aravinda swamy
-
'96' దర్శకుడితో కార్తీ మూవీ.. మళ్లీ అలాంటి కాన్సెప్ట్
సూర్య తమ్ముడిగా పరిచయమైనప్పటికీ తనదైన యాక్టింగ్‌తో తెలుగులోనూ అద్భుతమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు కార్తీ. వరస సినిమాలతో అలరించే ఇతడు ప్రస్తుతం రెండు మూవీస్ చేస్తున్నాడు. తాజాగా ఇతజి పుట్టిన రోజు సందర్భంగా వాటి నుంచి అప్డేట్స్ వచ్చాయి. కార్తీ-'96' మూవీ ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకు 'మెయ్యళగన్' టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో అరవింద స్వామి ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. సూర్య-జ్యోతిక నిర్మిస్తున్నారు.(ఇదీ చదవండి: ఆయన దుస్తులు లేకుండానే పక్కన వచ్చి కూర్చుంటాడు: స్టార్ హీరోయిన్)ఇక షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకొంటోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్స్‌లో కార్తీ ఎద్దుతో ముచ్చటిస్తున్నట్లు ఒకటి ఉండగా, కార్తీ-అరవిందస్వామి సైకిల్లో వెళుతున్నట్లుగా మరో పోస్టర్ కనిపించింది. ఈ రెండింటిని చూస్తుంటే ఈ పోస్టర్లను చూస్తుంటే 'మెయ్యళగన్' గ్రామీణ నేపథ్యంలో సాగే వింటేజ్ మూవీ అనిపిస్తుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
‘తలైవి’ కొత్త స్టిల్స్ విడుదల.. రచ్చ చేసేందుకు కంగనా రెడీ
సినీ నటి, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘తలైవి’. ఈ మూవీలో కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఎంజీఆర్‌గా అరవిందస్వామి నటించారు. కథను బాహుబలి ఫేమ్ విజయేంద్ర ప్రసాద్ సమకూర్చారు. విజయ్ దర్శకత్వంలో లిబ్రి మోహన్ పిక్చర్స్ కర్మ మీడి యా అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 23న విడుదల చేయాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు సినిమా పైన అంచనాలను పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి పలు స్టిల్స్ విడుదలయ్యాయి. ఇందులో కంగనా, అరవింద్ స్వామి కనిపిస్తున్నారు. జయలలిత హీరోయిన్గా ఉన్ననప్పుడు ఎలా ఉన్నారు, రాజకీయాల్లోకి వచ్చాక ఎలా మారారో అచ్చం అలాగే తాజా స్టిల్స్ ఉన్నాయి. జయలలిత పదహారేళ్ల వయసు నుండి 60 ఏళ్ల వయసు వరకూ మొత్తం నాలుగు దశలను తలైవి బయోపిక్ లో చూపించనున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. -
శ్రీమతి ఎంజీఆర్
మధుబాల మంచి నటి. ‘రోజా’, ‘జెంటిల్‌మేన్’ వంటి సినిమాలు చాలు.. ఆమె ఎంత మంచి నటో చెప్పడానికి. కథానాయికగా మంచి పాత్రలు చేసిన మధు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అలాంటి పాత్రలే చేస్తున్నారు. వచ్చే నెల 23న విడుదల కానున్న ‘తలైవి’లో ఆమె ఓ నిజజీవిత పాత్ర చేశారు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కంగనా టైటిల్ రోల్ చేశారు. ఇందులో ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ పాత్రను మధుబాల చేశారు. శుక్రవారం (మార్చి 26) మధుబాల బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్ విడుదలైంది. ఆస్పత్రిలో ఎంజీఆర్ పక్కన కూర్చుని, ఆయన్ను చూస్తున్న జానకీ రామచంద్రన్ లుక్‌కి మంచి స్పందన లభించింది. -
తలైవర్‌ని గుర్తు చేసుకుంటూ..
ప్రముఖ నటుడు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి యంజీ రామచంద్రన్ (యంజీఆర్) వర్ధంతి గురువారం. ఈ సందర్భంగా ‘తలైవి’ సినిమా నుంచి అరవింద్ స్వామి చేసిన యంజీఆర్ పాత్ర లుక్‌ను విడుదల చేశారు. జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో యంజీఆర్‌గా చేయడం గురించి అరవింద్ స్వామి మాట్లాడుతూ – ‘‘పురట్చి తలైవర్ (విప్లవ నాయకుడు) యంజీఆర్ పాత్రను చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంలా భావిస్తున్నాను. అలానే పెద్ద బాధ్యతలా భావించాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. తలైవర్‌ను గుర్తు చేసుకుంటూ ఈ ఫొటోలను షేర్ చేస్తున్నాను’’ అన్నారు. -
మ్యాజిక్ జరిగింది
కాల్పనిక పాత్రలు చేయడం సులువు అనలేం కానీ నిజజీవిత పాత్రలు చేయడంలో ఉన్న కష్టం అయితే కచ్చితంగా ఉండదు. ప్రముఖుల జీవిత కథల్లో నటించేటప్పుడు హావభావాలు, నడక, మాట... అన్నీ వారినే తలపించేలా ఉండాలి. అందుకే పురట్చి తలైవర్ (విప్లవ నాయకుడు) ఎంజీఆర్ పాత్ర ఒప్పుకున్నప్పుడు అరవింద్ స్వామి చాలా కసరత్తులు చేశారు. చివరికి ‘డెంటిస్ట్’ దగ్గరకు వెళ్లి తన పళ్లు ఎన్టీఆర్ పళ్లకి మ్యాచ్ అయ్యేలా ఉన్నాయా? అని కూడా చెక్ చేసుకున్నారంటే ఆయన ఎంత పర్ఫెక్షనిస్టో ఊహించవచ్చు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కించిన ‘తలైవి’లో దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ పాత్రను చేశారు అరవింద్ స్వామి. ఈ పాత్ర చిత్రీకరణ మంగళవారంతో పూర్తయింది. ‘‘చివరిసారిగా నన్ను పురట్చి తలైవర్ అందానికి దగ్గరగా తన పనితనంతో మ్యాజిక్ చేస్తున్న రషీద్‌కి ధన్యవాదాలు’’ అంటూ మేకప్ చేయించుకుంటున్న ఫొటోను షేర్ చేశారు అరవింద్ స్వామి. జనవరి 17న ఎంజీఆర్ జయంతి సందర్భంగా ఈ ఏడాది విడుదల చేసిన అరవింద్ స్వామి లుక్‌కి మంచి స్పందన లభించింది. అరవింద్ స్వామి అన్నట్లు మేకప్ ఆర్టిస్ట్ పట్టణమ్ రషీద్ మ్యాజిక్ చేశారు. ‘తలైవి’గా కంగనా రనౌత్ నటించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. -
మహేశ్‌తో ఢీ?
‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకునిగా నటించేది ఎవరనే విషయంపై చిత్రబృందం ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. విలన్ పాత్రకు ముందు ఉపేంద్ర, ఆ తర్వాత సుదీప్ పేర్లు వినిపించగా తాజాగా అరవింద్ స్వామి పేరు వినిపిస్తోంది. రామ్‌చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ధృవ’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా మెప్పించారు అరవింద్ స్వామి. ఇప్పుడు ‘సర్కారువారి పాట’ చిత్రంలోనూ మహేశ్‌కి ప్రతినాయకునిగా ఆయనే నటించనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్ సర్కిల్లో వినిపిస్తున్నాయి. -
వెండితెర ఎంజీఆర్
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెర కెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. (హిందీలో ‘జయ’). ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివంగత నేత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్, దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. ఇవాళ ఎం.జి రామచంద్రన్ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని అరవింద స్వామి లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన కంగనా రనౌత్ ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి స్పందన లభిస్తోంది. ఎంజీఆర్ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటిస్తున్నారు అరవిందస్వామి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘తలైవి’ చిత్రం ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. -
తెలుగు రాష్ట్రంలో తలైవి
ప్రముఖనటి, తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘తలైవి’ (హిందీలో ‘జయ’ అనే టైటిల్ అనుకుంటున్నారు). ఇందులో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీ¯Œ కంగనా రనౌత్ నటిస్తున్నారు. ప్రకాష్‌రాజ్, అరవిందస్వామి కీలకపాత్రలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల మైసూర్లో ముగిసిన సంగతి తెలిసిందే. తాజా షెడ్యూల్ భాగ్యనగరంలో(హైదరాబాద్) ప్రారంభం కానుంది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టూడియోలో సెట్లు రెడీ చేశారు. ఇక్కడి షెడ్యూల్ దాదాపు 25 రోజులు సాగుతుందని సమాచారం. విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్.సింగ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 26న విడుదల చేయాలనుకుంటున్నారు. -
సాక్ష్యాన్వేషణలో...
నేరస్తులను పట్టుకోవడానికి క్లూస్ వెతుకుతున్నాడు అరవింద్‌స్వామి. సత్యాన్వేషణ కోసం సాక్ష్యాన్వేషణ చేసి, దోషులకు శిక్ష పడేలా చేయగల చాలా తెలివైన సిబీసీఐడీ ఆఫీసర్ అతను. ‘హరహరమహాదేవకి, ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు, గజనీకాంత్’ వంటి సినిమాలను తెరకెక్కించిన సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వంలో అరవింద్‌స్వామి హీరోగా ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఇందులోనే సీబీసీఐడీ ఆఫీసర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. నా గత చిత్రాలకన్నా ఇది భిన్నమైన చిత్రం. హీరో పాత్ర కూడా కొత్తగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. -
యంజీఆర్ – యంఆర్ రాధల కథేంటి?
తమిళ సినీ చరిత్రలో యంజీఆర్‌ను యంఆర్ రాధా తుపాకితో కాల్చడం పెద్ద సంచలనంతో పాటు మిస్టరీ. ఈ సంఘటన తమిళ ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోనిది, ఎప్పుడూ చర్చ జరిగే టాపిక్. ఈ కాల్పుల్లో యంజీఆర్ తన గొంతును కోల్పోవడం, ఆ తర్వాత మాటల్లో స్పష్టత లోపించడం తమిళ ప్రేక్షకులకు తెలుసు. ఎంజీఆర్‌ను కాల్చిన సంఘటనలో రాధా అరెస్ట్ కావడం తెలిసిందే. ఇప్పుడు ఆ సంఘటన వెనక ఏం జరిగిందో తెలిసే అవకాశం ఉంటుందని తమిళ ప్రే„ý కులు భావిస్తున్నారు. దానికి కారణం.. యంఆర్ రాధా మీద ఓ బయోపిక్ రూపొందనుండటమే. నటి, యంఆర్ రాధ కుమార్తె రాధిక తన సొంత బ్యానర్ రధన్ మీడియా వర్క్స్‌పై ఈ బయోపిక్‌ను నిర్మించనున్నారు. రాధా మనవడు ఐకీ ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో రాధ పాత్రలో శింబు, యంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేసినట్టు సమాచారం. గత ఏడాదే మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ (తెలుగులో నవాబ్) సినిమాలో అరవింద స్వామి, శింబు అన్నదమ్ములుగా యాక్ట్ చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. మళ్లీ మరోసారి కలసి నటించబోతున్నారన్న మాట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
‘నరకాసురుడు’ మూవీ స్టిల్స్
-
వేసవికి నరకాసురుడు
అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నరకాసురుడు’. తమిళంలో తెరకెక్కిన ‘నరగాసురన్’ సినిమాకు ఇది తెలుగు వెర్షన్. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన చిత్రమిది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటిస్తాం. ఈ వేసవిలోనే తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది’’ అన్నారు. ఆత్మిక, ఇంద్రజిత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మణికందన్, సంగీతం: రాన్ ఏతాన్ యోహాన్, కెమెరా: సుజిత్ సారంగ్. -
ఫుల్ యాక్షన్
ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు నటుడు అరవింద్ స్వామి. ఎందుకంటే తన తర్వాతి చిత్రం కోసం. అవును... ఆయన నెక్ట్స్ చిత్రం ఖరారు అయ్యింది. నిర్మల్ కుమార్ దర్శకత్వంలో అరవింద్ స్వామి హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ‘‘ఫుల్ యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఫస్ట్ హాఫ్‌లో ఒక లుక్‌తో కనిపించిన అరవింద్ స్వామి సెకండాఫ్‌లో మరో లుక్‌తో సర్ప్రైజ్ చేస్తారు. ఈ లుక్స్‌కు సంబంధించి ఆయన ఆల్రెడీ ట్రైనింగ్ కూడా స్టార్ట్ చేశారు. మార్చిలో అరవింద్ స్వామి లుక్, టైటిల్‌ను అనౌన్స్ చేస్తాం. మార్చి 20న ఈ సినిమా షూటింగ్ చెన్నైలో స్టార్ట్ అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకన్నా ముందు నిర్మల్‌కుమార్ దర్శకత్వంలో అరవింద్ స్వామి ‘చతురంగ వేటై్ట 2’ అనే సినిమా చేశారు. ఇక ఆయన కీలక పాత్ర చేసిన ‘నరగాసురన్’ (తెలుగులో ‘నరకాసురుడు’) చిత్రం కూడా రిలీజ్‌కు దగ్గరపడుతోంది. ఇలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా అరవింద్ స్వామి ఫుల్ బిజీగా ఉన్నారు. -
అవగాహన లేకుండా మాట్లాడను
ఈ ఏడాది ‘మీటూ’ ఉద్యమం ఇండియన్ ఇండస్ట్రీలను ఊపేసింది. మమ్మల్ని వేధించారంటూ చాలామంది నటీమణులు కొందరి స్టార్స్‌పై ఆరోపణలు చేశారు. ఈ ఉద్యమాన్ని చాలా మంది సపోర్ట్ చేయగా కొందరు వ్యతిరేకించారు కూడా. ‘మీటూ’ ఉద్యమాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అని నటుడు అరవింద స్వామిని అడగ్గా – ‘మీటూ’ ఉద్యమాన్ని స్వాగతిస్తాను. కానీ సపోర్ట్ చేస్తానా? లేదా విమర్శిస్తానా అనే స్టాండ్ తీసుకోలేను’’ అని పేర్కొన్నారాయన. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఎవరైనా ఎవరి మీదైనా ఆరోపణలు చేశారంటే ఆ మాటలు విని ఆరోపించినవారిని సపోర్ట్ చేసి, నిందకు గురైనవారిని విమర్శించను. ఎందుకంటే ఆ ఆరోపణల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటాను. ఆ విషయం మీద ఎంతో కొంత అవగాహన ఉంటే తప్ప నేను మాట్లాడలేను. ఆధారాలు లేనప్పుడు ఎటు వైపు మాట్లాడినా అది తప్పు. అలా కామెంట్ చేస్తే ఆ అభిప్రాయం ఆ ఒక్కరిదే అవుతుంది. అలాగే ఒక గుంపుగా చేరి ఆరోపించేవాళ్లను సమర్థించను కూడా’’ అని పేర్కొన్నారు అరవింద స్వామి. -
అతిథులుగా...
బిగ్ బీ అమితాబ్ బచ్చన్, తాప్సీ ముఖ్య పాత్రల్లో అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘పింక్’. 2016లో విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌లో వసూళ్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో అమితాబ్ పాత్రలో అజిత్ నటించనున్నారు. ‘చదురంగవేట్టై’ ఫేమ్ వినోద్ ఈ రీమేక్‌కి దర్శకత్వం వహించనున్నారు. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించనుండటం విశేషం. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, నటి విద్యాబాలన్‌లను అతిథి పాత్రల్లో నటింపజేసేందుకు బోనీకపూర్ చర్చలు జరుపుతున్నారట. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అజిత్ తాజా చిత్రం ‘విశ్వాసం’ సంక్రాంతికి విడుదల కానుంది. ఆ తర్వాత ‘పింక్’ సినిమా రీమేక్‌కి కొబ్బరికాయ కొట్టనున్నారు. అమితాబ్, విద్యా ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? కూసింత ఓపిక పడితే తెలుస్తుంది. అమ్మ విద్యాబాలన్: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తమిళంలో 3 సినిమాలు తెరకెక్కనున్నాయి. తమిళ ప్రజలు ‘అమ్మ’ అంటూ ఆప్యాయంగా పిలుచుకునే జయలలితను ఎవరు ఎలా చూపించబోతున్నారనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది. దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ పేరుతో ఇప్పటికే షూటింగ్ మొదలెట్టేశారు. ఇందులో జయలలిత పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. సీనియర్ దర్శకులు భారతీ రాజా కూడా ఈ విప్లవ నాయకురాలు పై ఓ బయోపిక్ తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వీరితో పాటు మరో దర్శకుడు ఏఎల్ విజయ్ కూడా జయలలిత బయోపిక్‌ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాలో అమ్మ పాత్రలో బాలీవుడ్ విలక్షణ నటి విద్యాబాలన్ నటించనున్నార ట. ఈ సినిమా కోసం ఆమె బరువు పెరగనున్నారని భోగట్టా. ఇక జయలలిత రాజకీయ జీవితంలో ముఖ్యులైన ఎంజీఆర్ పాత్రలో అరవింద స్వామిని ఎంపిక చేశారని సమాచారం. లైకా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమా జయలలిత జయంతి రోజున (ఫిబ్రవరి 24) ప్రారంభం కానుందట. -
కాంబినేషన్ రిపీట్
వినూత్న సినిమాలకు, కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు అరవింద స్వామి. తాజాగా విడుదలైన మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ చిత్రం సక్సెస్ కావడంతో పాటు అరవింద స్వామి పోషించిన పాత్రకు మంచి అభినందలు వచ్చాయి. మరి.. నెక్ట్స్ అరవింద స్వామి ఏ సినిమా చేయబోతున్నారంటే.. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చేయనున్నారని కోలీవుడ్ టాక్. ఆల్రెడీ ఆయన ఈ దర్శకుడితో ‘నరగాసురన్’ అనే చిత్రం చేశారు. ఈ సినిమా రిలీజ్ పలు వాయిదాలు పడుతూ వస్తోంది. ‘నరగాసురన్’ చిత్రం చేస్తున్నప్పుడే ఈ దర్శకుడు టాలెంట్ చూసి మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట అరవింద స్వామి. ఈ చిత్రాన్ని ‘2.0’ నిర్మించిన లైకా సంస్థ నిర్మించనుంది. ‘నరగాసురన్’ ఎప్పుడు తెరకు వస్తుంది? అనే ప్రశ్నకు యూనిట్ తెరదించాల్సిందే. -
అప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోయా!
‘‘నటుడిగా ఫస్ట్ సినిమా ‘దళపతి’ కూడా మల్టీస్టారరే చేశాను. మల్టీస్టారర్స్ చేయడం పెద్ద కష్టం కాదు. అన్ని క్యారెక్టర్స్ బాగా కుదిరితే అందరికీ మంచి గుర్తింపు లభిస్తుంది. స్క్రిప్ట్ స్టార్స్‌ని డిమాండ్ చేస్తే తప్పకుండా కలసి నటించాలి. అలాగే కమర్షియల్ యాంగిల్లో కూడా ఆలోచించాలి. దర్శకుడు హ్యాండిల్ చేస్తాడనే నమ్మకం ఒకటి చాలు. మల్టీస్టారర్స్ వస్తూనే ఉంటాయి’’ అని అరవింద స్వామి అన్నారు. మణిరత్నం దర్శకత్వంలో అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి, జ్యోతిక, అదితీరావ్ హైదరీ, ఐశ్వర్యా రాజేశ్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘చెక్క చివంద వానమ్’. మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ నిర్మించాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నవాబ్’ పేరుతో అశోక్ వల్లభనేని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అరవింద స్వామి చెప్పిన విశేషాలు... ►నా పాత్రకు మంచి ఆదరణ లభిస్తోంది. సంతోషంగా ఉంది. రోజా, బొంబాయి నుంచి ప్రేక్షకులు ప్రేమను పంచుతున్నారు. ధన్యవాదాలు. మణిరత్నంగారితో తొమ్మిదోసారి కలసి వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆయన్ను నేనో గురువులా భావిస్తాను. కాళ్లకు మొక్కి నమస్కరించకపోయినా ఆయన మీద మాత్రం నాకు అపారమైన గౌరవం ఉంది. ఇప్పటికీ సినిమా ‘చెయ్’ అని అడగరు. ఐడియా ఉంది. సినిమా చేద్దామా? అని అడుగుతారు. అదే ఆయనలోని స్పెషాలిటీ. ►‘తని ఒరువన్’ (తెలుగులో ‘ధృవ’)లో విలన్‌గా నటించినప్పటి నుంచే నా పాత్ర పట్ల క్రియేటీవ్‌గా ఇన్వాల్వ్ అవ్వాలని అనుకున్నాను. అలా చేస్తే పాత్రలో పూర్తిగా నిమగ్నమవ్వొచ్చన్నది నా అభిప్రాయం. ∙నేను నటుణ్ని అవ్వాలనుకోలేదు. ‘బొంబాయి, రోజా’ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆ స్టార్డమ్ చాలా కష్టంగా అనిపించింది. స్టార్డమ్ వచ్చినప్పుడు కూడా స్టార్లా ఫీల్ అవ్వలేదు. మధ్యలో బ్రేక్ వచ్చింది. మళ్ళీ మణిసారే పిలిచి ‘కడలి’ సినిమా చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు నెగటీవ్ పాత్రలు చేస్తున్నప్పుడే స్వేచ్ఛగా అనిపిస్తోంది. ఇంకా ఆసక్తిగా అనిపిస్తోంది. ఏ తప్పూ చేయకుండా హీరో అన్నీ మంచి పనులే చేస్తుంటాడు. కానీ రియల్ లైఫ్‌లో మనుషులు అలా ఉండరే. అందుకేనేమో? (నవ్వుతూ). ∙‘గాడ్ ఫాదర్’ సినిమాలో హీరోకి నెగటీవ్ షేడ్ ఉంటుంది. కానీ కథ అంతా హీరో చుట్టే తిరుగుతుంది. అయినా విలన్ అని అనం. నేను చేసే పాత్రలు కూడా అలానే ఉండాలని భావిస్తాను. ►ఏదైనా స్క్రిప్ట్‌కి ‘యస్’ చెప్పే ముందు మొత్తం స్క్రిప్ట్‌ని క్షుణ్ణంగా చదవాల్సిందే. అప్పుడే యస్ ఆర్ నో చెబుతాను. ఒక్కసారి ‘యస్’ చెప్పాక ఆ పాత్ర గురించి దర్శకుడితో డిస్కస్ చేసుకుంటాను. అలాగే ‘నవాబ్’లో నేను చేసిన వరదన్ పాత్ర గురించి చర్చిస్తుండగా ఫిజిక్ గురించి టాపిక్ వచ్చింది. ‘వరదన్’ పాత్ర బుల్లా ఉంటుంది. అతని శరీరాకృతి అయినా, ప్రవర్తించే విధానమైనా బుల్లానే ఉంటుంది. అలా అనుకుని అందుకు అనుగుణంగా నన్ను మార్చుకున్నాను. ఫస్ట్ సినిమా నుంచి మణిసార్‌తో ఏకీభవిస్తూ, గొడవపడుతూ వర్క్ చేస్తున్నాను. యాక్టర్స్‌కి ఆయన ఎప్పుడూ క్రియేటీవ్ ఫ్రీడమ్ ఇస్తుంటారు. ►ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాల్లో మెల్లిగా మార్పు కనిపిస్తోంది. కొత్త కాన్సెప్ట్స్‌ని ప్రేక్షకులు చూస్తున్నారు. నా వరకు నేను ఫార్ములా సినిమాలు సరిగ్గా తీయకపోతే కూర్చుని చూడలేను. అలాంటిది అలాంటి సినిమాల్లో యాక్టింగ్ అంటే చాలా కష్టం. ‘నవాబ్’ సినిమాను తమిళంలో ‘పొన్నియిన్ సెల్వన్’ నవలతో, కరుణానిధి ఫ్యామిలీకు దగ్గరగా ఉంది అని ట్వీటర్లో పోలుస్తున్నారు. కానీ ఇది ఒరిజినల్ స్క్రిప్ట్. అన్నీ కల్పిత పాత్రలే. ► కమర్షియల్ సక్సెస్ మాత్రమే మణిరత్నంగారి టాలెంట్‌కి కొలమానం కాదు. కమర్షియల్ సక్సెస్ తీయాలనుకోవడం చాలా చిన్న పని ఆయనకు. కానీ తనను తాను చాలెంజ్ చేసుకునే దర్శకుడు. ఇప్పటికీ కంఫర్ట్ జోన్లో ఉండకుండా పని చేస్తున్నారు. అది గ్రేట్. మనం అభినందించాల్సిన విషయం. గమనిస్తే ఆయన తీసిన ఏ రెండు సినిమాలూ ఒకలా ఉండవు. ► తెలుగుతో ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాను. నాకు కొత్త భాష నేర్చుకోవడం రాదు. మా పిల్లలు కొత్త భాషను టక్కున నేర్చుకుంటారు. నేను మాత్రం నేర్చుకోలేకపోతున్నాను (నవ్వుతూ). ► ‘డియర్ డాడ్’ సినిమాలో స్వలింగ సంపర్కం గురించి మాట్లాడాం. ఆ సినిమా చేయడానికి చాలా సంకోచించాను. ఆడియన్స్ ఒప్పుకుంటారా? ‘ఇంత అందగాడు హోమో సెక్కువల్గానా? అమ్మాయికి ఐ లవ్ యు చెప్పాల్సింది పోయి అబ్బాయికా?’ అని ప్రేక్షకులు ఆ సినిమాని తిప్పికొడతారా? అని అనుకోలేదు. అసలు ఆ పాత్రకు సూట్ అవ్వగలనా? అని మాత్రమే ఆలోచించాను. అందుకే మణిరత్నంగారికి కాల్ చేశాను. ఆయన సలహా మేరకు ఆ సినిమా చేశాను. ► మధ్యలో కాళ్లకు జరిగిన గాయం వల్ల కాళ్లు చచ్చుబడిపోయిన సంగతి తెలిసిందే. అప్పుడు నా కాన్ఫిడెన్స్ చాలా తగ్గిపోయింది. ఇక్కడ మందులు వాడాం. మార్పు కనిపించకపోవడంతో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాం. ఆయుర్వేదం ట్రై చేశాం. పని చేసింది. అలా మళ్లీ మాములుగా అయ్యాను. ఆ సమయంలోనే మణిరత్నంగారు ‘కడలి’ సినిమా చేయమన్నారు. ఆ సినిమా నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ► ఇంతకు ముందు న్యూస్ చూస్తుంటే న్యూస్ తెలుసుకుంటున్న భావన కలిగేది. కానీ ఇప్పుడు వాదనలు చూస్తున్నాం. న్యూస్ వినడం లేదు. ఎవరో అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్టు ఉంది. ఆల్రెడీ న్యూస్ అంటేనే ఏదో డ్రామా విషయాన్ని చెబుతున్నాం. దానికి ఇంకా డ్రామా జోడిస్తున్నారు. దాంతో న్యూస్ చూడటం మానేశాను. చదువుతున్నాను అంతే. ► నా బిజినెస్ బాగానే సాగుతోంది. సుమారు 4000వేల మంది వరకూ మా కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ► ఈ సంవత్సరమే డైరెక్టర్‌గా సినిమా స్టార్ట్ చేద్దామనుకున్నాను. కుదర్లేదు. వచ్చే ఏడాది మెగాఫోన్ పట్టుకుంటాను. చాలా స్క్రిప్ట్స్ రాసుకున్నాను. అందులో ప్రస్తుత టైమ్‌కి సూట్ అయ్యే కథతో సినిమా చేస్తా. తమిళంలో కార్తీక్ నరేన్ అనే టాలెండ్ దర్శకుడితో చేసిన ‘నరగాసురన్’ రిలీజ్ కోసం ఎదురుచూసున్నా. అలాగే తెలుగు, తమిళంలో ఓ ద్విభాషా చిత్రం గురించి డిస్కషన్ జరుగుతోంది. -
పారితోషికం కోసం
సినిమా: తాను నటించిన చిత్రానికి పారితోషికం కోసం నటుడు అరవిందస్వామి మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. చతురంగవేట్టై చిత్రాన్ని నిర్మించిన నటుడు మనోబాలా ఆ చిత్రం విజయం సాధించడంతో తాజాగా చతురంగవేట్టై–2 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో అరవిందస్వామి కథానాయకుడు గానూ, నటి త్రిష కథానాయకిగా నటించారు. నిర్మాణ కార్యక్రామలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని విడుదలకు నిర్మాత మనోబాల సన్నాహాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ చిత్ర కథానాయకుడు అరవిందస్వామి ఈ చిత్రంలో నటించినందుకు పారితోషికాన్ని నిర్మాత మనోబాలా పూర్తిగా చెల్లించకపోవడంతో ఆయన మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. అందులో తాను చతురంగవేట్టై చిత్రంలో నటించినందుకు ఆ చిత్ర నిర్మాత మనోబాలా, తనకు రూ.1.79 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నారని తెలిపారు. కాబట్టి తనకు రావలసిన రూ.1.79 కోట్లు వడ్డీ సహా చెల్లించేవరకు చతురంగవేట్టై చిత్ర విడుదలపై నిషేధం విధించాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసు బుధవారం న్యాయమూర్తి సందర్ సమక్షంలో విచారణకు వచ్చింది. నటుడు అరవిందస్వామి తరఫున హాజరైన న్యాయవాది వాదనలు విన్న న్యాయమూర్తి చిత్ర నిర్మాత మనోబాలకు నోటీసులు జారీచేయవలసిందిగా ఆదేశిస్తూ ఈ నెల 20వ తేదీలోగా ఆయన బదులు పిటిషన్ దాఖలు చేయాలని పేర్కొన్కారు. -
త్వరలో భాస్కర్ ఒరు రాస్కెల్ టీజర్
తమిళసినిమా: భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్ర టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో టీజర్ ప్రభావం ఆయా చిత్రాలపైనా చాలానే ఉంటోంది. టీజర్‌కు లభించే ఆదరణను బట్టి చిత్రాల విజయాలు ఉండేలా పరిస్థితి నెలకొంది. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్ర దర్శకుడు సిద్ధిక్‌నే ఇప్పుడు భాస్కర్ ఒరు రాస్కెల్ పేరుతో తమిళంలో తెరకెక్కిస్తున్నారు. మమ్ముట్టి పాత్రలో అరవిందస్వామి, నయనతార పాత్రలో నటి అమలాపాల్ నటిస్తున్న ఇందులో నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్, మాస్టర్ రాఘవ్, బేబీ నైనిక( నటి మీనాకూతురు) ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. కీలక పాత్రలో హిందీ నటుడు అఫ్దాబ్శివదశాని నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి. -
ఉత్సవాల్లో బాణసంచాపై నటుడు ఫిర్యాదు
పెరంబూరు(తమిళనాడు): ఆలయ ఉత్సవాల్లో బాణసంచా కాల్చడంపై నటుడు అరవిందస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు నటుడు అరవిందస్వామి స్థానిక తిరువాన్మియూర్‌లో నివశిస్తున్నారు. ఆయన ఇంటి సమీపంలోని ఆలయంలో రెండు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామి ఊరేగింపులో ఆ ప్రాంత ప్రజలు భారీగా పాల్గొని బాణసంచా పేల్చడంతో తన కుటుంబసభ్యులు అసౌకర్యానికి గురవుతున్నారని నటుడు అరవిందస్వామి బుధవారం రాత్రి ఆన్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఊరేగింపులో బాణసంచా పేల్చరాదని సూచించారు. అయితే ఈ విషయంలో ప్రజలు, పోలీసుల మధ్య వాగ్వదం జరిగింది. మొత్తం మీద పోలీసులు సమస్యను పరిష్కరించడంతో బాణసంచా పేల్చకుండా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు.