సీరియల్ శివగామిగా సీనియర్ హీరోయిన్ | Madhubala as serial sivagami | Sakshi
Sakshi News home page

సీరియల్ శివగామిగా సీనియర్ హీరోయిన్

Published Wed, Jun 14 2017 11:06 AM | Last Updated on Tue, Sep 5 2017 1:37 PM

సీరియల్ శివగామిగా సీనియర్ హీరోయిన్

సీరియల్ శివగామిగా సీనియర్ హీరోయిన్

బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రచయిత విజయేంద్ర ప్రసాద్, బుల్లితెరపై సత్తా చూపిస్తున్నాడు. భారీ గ్రాఫిక్స్ తో హిందీలో రూపొందుతున్న ఆరంభ్ సీరియల్ కు కథ అందిస్తున్నాడు విజయేంద్ర ప్రసాద్. దాదాపు బాహుబలి తరహా కథా కథనాలతో రూపొందుతున్న ఈ సీరియల్ లో సౌత్ బ్యూటీ కార్తీక దేవసేన గా నటిస్తోంది. తాజాగా ఈ సీరియల్ కు సంబంధించిన ఇంట్రస్టింగ్ అప్ డేట్ ఒకటి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.

త్వరలో టెలికాస్ట్ కానున్న ఈ సీరియల్ లో శివగామి తరహా పాత్ర కూడా ఉంది. ఈ పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా మూవీ ఫేం మధుబాల నటిస్తోంది. ఈ విషయాన్ని మధుబాల స్వయంగా ప్రకటించింది. చిత్ర దర్శకుడు గోల్డీ బెహన్, ఆయన భార్య సోనాలి తో ఉన్న స్నేహం కారణంగానే ఏ మాత్రం ఆలోచించకుండా ఈ సీరియల్ లో నటించేందుకు అంగీకరించానంది మధుబాల.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement