‘గేమ్ ఆన్’తో ఆ విషయం అర్థమైంది..నిర్మాతగా కొనసాగుతా: రవి కస్తూరి | Producer Ravi Kasturi Interesting Comments About Game On Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Ravi Kasturi: ‘గేమ్ ఆన్’తో ఆ విషయం అర్థమైంది..నిర్మాతగా కొనసాగుతా

Published Thu, Jan 25 2024 4:09 PM | Last Updated on Thu, Jan 25 2024 4:56 PM

Producer Ravi Kasturi Talk About Game On Movie - Sakshi

గీతానంద్, నేహా సోలంకి జంట‌గా నటించిన తాజా చిత్రం ‘గేమ్‌ ఆన్‌’. క‌స్తూరి క్రియేష‌న్స్ అండ్  గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ర‌వి క‌స్తూరి నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిర్మాత రవి కస్తూరి మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు.. 

► కాలేజీలో చదువుతున్నప్పటి నుంచే సినిమాలపై ఇంట్రెస్ట్ ఉండేది. గీతానంద్ హీరోగా, నేను నిర్మాతగా సినిమా చేయాలనుకున్నాం. ఇప్పుడు మంచి కథ సెట్ అవ్వడంతో ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేశాం. ప్రీ ప్రొడక్షన్ కి టైం ఎక్కువ కేటాయించి అంతా పర్ఫెక్ట్ గా ఉండేలా ప్లాన్ చేసుకున్నాం. 

► ఈ జర్నీలో చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్. రియల్ టైం సాగే కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించాం. యాక్షన్, ఎమోషన్ తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు అనేది గేమ్ థీమ్ లో చూపించాం. సినిమా ప్రారంభం నుంచి  కాన్ఫిడెంట్ గానే ఉన్నాం. నిర్మాతగా ఈ సినిమా నుంచి సహనంగా ఉండాలని నేర్చుకున్నా.

► హీరో గీతానంద్ మా ఫ్రెండ్ కాబట్టి తనని ఎప్పటినుంచో చూస్తున్నా. తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. తన బ్రదర్ దయానంద్  కు డైరెక్టర్ గా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాను. శుభలేఖ సుధాకర్ గారి లాంటి మంచి మనిషిని నేను ఇప్పటివరకు చూడలేదు. సెట్లో చాలా సరదాగా ఉండేవారు. 

► ఆదిత్య మీనన్  గారు మంచి పర్ఫార్మర్. మధుబాల గారికి ఈ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతుందని అనిపిస్తుంది. ఆమె చాలా ఇంపార్టెంట్ రోల్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్లస్ అవుతుంది.

► ఆస్ట్రేలియాలో వ్యాపారాలు చేస్తూ సినిమా చూసుకోవడం కాస్త ఛాలెంజింగ్ గానే అనిపించింది. ఇక్కడ పెద్ద సినిమా, చిన్న సినిమా అని రెండే క్యాటగిరిలు ఉన్నాయి. మాకు మాత్రం కంటెంట్ పై పూర్తి నమ్మకం ఉంది. ఇకపై నిర్మాతగా కొనసాగాలనుకుంటున్నా. ఈ సినిమా ఎక్స్పీరియన్స్ నాకు మరో పది సినిమాలకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే రెండు కథలు విన్నాను. ఈ సినిమా రిలీజ్ అయ్యాక వాటిని అనౌన్స్ చేస్తాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement