
థియేటర్, ఓటీటీ అని సంబంధం లేకుండా తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలను అన్నింటినీ చేసుకుంటూ పోతున్నాడు నటుడు నవీన్ చంద్ర. ఇటీవలే పరంపర రెండో సీజన్‌లో సీరియస్ పాత్రలో అదరగొట్టిన ఈయన తాజాగా మరో కొత్త సినిమాతో అలరించబోతున్నాడు.
Naveen Chandra Repeat Movie Sneak Peek Video Out: థియేటర్, ఓటీటీ అని సంబంధం లేకుండా తన దగ్గరకు వచ్చిన మంచి పాత్రలను అన్నింటినీ చేసుకుంటూ పోతున్నాడు నటుడు నవీన్ చంద్ర. ఇటీవలే పరంపర రెండో సీజన్‌లో సీరియస్ పాత్రలో అదరగొట్టిన ఈయన తాజాగా మరో కొత్త సినిమాతో అలరించబోతున్నాడు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిపీట్. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో ప్రసారం కాబోతోంది. ఆగస్టు 25 నుంచి అందుబాటులోకి రానున్నట్లు హాట్‌స్టార్ ఇటీవల ప్రకటిస్తూ ట్రైలర్ కూడా విడుదల చేసింది.
తాజాగా రిపీట్ స్నీక్ పీక్ పేరిట మూడున్నర నిమిషాల నిడివి గల వీడియోను రిలీజ్ చేశారు. ''ఈ వీడియోలో ఒక రైటర్ ఏదో సీరియస్‌గా రాస్తుంటాడు. ఎదురుగా చిరాకుగా ఉన్న ఒకామె అతన్ని చూసి ఏం రాశాడో చదవమని ఒకరికి సైగ చేస్తుంది. ఆ పేపర్ తీసుకున్న వ్యక్తి చదివాక వెంటనే ఆమె విక్రమ్‌కి కాల్ చేయండి అని అంటుంది. ఫోన్ కాల్ మాట్లాడిన విక్రమ్‌కు ఒక బ్రిడ్జి కింద నీటిలో అమ్మాయి మృతదేహం దొరుకుతుంది.'' అసలు ఆ అమ్మాయి ఎవరు? ఆ రైటర్ ఎవరు? అతను రాసినట్లుగా ఎందుకు జరిగింది? పోలీసులు అతని మాటలు ఎందుకు నమ్మారు? అనే విషయాలు తెలియాలంటే ఆగస్టు 25 వరకు ఆగాల్సిందే.
చదవండి: ప్రభాస్ అంటే చాలా ఇష్టం, మేము ఫ్రెండ్స్ కూడా: పీవీ సింధు
నా వల్లే భారతీయ రైల్వేస్‌కు ఆదాయం పెరిగింది: కరీనా కపూర్
ఇక సినిమా విషయానికొస్తే అరవింద శ్రీనివాసన్ దర్శకత్వంలో తెరకెక్కిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ 'రిపీట్'. నవీన్ చంద్ర, మధుబాల, అచ్యుత్ కుమార్, స్మృతి వెంకట్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం తమిళ్ మూవీ 'డేజావు'కు రీమేక్‌గా రానుంది. ఈ సినిమాలో డేజావు (ప్రస్తుతం జరుగుతున్న విషయం ఇంతకుముందే జరిగినట్లుగా అనిపించే అనుభూతి) ప్రధానాంశంగా ఉండి, ప్రతి సన్నివేశం ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుందని డైరెక్టర్ అరవింద శ్రీనివాసన్ పేర్కొన్నారు.