అవగాహన లేకుండా మాట్లాడను | aravinda swamy comments on metoo movement | Sakshi
Sakshi News home page

అవగాహన లేకుండా మాట్లాడను

Published Sun, Dec 23 2018 3:31 AM | Last Updated on Sun, Dec 23 2018 3:31 AM

aravinda swamy comments on metoo movement - Sakshi

అరవింద స్వామి

ఈ ఏడాది ‘మీటూ’ ఉద్యమం ఇండియన్‌ ఇండస్ట్రీలను ఊపేసింది. మమ్మల్ని వేధించారంటూ చాలామంది నటీమణులు కొందరి స్టార్స్‌పై ఆరోపణలు చేశారు. ఈ ఉద్యమాన్ని చాలా మంది సపోర్ట్‌ చేయగా కొందరు వ్యతిరేకించారు కూడా. ‘మీటూ’ ఉద్యమాన్ని మీరు సపోర్ట్‌ చేస్తారా? అని నటుడు అరవింద స్వామిని అడగ్గా – ‘మీటూ’ ఉద్యమాన్ని స్వాగతిస్తాను. కానీ సపోర్ట్‌ చేస్తానా? లేదా విమర్శిస్తానా అనే స్టాండ్‌ తీసుకోలేను’’ అని పేర్కొన్నారాయన. 

ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఎవరైనా ఎవరి మీదైనా ఆరోపణలు చేశారంటే ఆ మాటలు విని ఆరోపించినవారిని సపోర్ట్‌ చేసి, నిందకు గురైనవారిని విమర్శించను. ఎందుకంటే ఆ ఆరోపణల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటాను. ఆ విషయం మీద ఎంతో కొంత అవగాహన ఉంటే తప్ప నేను మాట్లాడలేను. ఆధారాలు లేనప్పుడు ఎటు వైపు మాట్లాడినా అది తప్పు. అలా కామెంట్‌ చేస్తే ఆ అభిప్రాయం ఆ ఒక్కరిదే అవుతుంది. అలాగే ఒక గుంపుగా చేరి ఆరోపించేవాళ్లను సమర్థించను కూడా’’ అని పేర్కొన్నారు అరవింద స్వామి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement