరికి నచ్చుతుంది. అందరు మా  చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా.' అని అన్నారు.

మరో నటి మధుబాల మాట్లాడుతూ..'నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకి ధన్యవాదాలు. నాది చాలా కీలక పాత్ర. బాలకృష్ణ గారి సినిమా డైలాగు తో ఒక పాట ఉంటుంది. ఆ పాటలో నేను నటించాను. ఆ పాట చూస్తే బాలకృష్ణ ఫ్యాన్స్‌కు పండగే. మా సినిమా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా.' అని అన్నారు. ఈ చిత్రంలో స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్, రోహిణి, కీర్తి, రాజా, బద్రీనాథ్, సాగర్, సీత, సుధానిసా, రాధికా చౌదరి, అర్జు, బాబు బంగారు, బి.కె.పి.చౌదరి, శ్రీనివాస్ రెడ్డి, అనంతలక్ష్మి, నాని తదితరులు నటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement