శ్రీమతి ఎంజీఆర్‌ | New poster of Madhubala from Thalaivi unveiled on her birthday | Sakshi
Sakshi News home page

శ్రీమతి ఎంజీఆర్‌

Published Sat, Mar 27 2021 12:13 AM | Last Updated on Sat, Mar 27 2021 12:13 AM

New poster of Madhubala from Thalaivi unveiled on her birthday - Sakshi

అరవింద్‌ స్వామి, మధుబాల

మధుబాల మంచి నటి. ‘రోజా’, ‘జెంటిల్‌మేన్‌’ వంటి సినిమాలు చాలు.. ఆమె ఎంత మంచి నటో చెప్పడానికి. కథానాయికగా మంచి పాత్రలు చేసిన మధు ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ అలాంటి పాత్రలే చేస్తున్నారు. వచ్చే నెల 23న విడుదల కానున్న ‘తలైవి’లో ఆమె ఓ నిజజీవిత పాత్ర చేశారు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కంగనా టైటిల్‌ రోల్‌ చేశారు. ఇందులో ఎంజీఆర్‌ పాత్రను అరవింద్‌ స్వామి చేశారు. ఎంజీఆర్‌ సతీమణి జానకీ రామచంద్రన్‌ పాత్రను మధుబాల చేశారు. శుక్రవారం (మార్చి 26) మధుబాల బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్‌ విడుదలైంది. ఆస్పత్రిలో ఎంజీఆర్‌ పక్కన కూర్చుని, ఆయన్ను చూస్తున్న జానకీ రామచంద్రన్‌ లుక్‌కి మంచి స్పందన లభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement