Actress Madhoo Review On Shyam Singha Roy Movie, See Sai Pallavi Reaction - Sakshi
Sakshi News home page

Shyam Singh Roy: శ్యామ్‌ సింగరాయ్‌పై మధుబాల రివ్యూ.. సాయిపల్లవి రిప్లై

Published Sat, Jan 29 2022 5:32 PM | Last Updated on Sat, Jan 29 2022 7:19 PM

Actress Madhoo Review On Shyam Singha Roy Movie, See Sai Pallavi Reaction - Sakshi

నాని హీరోగా 'టాక్సీవాలా' ఫేం రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. సాయి పల్లవి, కృతీ శెట్టి, మడోన్నా సెబాస్టియన్‌ హీరోయిన్లుగా నటించారు. వెంకట్‌ బోయినపల్లి నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 24న విడుదలైంది. క్రిస్‌మస్‌ కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి మంచి కలెక్షన్లు వచ్చాయి. జనవరి 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లోనూ అందుబాటులోకి వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

మూవీలో దేవదాసి పాత్రకు ప్రాణం పోసిన నేచురల్‌ బ్యూటీ సాయిపల్లవి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. తాజాగా సీనియర్‌ నటి మధుబాల శ్యామ్‌ సింగరాయ్‌ సినిమా చూడటమే కాక దీనిపై రివ్యూ ఇచ్చింది. 'శ్యామ్‌ సింగరాయ్‌ చూశాను. చాలా అద్భుతంగా ఉంది. సాయిపల్లవి సహజ నటన, అందం, అంతకుమించిన డ్యాన్స్‌ అన్నీ బాగున్నాయి. నేను ఆమెకు పెద్ద అభిమానిని. నాని ఫెంటాస్టిక్‌గా నటించాడు' అని పేర్కొంటూ సెల్ఫీ వీడియో పోస్ట్‌ చేసింది. దీనికి సాయిపల్లవి స్పందిస్తూ.. 'మీ ప్రశంసలకు ధన్యవాదాలు మేడమ్‌. మీ పొగడ్తలకు నేను ఉప్పొంగిపోతున్నాను' అని ట్వీట్‌ చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement