‘‘గేమ్ ఆన్’ యునిక్ స్టోరీ. రెగ్యులర్‌గా కాకుండా వైవిధ్యంగా చేయాలని ప్రయత్నించాం. ఈ చిత్రంలో హీరో లూజర్ నుంచి విన్నర్‌గా ఎలా మారాడు? అనేది ఆసక్తిగా ఉంటుంది. ఇందులో భాగంగా ఉండే టాస్కులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి’’ అని గీతానంద్ అన్నారు. దయానంద్ దర్శకత్వంలో గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘గేమ్ ఆన్’.
రవి కస్తూరి నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతున్న సందర్భంగా హీరో గీతానంద్ మాట్లాడుతూ–‘‘దయానంద్ నా తమ్ముడు కావడంతో ‘గేమ్ ఆన్’ స్క్రిప్ట్ విషయంలో బాగా చర్చించుకునే వాళ్లం. రవి కస్తూరి కూడా నా ఫ్రెండ్ కావడంతో ముగ్గురం చర్చించుకుని నిర్ణయాలు తీసుకునేవాళ్లం. ఈ మూవీకి సీక్వెల్ ప్లా న్ ఉంది’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment