
ఇంతకుముందు అన్నయ్య దర్శకత్వంలో తమ్ముడు కథానాయకుడిగా నటించిన చిత్రాలు చూశాం. అలా నటుడు మోహన్ రాజా దర్శకత్వంలో జయం రవి కథానాయకుడిగా, సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ నటించిన పలు చిత్రాలు విజయవంతమయ్యాయి. కాగా తాజాగా తమ్ముడు దర్శకత్వంలో అన్నయ్య కథానాయకుడుగా నటిస్తున్న చిత్రం రూపొందడం విశేషం. ఆ చిత్రమే గేమ్ ఆన్ బాబు.జి సమర్పణలో కస్తూరి క్రియేష¯న్స్, గోల్డెన్ రింగ్స్ ప్రొడక్ష¯న్స్ సంస్థల ద్వారా రవి కస్తూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దయానంద్ కథ కథనం దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆయన అన్నయ్య గీతానంద్ కథానాయకుడుగా నటిస్తున్న ఇందులో నేహా సోలంగి నాయకిగా నటిస్తున్నారు.
ప్రధాన పాత్రలో నటి మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, వాసంతి కృష్ణన్ తదితరులు నటిస్తున్నారు. దీనికి అభిõÙక్ ఏఆర్ సంగీతాన్ని, అరవింద్ చాయాగ్రహణం అందిస్తున్నారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ సిద్ధార్థ అనే 27 ఏళ్ల యువకుడు ఓ రియల్ ఎస్టేట్ సంస్థలో వ్యాపార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహిస్తుంటాడన్నారు. అతనికి రాహుల్ అనే మిత్రుడు మోక్ష అనే స్నేహితురాలు ఉంటారన్నారు. అయితే ఒకరోజు ఉద్యోగం పోవడంతో తన ఇంటికి వచ్చిన సిద్ధార్థకు అక్కడ తాను ఎంతగానో ప్రేమించే మిత్రులు చేస్తున్న ఓ పని చూసి షాక్‌కు గురౌతున్నారు.
తన జీవితంలో తాను ప్రేమిస్తున్న అందరూ తనను అవసరానికి వాడుకుంటున్నారనీ, ఎవరూ నిజమైన ప్రేమను అందించడం లేదని గ్రహించి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడతాడన్నారు. అలాంటి సమయంలో అనూహ్యంగా ఒక వ్యక్తి రక్షించడంతో ప్రాణాపాయం నుంచి రక్షించబడి రియల్ టైం సైకాలజికల్ అనే గేమ్ లోకి అడుగు పెడతాడని చెప్పారు. ఆ తర్వాత అతని జీవితం ఎటువైపు మళ్లిందనే పలు ఆసక్తికరమైన అంశాలతో గేమ్ ఆన్ చిత్రం రూపొందినట్లు పేర్కొన్నారు.