Geetanand
-
Game On Movie Review Telugu: సైకలాజికల్ థ్రిల్లర్ ‘గేమ్ ఆన్’ మూవీ ఎలా ఉందంటే..
టైటిల్: గేమ్ ఆన్ నటీనటులు: గీతానంద్, నేహా సోలంకి, ఆదిత్య మీనన్, మధుబాల, వాసంతి, కిరీటీ, శుభలేఖ సుధాకర్ తదితరులు నిర్మాత: రవి కస్తూరి దర్శకత్వం: దయానంద్ సంగీతం: అభిషేక్ ఏఆర్(బీజీఎం), నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్(పాటలు) సినిమాటోగ్రఫీ: అరవింద్ విశ్వనాథన్ ఎడిటర్: వంశీ అట్లూరి విడుదల తేది: ఫిబ్రవరి 2, 2024 కథేంటంటే.. గౌతమ్ సిద్ధార్థ్ అలియాస్ సిద్ధు(గీతానంద్) ఓ గేమింగ్ కంపెనీలో పని చేస్తుంటాడు. అదే సంస్థలో పని చేసే మోక్ష(వాసంతి)తో ప్రేమలో ఉంటాడు. టార్గెట్ సరిగా పూర్తి చేయకపోవడంతో అతన్ని ఉద్యోగం పోతుంది. అదే సమయంలో మోక్ష కూడా సిద్ధుకి బ్రేకప్ చెప్పి.. అతని ఫ్రెండ్ రాహుల్(కిరీటీ)తో వెళ్లిపోతుంది. ఉద్యోగం కోల్పోవడం.. స్నేహితుడు మోసం చేయడంతో సిద్దు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి సిద్ధుకి ఫోన్ వస్తుంది. ‘నీ ముందు తిరుగుతున్న ఈగను చంపేస్తే లక్ష రూపాలయను అకౌంట్లో వేస్తాం’అని చెబుతాడు. సిద్ధు ఈగను చంపగానే..అకౌంట్లోకి రూ.లక్ష క్రెడిట్ అవుతుంది. దీంతో సిద్ధు ఆత్మహత్య ఆలోచనను విరమించి ఇంటికెళ్తాడు. ఆ తర్వాతి మళ్లీ కాల్ చేసి..‘ఇదొక సైకలాజికల్ గేమ్ షో అని, చిన్న పిల్లను ఏడిపిస్తే..రూ.మూడు లక్షలు పంపిస్తామని చెబుతారు. అలా వరుసగా చిన్న చిన్న టాస్క్‌లు ఇస్తూ డబ్బులు పంపించడంతో సిద్ధు జీవితమే మారిపోతుంది. అతని జీవితంలోకి తార(నేహా సోలంకి) వస్తుంది. ఇలా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్న సమయంలో గేమ్‌లో భాగంగా ఓ వ్యక్తిని చంపాలని ఫోన్ కాల్ వస్తుంది. సిద్ధు ఆ టాస్క్‌ని పూర్తి చేయలేనని చెబుతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు సిద్ధుకి టాస్క్‌లు ఇస్తున్నదెవరు? ఎందుకు ఇస్తున్నారు? సైకాలజిస్ట్ మదన్ మోహన్(ఆదిత్య మీనన్)కు ఈ గేమ్‌తో ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు గతమేంటి? తాత సూర్య నారాయణ(సుభలేఖ సుధాకర్) ఎలా చనిపోయాడు? అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన అర్చన(మధుబాల)కి సిద్ధుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సిద్ధు జీవితంలోకి తార ఎలా వచ్చింది? అసలు ఆమె నేపథ్యం ఏంటి? రియల్ టైమ్ గేమ్‌లోకి వెళ్లిన తర్వాత సిద్ధు జీవితంలో ఎలాంటి మలుపులు వచ్చాయి? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే... ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్ టైమ్ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అనేది ఈ సినిమా ఇత్తివృత్తం. హీరో లూజర్ నుంచి విన్నర్ గా ఎలా మారాడు అనేది కాస్త ఆసక్తికరంగా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు దయానంద్. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న సస్పెన్స్‌ని చివరి వరకు బయటపడకుండా జాగ్రత్త పడుతూ కథనాన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశాడు. అయితే ఈ ప్రయత్నంలో దర్శకుడు కొంత వరకు మాత్రమే సఫలం అయ్యాడు. కాన్సెప్ట్ కాస్త డిఫరెంట్‌గా ఉన్నా.. కథనంలో మాత్రం ఆ కొత్తదనం కనిపించలేదు. సినిమా మొత్తంలో తొమ్మిది టాస్క్‌లు ఉంటాయి. వాటిని మరింత బలంగా చూపిస్తే బాగుంటుంది. ఎంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా..తెరపై చూస్తే కొంచెం అయినా రియాలిటీకి దగ్గరగా ఉండాలి. గేమ్ ఆన్‌లో అది మిస్ అయింది. అయితే కొన్ని చోట్ల మాత్ర ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయింది. అలాగే యూత్‌ని ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలు కూడా బాగానే ఉన్నాయి. ఓ క్రైమ్ సీన్‌తో సినిమా ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత కథ పదేళ్లు ముందుకు జరుగుతుంది.ఓ లూజర్‌గా హీరోని పరిచయం చేయించాడు దర్శకుడు. ఉద్యోగం పోవడం.. స్నేహితుడు మోసం చేయడంతో హీరో క్యారెక్టర్‌పై జాలీ కలిగించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. ఒక్కసారి ఆన్లైన్ గేమ్ ప్రారంభం అవ్వగానే.. ప్రేక్షకులకు కూడా థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఈజీ టాస్కులకు పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో..ఏదో జరగబోతుందనేది ప్రేక్షకుడికి తెలిసినా.. అది ఏంటనే క్యూరియాసిటీ మాత్రం చివరి వరకు ఉండేలా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. ఫన్నీ టాస్క్‌లు.. రొమాంటిక్ సన్నివేశాలతో ఫస్టాఫ్ సాఫీగా సాగుతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో కథనం కాస్త నెమ్మదిగా సాగుతుంది.హీరో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌కు గురి చేస్తుంది. క్లైమాక్స్ రొటీన్‌గా ఉంటుంది. గేమ్‌లోని టాస్క్‌ని మరింత ఆసక్తికరంగా తీర్చిదిద్ది ఉంటే సినిమా ఫలితం మరోలా ఉండేది. ఏది ఏమైనా..గేమ్ ఆన్ మాత్రం కాస్త డిఫరెంట్ మూవీ అనే చెప్పొచ్చు. ఎవరెలా చేశారంటే.. గౌతమ్ సిద్ధార్థ్ పాత్రలో గీతానంద్ ఒదిగిపోయాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాలలోనూ చక్కగా నటించాడు. తారగా నేహా సొలంకి తెరపై కాస్త హాట్‌గా కనిపించింది. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోతుంది.గీతానంద్, నేహ సొలంకిల ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా పండింది. ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్ మధుబాల డిఫరెంట్ పాత్ర పోషించి మెప్పించింది. ఫస్టాఫ్‌లో ఆమె పాత్రకు ఎలాంటి సన్నివేశాలు ఉండవు. సైకాలజిస్ట్ మదన్ మోహన్‌గా ఆదిత్య మీనన్ అదరగొట్టేశాడు. శుభలేఖ సుధాకర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో చక్కగా నటించాడు. వాసంతి, కిరిటీతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాకేంతికంగా ఈ సినిమా బాగుంది. అభిషేక్ ఏఆర్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్ అయింది. నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్ పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ప్రతి ఫ్రేమ్‌ని తెరపై రిచ్‌గా చూపించాడు. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. -
విన్నర్‌గా ఎలా మారాడు?
‘‘గేమ్ ఆన్’ యునిక్ స్టోరీ. రెగ్యులర్‌గా కాకుండా వైవిధ్యంగా చేయాలని ప్రయత్నించాం. ఈ చిత్రంలో హీరో లూజర్ నుంచి విన్నర్‌గా ఎలా మారాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఇందులో భాగంగా ఉండే టాస్కులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని గీతానంద్ అన్నారు. దయానంద్ దర్శకత్వంలో గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. రవి కస్తూరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా హీరో గీతానంద్ మాట్లాడుతూ–‘‘దయానంద్ నా తమ్ముడు కావడంతో ‘గేమ్ ఆన్’ స్క్రిప్ట్ విషయంలో బాగా చర్చించుకునే వాళ్లం. రవి కస్తూరి కూడా నా ఫ్రెండ్ కావడంతో ముగ్గురం చర్చించుకుని నిర్ణయాలు తీసుకునేవాళ్లం. ఈ మూవీకి సీక్వెల్ ప్లా న్ ఉంది’’ అన్నారు. -
సినిమానే మాట్లాడుతుంది
గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించిన చిత్రం ‘గేమ్ ఆన్’. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం రవి కస్తూరి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఆస్ట్రేలియాలో నాకు వ్యాపారాలున్నాయి. నిర్మాతగా నాకు ఇది తొలి చిత్రం. గీతానంద్ హీరోగా, నేను నిర్మాతగా సినిమాలు చేయాలనుకున్నాం. కథ సెట్ కావడంతో ‘గేమ్ ఆన్’ స్టార్ట్ చేశాం. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు? అనేది గేమ్ థీమ్‌లో చూపించాం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా కూడా. ఓ సినిమాకు మనం ఎంత పబ్లిసిటీ చేసినా మార్నింగ్ షోకు ఆడియన్స్ వెళ్లేంతవరకే. ఆ తర్వాత సినిమానే మాట్లాడుతుంది’’ అని చెప్పుకొచ్చారు. -
‘గేమ్ ఆన్’తో ఆ విషయం అర్థమైంది..నిర్మాతగా కొనసాగుతా: రవి కస్తూరి
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన తాజా చిత్రం ‘గేమ్ ఆన్’. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత రవి కస్తూరి మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. ► కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. గీతానంద్ హీరోగా, నేను నిర్మాతగా సినిమా చేయాలనుకున్నాం. ఇప్పుడు మంచి కథ సెట్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశాం. ప్రీ ప్రొడక్షన్ కి టైం ఎక్కువ కేటాయించి అంతా పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాం. ► ఈ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. రియల్ టైం సాగే కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. యాక్షన్, ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు అనేది గేమ్ థీమ్ లో చూపించాం. సినిమా ప్రారంభం నుంచి కాన్ఫిడెంట్ గానే ఉన్నాం. నిర్మాతగా ఈ సినిమా నుంచి సహనంగా ఉండాలని నేర్చుకున్నా. ► హీరో గీతానంద్ మా ఫ్రెండ్ కాబట్టి తనని ఎప్పటినుంచో చూస్తున్నా. తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. తన బ్రదర్ దయానంద్ కు డైరెక్టర్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. శుభలేఖ సుధాకర్ గారి లాంటి మంచి మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు. సెట్లో చాలా సరదాగా ఉండేవారు. ► ఆదిత్య మీనన్ గారు మంచి పర్ఫార్మర్. మధుబాల గారికి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది. ఆమె చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవుతుంది. ► ఆస్ట్రేలియాలో వ్యాపారాలు చేస్తూ సినిమా చూసుకోవడం కాస్త ఛాలెంజింగ్ గానే అనిపించింది. ఇక్కడ పెద్ద సినిమా, చిన్న సినిమా అని రెండే క్యాటగిరిలు ఉన్నాయి. మాకు మాత్రం కంటెంట్ పై పూర్తి నమ్మకం ఉంది. ఇకపై నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నా. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకు మరో పది సినిమాలకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే రెండు కథలు విన్నాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాటిని అనౌన్స్ చేస్తాం. -
మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి : హీరో గీతానంద్
గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్ శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది.శనివారం హైదరాబాదులోని ప్రసాద్ లాబ్స్ లో ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో గీతానంద్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం చాలా రీసెర్చ్ చేశాం. మంచి కాన్సెప్ట్ రాసుకుని దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. ఇదొక హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గా పని చేసే ఒక ఎంప్లాయ్ జీవితంపై విరక్తి చెంది ఒక గేమ్ లో పడితే ఎలా ఉంటుందనేది ఈ సినిమాలో ఆసక్తికరంగా చూపించాం. మధుబాల గారు ఆదిత్య మీనన్ గారు ఇందులో ఉండడం ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లింది. గేమ్ స్టార్ట్ చేసాం . మా గేమ్ ను ప్రేక్షకులే గెలిపించాలి. ఈ సినిమా తర్వాత మా తమ్ముడైన డైరెక్టర్ దయానంద్ యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకుంటాడు. నేను కూడా నటుడుగా పేరు తెచ్చుకోవాలని ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాను’ అని అన్నారు ‘మంచి కథతో ఈ సినిమాను స్టార్ట్ చేసాం. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా దీన్ని రూపొందించాం. ప్రతి విషయంలో క్వాలిటీ ఉండేలా చూసుకున్నాం. ప్రేక్షకులను ఎంగేజ్ చేసేలా సినిమా ఉంటుంది’అని నిర్మాత రవి కస్తూరి అన్నారు. ‘కమర్షియల్ స్క్రిప్ట్ ని రా అండ్ రస్టిక్ గా చిత్రీకరించాను. పూరి జగన్నాథ్ ఫ్యాన్ గా ఈ సినిమాను డైరెక్ట్ చేశాను. ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. కచ్చితంగా మా సినిమా ప్రేక్షకులకు కొత్త ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది’ అని దర్శకుడు దయానంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ నేహా సోలంకి, నటులు ఆదిత్య మీనన్,కిరిటీ, సినిమాటోగ్రాఫర్ అరవింద్ విశ్వనాథ్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్ అరుణ్, మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ ఏఆర్ తదితరులు పాల్గొన్నారు. -
రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ నేపథ్యంలో ‘గేమ్ ఆన్’
ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్ టైమ్ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అన్న ఇత్తివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ...గేమ్ ఆన్ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఇప్పటికే విడుదల చేసిన రెండు పాటలకు, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మిగతా పాటలు, ట్రైలర్ రిలీజ్ చేసి సినిమాను ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. రథం చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకున్న గీతానంద్ ఈ చిత్రంతో హీరోగా నెక్ట్స్ లెవల్ కు వెళ్తాడన్న నమ్మకం ఉంది. అలాగే నేహ సోలంకి తన అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం విభిన్నమైన కథలతో వచ్చే చిత్రాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఆ కోవలో వస్తోన్న మా చిత్రాన్ని కూడా ఆదరిస్తారన్న నమ్మకంతో ఉన్నాం` అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో పాత్రలన్నీ గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. తన జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి ,రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్‌లోకి ఎలా ప్రవేశించాడు? గేమ్‌లోని టాస్క్‌ను ఎలా స్వీకరించాడు? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి? ఈ గేమ్ ఎవరు ఆడిస్తున్నారు? అనే అంశాలతో ‘గేమ్ ఆన్’ సినిమా తెరకెక్కింది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్స్ ఆకట్టుకుంటాయి. కచ్చితంగా మా సినిమా ప్రేక్షకులకు న్యూ ఎక్స్ పీరియన్స్ ఇస్తుందన్నారు. -
స్వల్ప లాభాలతో ట్రేడవుతోన్న గిఫ్ట్ నిఫ్టీ
-
పడిపోయిన ఆసియా స్టాక్ లు
-
మిశ్రమంగా ట్రేడ్ అవుతున్న ఆసియా మార్కెట్లు
-
కొత్తరంగంలోకి రిలయన్స్ ఐస్‌క్రీమ్
-
సమ్మర్లో గీతానంద్ ‘గేమ్ఆన్’
ఏమి సాధించలేక ఆత్మహత్య చేసుకోవనుకున్న ఓ యువకుడు.. అనుకోకుండా రియల్ టైమ్ గేమ్‌లోకి ప్రవేశిస్తాడు. ఆ ఆట అతని జీవితంలో ఎలాంటి మలుపులు తిప్పింది? అసలు ఆ గేమ్ ఎంచుకోబడడానికి కారణం ఏమిటి, ఈ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఫైనల్‌గా ఏం జరిగింది? అన్న ఇత్తివృత్తంతో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’. గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ఈ చిత్రానికి దయానంద్ దర్శకత్వం వహిస్తున్నారు. కస్తూరి క్రియేషన్స్ ప్రొడక్షన్, గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మధు బాల, ఆదిత్య మీనన్ కీలక పాత్ర నటిస్తున్నారు. ఈ సనిమాను సమ్మర్లో సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంగా నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ ‘‘రథం చిత్రం తర్వాత గీతానంద్‌ని మరోస్థాయిలో నిలబెట్టే చిత్రమిది. గీతానంద్, దయానంద్ ఇద్దరిలో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమా అవుట్‌పుట్ బాగా వచ్చింది. ప్రతి ఫ్రేమ్ మిమ్మల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళుతుంది. అలాగే ఈ సినిమాకు మేము చేసే ప్రతి ప్రమోషన్ కూడా వినూత్నమైన రీతిలో ఉంటుంది. వేసవి కానుకగా చిత్రాన్ని విడుదల చేస్తాం’అని అన్నారు. ‘ట్విస్టులు, టర్నులతో ఆద్యంతం ఆసక్తికరంగా ఈ కథ సాగుతుంది. సినిమాలో యాక్షన్, రొమాన్స్. ఎమోషన్స్... అన్ని రకాల ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’అని దర్శకుడు దయానంద్ అన్నారు. ‘ఈ చిత్రంలో పాత్రలన్ని గ్రే షేడ్‌లో ఉంటాయి. ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఉంటుంది. అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’అని హీరో గీతానంద్ చెప్పారు.