'ఆమెతో రొమాన్స్ మిస్ అయ్యాను' | My fantasy was to romance Madhubala in song, says Rishi Kapoor | Sakshi
Sakshi News home page

'ఆమెతో రొమాన్స్ మిస్ అయ్యాను'

Published Tue, Jun 14 2016 5:07 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

'ఆమెతో రొమాన్స్ మిస్ అయ్యాను' - Sakshi

'ఆమెతో రొమాన్స్ మిస్ అయ్యాను'

తనకు అలనాటి అందాల సుందరితో రొమాన్స్ చేయాలని ఆశ పడుతున్నట్లు బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ అంటున్నారు. ఆమె మరెవరో కాదు.. 'మొఘల్ ఈ అజమ్' తో అభిమానులను ఆకట్టుకున్న నటి మధుబాల. 1933లో జన్మించిన హీరోయిన్ మధుబాల కేవలం 36 ఏళ్ల వయసులో 1969లో చనిపోయింది. ఆమెతో ఓ పాటలో రొమాన్స్ చేయాలన్న తన కోరిక ఎప్పటికీ అలాగే ఉండిపోయిందని రిషికపూర్ ట్వీట్ చేశారు. ఆమె హీరోయిన్ గా ఉన్న సమయంలో తాను కూడా పుట్టి, హీరోగా ఉంటే బాగుండేదని ఆ సమయంలో పుట్టలేదని వర్రీ అవుతున్నట్లు ట్వీట్ ద్వారా అభిప్రాయపడ్డారు.

మహల్, తరానా లాంటి హిట్ మూవీలు ఆమె సొంతం. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె ఎప్పటికీ ఐకాన్ గా ఉండిపోతుంది. బాబీ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రిషి.. ప్రేమ్ రోగ్, అమర్ అక్బర్ అంథోనీ, కర్జ్ లాంటి హిట్ మూవీలలో నటించారు. ఇటీవల విడుదలైన కపూర్ అండ్ సన్స్ ఆయన చివరి చిత్రం. అలనాటి అందమైన, అద్భుతమైన నటితో కనీసం ఓ పాటలో నైనా రొమాన్స్ చేయలేకపోయానని మనకు తెలియని కొత్త విషయాన్ని రిషికపూర్ వెల్లడించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement