గతేడాది తమిళంలో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘డా..డా’. ఈ చిత్రంలో కవిన్, అపర్ణ దాస్ హీరో, హీరోయిన్లుగా నటించారు. గణేశ్ కె బాబు దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ మూవీ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.30 కోట్లు వసూలు చేసింది. తండ్రి కొడుకుల సెంటిమెంట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం కోలీవుడ్‌లో సక్సెస్ సాధించింది.
కోలీవుడ్‌లో సూపర్ హిట్ కావడంతో తెలుగు ఆడియన్స్ ముందుకు ఈ మూవీని తీసుకొస్తున్నారు. పా.. పా పేరుతో తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. జేకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాత నీరజ కోట విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 3న ఆంధ్ర, తెలంగాణతో పాటు అమెరికా, ఆస్ట్రేలియా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు. ఇటీవలే విడుదల చేసిన పా.. పా.. మూవీ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment