
గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి నిర్మించిన చిత్రం ‘గేమ్ ఆన్’. ఈ చిత్రం ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా గురువారం రవి కస్తూరి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ఆస్ట్రేలియాలో నాకు వ్యాపారాలున్నాయి. నిర్మాతగా నాకు ఇది తొలి చిత్రం. గీతానంద్ హీరోగా, నేను నిర్మాతగా సినిమాలు చేయాలనుకున్నాం.
కథ సెట్ కావడంతో ‘గేమ్ ఆన్’ స్టార్ట్ చేశాం. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. జీవితాన్ని చాలించాలనుకునే ఓ వ్యక్తి దాన్ని ఎలా అధిగమించాడు? అనేది గేమ్ థీమ్‌లో చూపించాం. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే సినిమా కూడా. ఓ సినిమాకు మనం ఎంత పబ్లిసిటీ చేసినా మార్నింగ్ షోకు ఆడియన్స్ వెళ్లేంతవరకే. ఆ తర్వాత సినిమానే మాట్లాడుతుంది’’ అని చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment