ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్ టైమ్ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అన్న ఇత్తివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధు బాల, ఆదిత్య మీనన్ కీలక పాత్ర నటిస్తున్నారు. ఈ సనిమాను సమ్మర్‌లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్బంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ ‘‘రథం చిత్రం తర్వాత గీతానంద్‌ని మరోస్థాయిలో నిలబెట్టే చిత్రమిది. గీతానంద్, దయానంద్ ఇద్దరిలో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. ప్రతి ఫ్రేమ్ మిమ్మల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. అలాగే ఈ సినిమాకు మేము చేసే ప్రతి ప్రమోషన్ కూడా వినూత్నమైన రీతిలో ఉంటుంది. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’అని అన్నారు. ‘ట్విస్టులు, టర్నులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కథ సాగుతుంది. సినిమాలో యాక్షన్, రొమాన్స్. ఎమోషన్స్... అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’అని దర్శకుడు దయానంద్ అన్నారు. ‘ఈ చిత్రంలో పాత్రలన్ని గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’అని హీరో గీతానంద్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment