Indian film industry
-
గేమ్ ఛేంజర్ బ్యూటీ.. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లు (ఫోటోలు)
-
Fauzia Arshi: ఆకాశమే హద్దు
డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా బాలీవుడ్లో గుర్తింపు పొందిన ఫౌజియా ఆర్షి మేనేజ్మెంట్ అండ్ మార్కెటింగ్ పుస్తకాల రచయిత్రి, గిటారిస్ట్, సింగర్, మ్యూజిక్ కంపోజర్, డైలాగ్ రైటర్. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి ఎంటర్ ప్రెన్యూర్‌గా కూడా విజయపథంలో దూసుకుపోతోంది. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తాజాగా మరో సవాలును స్వీకరించనుంది.ఖాళీగా కూర్చోకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఫౌజియా ఆర్షి పెట్టింది పేరు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌కు చెందిన ఫౌజియాకు టైమ్ అంటే కొత్త విషయం తెలుసుకోవడం. కొత్త కళలో అక్షరాలు దిద్దడం. కాలాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకున్న ఆమె కృషి వృథా పోలేదు. ‘బహుముఖ ప్రజ్ఞాశాలి’ అని ప్రపంచం గుర్తించేలా చేసింది.‘హోగయా దిమాగ్ క దహీ’ బాలీవుడ్ సినిమాతో నవ్వులు పూయించింది. ఈ రోరింగ్ కామెడీ ఫిల్మ్‌లో ఓంపురి, రాజ్‌పాల్ యాదవ్‌లాంటి నటులు నటించారు. ఫస్ట్–జెనరేషన్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా టీనేజ్లోనే తన వ్యాపారదక్షతను చాటుకుంది ఫౌజియా.‘ఇంటర్నేషనల్ మార్కెటింగ్ మేనేజ్మెంట్’ పేరుతో ఆమె రాసిన పుస్తకానికి మంచి పేరు వచ్చింది. మేనేజ్మెంట్ డిపొ్లమా కోర్సుల విద్యార్థులకు బాగా ఉపకరించే ఈ పుస్తకం ప్రపంచ మార్కెటింగ్‌కు సంబంధించిన ఆర్థిక, రాజకీయ, భౌగోళిక వాతావరణాన్ని కళ్లకు కడుతుంది. ‘ది సన్ రైజెస్ ఫ్రమ్ ది వెస్ట్’ అనేది దీనికి పూర్తిగా భిన్నమైన పుస్తకం. ‘ఏది వాస్తవం?’ అంటూ వాస్తవాన్ని గురించి లోతుగా విశ్లేషించే పుస్తకం. తాత్విక ఛాయలు కనిపించే ఈ పుస్తకం రకరకాల చుక్కలను కనెక్ట్ చేసి ఒక రూపాన్ని మన ముందు ఆవిష్కరిస్తుంది.ఎంత అలవోకగా పుస్తకం రాయగలదో అంతే అలవోకగా రాగం తీయగలదు. అప్పటికప్పుడు పదాలు అల్లుతూ పాట పుట్టించగలదు. కాన్వాస్‌పై కనువిందు చేసే చిత్రాన్ని సృష్టించగలదు. ఇక గిటారిస్ట్‌గా ఆమె నైపుణ్యం సరేసరి. మేనేజ్మెంట్ప్రొఫెషనల్గా ఎంత జటిలమైన విషయాలనైనా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధించగలదు.ఫౌజియాకు చెందిన డైలీ మల్టీమీడియా లిమిటెడ్ (డిఎంఎల్)... సినిమాలు, టెలివిజన్ కంటెంట్, యాడ్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిల్మ్స్, ఈవెంట్ ఆర్గనైజింగ్, పొలిటికల్ క్యాంపెయిన్‌కు సంబంధించిన కంపెనీ.సామాజిక సేవారంగంలో చేస్తున్న కృషిని దృష్టిలో పెట్టుకొని ఫౌజియాను బ్రిటన్ పార్లమెంట్ సత్కరించింది. ఫౌజియాకు ఇంగ్లీష్ భాషలో ఇష్టమైన మాట ‘న్యూ ఛాలెంజ్’. ఎప్పటికప్పుడు కొత్త ఛాలెంజ్‌లను అధిగమిస్తూ తన సత్తా చాటుతోంది.తాజా విషయానికి వస్తే...ముంబైకి చెంది ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్ ్రపాంతీయ విమానయాన సంస్థ ‘ఫైబిగ్’ను కొనుగోలు చేసే ప్రక్రియ జరుగుతోంది. లావాదేవీలు పూర్తయిన తరువాత ‘ఫ్లైబిగ్’ను మరిన్ని విమానాలతో విస్తరించనున్నారు. ఎఫ్ఏ ఎయిర్‌లైన్స్‌కు ఫౌజియా ఆర్షి మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉంది. ‘ఫ్లైబిగ్’ రూపంలో మరో సవాలు ఆర్షి ముందుకు రానుంది. ఈ సవాలును కూడా ఫౌజియా విజయవంతంగా అధిగమించగలరన్నది ఆమె గురించి తెలిసిన వారు కాస్త గట్టిగానే చెప్పేమాట. -
Pankaj Udhas: గజల్ గంధర్వుడు
‘ముజ్ కో యారో మాఫ్ కర్నా, మై నషేమే హూ’ ‘థోడి థోడి పియా కరో’ ‘షరాబ్ చీజ్ హి ఐసీ’ ‘సబ్కో మాలూమ్ హై మై షరాబీ నహీ’ ‘చాందీ జైసా రంగ్ హై తేరా’ ‘కభీ సాయా హై కభీ ధూప్’ ‘దివారోంసే మిల్ కర్ రోనా అచ్ఛా లగ్తా హై’ ‘ఆయియే బారిషోం కా మౌసం హై’... ఒక్కటా రెండా పంకజ్ ఉధాస్ పేరు వినడగానే ఈ పేరుతో పాటు వినిపించే అమృత గుళికల్లాంటి గజల్స్, పాటలు ఎన్నో ఎన్నెన్నో. గజల్స్‌ను ఎప్పుడూ వినే వాళ్లతో పాటు, ఎప్పుడూ వినని వాళ్లను కూడా తన అభిమానులుగా చేసుకున్నాడు గజల్ మేస్ట్రో పంకజ్ ఉధాస్. ఎప్పుడూ వినని వాళ్లు ఆయన గొంతు నుంచి ఒక్కసారి గజల్ వింటే మంత్రముగ్ధులయ్యే వారు. మళ్లీ మళ్లీ వినాలని తపించేవారు. ‘ఆహత్’ ఆల్బమ్‌తో ఆనందాశ్చర్యాలకు గురి చేసిన పంకజ్ గజల్ ప్రపంచంలో అజరామరమైన కీర్తిని సొంతం చేసుకున్నారు. సోమవారం ఆయన భౌతికంగా దూరమైనా ప్రతి శ్రోతలో, అభిమానిలో సజీవంగా నిలిచే ఉంటాడు. గుజరాత్‌లోని జెట్‌పూర్‌లో పుట్టిన పంకజ్ ముగ్గురు అన్నదమ్ములలో చిన్నవాడు. అన్న నిర్మల్ ఉధాస్తో ఆ ఇంట్లో గజల్ గజ్జె కట్టింది. మరో అన్న మన్హర్ ఉధాస్ బాలీవుడ్లో కొన్ని సినిమాలకు పాడాడు. తండ్రి కేశుభాయిదాస్ ప్రభుత్వ ఉద్యోగి. వైణికుడు. ప్రసిద్ధ వైణికుడు అబ్దుల్ కరీమ్ ఖాన్ దగ్గర దిల్రుబా నేర్చుకున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ ఇల్లు ఒక సంగీత పాఠశాలలాగ ఉండేది. వన్స్ అపాన్ ఎ టైమ్ బ్లాక్ అండ్ వైట్ చిత్రాల పాటల నుంచి గజల్స్ వరకు ఆ ఇంట్లో ఎన్నో వినిపించేవి. రాగాలు, స్వరఝరుల గురించి చర్చ జరిగేది. తనకు ఏమాత్రం సమయం దొరికినా పంకజ్ తండ్రి దిల్రుబా వాయించేవాడు. దిల్రుబా నుంచి వచ్చే సుమధుర శబ్దతరంగాలు పంకజ్‌ను సంగీతం వైపు నడిపించాయి. ‘చక్కగా స్కూలు పాఠాలు చదువుకోకుండా ఈ సంగీత పాఠాలు నీకు ఎందుకు నాయనా’ అని తండ్రి మందలించి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదీ తెలియదుగానీ గజల్స్ గురించి, దిల్రుబాపై వినిపించే రాగాల గురించి సందేహాలు అడిగినప్పుడు కుమారుడి సంగీతోత్సాహానికి ఆ తండ్రి మురిసిపోయేవాడు. ఒక్క సందేహం అడిగితే మూడు సమాధానాలు చెప్పేవాడు. అంతేకాదు ముగ్గురు కుమారులను రాజ్‌కోట్(గుజరాత్)లోని‘సంగీత్ అకాడమీ’ లో చేర్పించాడు. ఆ కళాశాలలో తబాలా వాయించడం నేర్చుకున్న పంకజ్ గులామ్ ఖదీర్ ఖాన్ సాహెబ్ దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాడు. డిగ్రీ కోసం ముంబైలోని సెయింట్ జేవియర్ కాలేజీలో చేరిన పంకజ్ ‘క్లాస్‌లో సైన్స్ పాఠాలు’ కాలేజీ తరువాత శాస్త్రీయ సంగీత పాఠాలపై శ్రద్ధ పెట్టేవాడు. తొలిసారిగా ‘కామ్నా’ (1972) అనే సినిమాలో పాడాడు పంకజ్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ గాయకుడిగా పంకజ్‌కు మంచి పేరు వచ్చింది. అయితే ఈ మంచి పేరు తనకు వెంటనే మరో అవకాశాన్ని తీసుకు రాలేదు. ‘ఇది కూడా మంచికే జరిగింది. పంకజ్‌కు బోలెడు అవకాశాలు వచ్చి ఉంటే తనకు అత్యంత ఇష్టమైన గజల్స్‌కు అనివార్యంగా దూరం కావాల్సి వచ్చేది’ అంటారు పంకజ్ అభిమానులు. అవకాశాల సంగతి ఎలా ఉన్నా పంకజ్‌లో గజల్స్‌పై ఆసక్తి అంతకంతకూ పెరుగుతూనే పోయింది. ‘ఉద్యోగం చెయ్ లేదా వ్యాపారం చెయ్’ లాంటి సలహాలు అదేపనిగా వినిపిస్తున్న కాలంలో ఒక అద్భుత అవకాశం తనను వెదుక్కుంటూ వచ్చింది. అమెరికా, కెనడాలలో పది నెలల పాటు ఉన్న పంకజ్ అక్కడ ఎన్నో గజల్ కచేరీలు చేశాడు. ‘వాహ్వా వాహ్వాల’తో కూడిన ప్రేక్షకుల చప్పట్లు అతడి ప్రతిభను ప్రశంసించే సర్టిఫికెట్లు అయ్యాయి. ఇండియాకు డబ్బులతో కాదు ఉత్సాహంతో... ఆత్మవిశ్వాసంతో వచ్చాడు. ‘గజల్స్’ కోసమే ఉర్దూ నేర్చుకున్నాడు పంకజ్. గజల్స్ గానంలో మరింత పట్టు సాధించాడు. పంకజ్ ఉధాస్ అనే శబ్దం వినబడగానే ‘గజల్’ అనేది అతడి పేరు ముందు వచ్చి మెరిసేది. 1980లో తొలి గజల్ ఆల్బమ్ ‘ఆహత్’ను తీసుకువచ్చాడు. ఈ గజల్ ఆల్బమ్ తనకు తీసుకు వచ్చిన పేరు అంతా ఇంతా కాదు. పదేళ్ల పోరాటం తరువాత పంకజ్ తొలి ఆల్బమ్ అనూహ్యమైన విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి 50 వరకు ఆల్బమ్‌లను తీసుకువచ్చాడు. మ్యూజిక్ ఇండియా 1987లో లాంచ్ చేసిన పంకజ్ ‘షా గుఫ్తా’ మన దేశంలో కంపాక్ట్ డిస్క్‌పై రిలీజ్ అయిన తొలి ఆల్బమ్. ఇక సినిమాల విషయానికి వస్తే ‘ఘాయల్’ సినిమా కోసం 1990లో లతా మంగేష్కర్తో కలిసి మెలోడియస్ డ్యూయెట్ పాడాడు. ఇక ‘నామ్’ సినిమాలో ‘చిఠ్ఠీ ఆయీ హై’ పాట ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ పాట సూపర్ హిట్ అయిన తరువాత అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే అవకాశాన్ని సొమ్ము చేసుకోవాలని పంకజ్ ఎప్పుడూ అనుకోలేదు. ఆచితూచి నిర్ణయం తీసుకునేవాడు. రాశి కంటే వాసికి ప్రాధాన్యత ఇచ్చాడు. బహుశా ఇలాంటి విలువలే సంగీత చరిత్రలో అతడికి సమున్నత స్థానం ఇచ్చాయి. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్ కోసం ‘ఆదాబ్ అర్జ్ హై’ టాలెంట్ హంట్ ప్రోగ్రామ్‌ను నిర్వహించాడు పంకజ్. సినిమా కోసం పాడినా, నటించినా, టీవీ షోలు నిర్వహించినా గజల్స్‌పై తనకు ఉన్న ప్రత్యేక ప్రేమను ఎప్పుడూ కాపాడుకునేవాడు పంకజ్. అందుకే గజల్స్‌ను ప్రేమించే వాళ్ల మదిలో చిరస్థాయిగా, ఇంకో వందేళ్ళయినా సజీవంగానే ఉంటాడు. పంకజ్ ఫేవరెట్ సాంగ్ రేడియోలో వినిపించే బేగం అఖ్తర్ గానామృతానికి చాలా చిన్న వయసులోనే ఫిదా అయ్యాడు పంకజ్. ‘ఆమెది ఒక వినూత్న స్వరం’ అంటాడు. భావాలు, భావోద్వేగాలు పాటలో ఎలా పలికించాలో ఆమె గొంతు వినే నేర్చుకున్నాడు. ‘యే మొహబ్బత్ తేరే అంజామ్ సే’ తనకు ఇష్టమైన పాట. ఎప్పుడు వినాలనిపించినా వినేవాడు. పద్దెనిమిది సంవత్పరాల వయసులో పంకజ్‌కు ప్రసిద్ధ గజల్ గాయకుడు మెహదీ హాసన్‌తో పరిచయం అయింది. చాలాకాలానికి యూకే టూర్లో స్నేహితుడి ఇంట్లో హాసన్‌ను కలుసుకున్నాడు. పంకజ్ గానప్రతిభకు కితాబు ఇచ్చాడు హాసన్. ఈ కితాబు కంటే హాసన్‌తో కలిసి పర్యటించడం, అతడి గొంతును గంటల తరబడి వినడాన్ని బాగా ఎంజాయ్ చేసేవాడు పంకజ్. అదర్ సైడ్ హీరో జాన్ అబ్రహం పంకజ్‌కు వీరాభిమాని. విద్యాబాలన్, జాన్ అబ్రహమ్, సమీరా రెడ్డిలాంటి వారికి తన మ్యూజిక్ వీడియోలతో బ్రేక్ ఇచ్చాడు పంకజ్. ఎప్పుడూ సంగీత ప్రపంచంలో తేలియాడినట్లు కనిపించే పంకజ్‌కు క్రికెట్ అంటే చాలా ఇష్టం. స్కూల్, కాలేజీలలో బాగా ఆడేవాడు. పంకజ్ ఫేవరెట్ బౌలర్ బీఎస్ చంద్రశేఖర్. సంగీతం తప్ప ఏమీ తెలియనట్లు ఉండే పంకజ్ మ్యాచ్‌లకు సంబంధించి చేసే విశ్లేషణ ఆకట్టుకునేది. ‘మీరు క్రికెట్ వ్యాఖ్యాతగా బ్రహ్మాండంగా రాణించవచ్చు’ అని సరదాగా అనేవారు సన్నిహితులు. పంకజ్‌ను చూసీచూడగానే అంతర్ముఖుడు(ఇంట్రావర్ట్) అని అనిపిస్తుంది అయితే ఆయన చాలా సరదా మనిషి అని, చుట్టు పక్కల వాళ్లను తెగ నవ్విస్తారని చెబుతుంటారు సన్నిహితులు. డాక్టర్ కావాలనేది పంకజ్ చిన్నప్పటి కల. అయితే సంగీతం అతడిని వేరే దారిలోకి తీసుకువెళ్లింది. డాక్టర్ కాకపోయినా ఆయన పాడే గజల్స్ ఔషధాలలాగే పనిచేసి మనసుకు స్వస్థతను చేకూరుస్తాయి. ముక్కు సూటి మనిషి సినిమా రంగంలో అవకాశాలు రావాలంటే ‘నిక్కచ్చిగా మాట్లాడే ధోరణి’ ఉండకూడదు అంటారు. అయితే పంకజ్ మాత్రం ‘నొప్పించక తానొవ్వక’ అన్నట్లుగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. తన మనసులోని మాటను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేవాడు. బాలీవుడ్ మ్యూజిక్ ప్రస్తావన వస్తే.... ‘మ్యూజిక్ ఇండస్ట్రీ పూర్తిగా మారిపోయింది. నాన్–ఫిల్మ్ మ్యూజిక్‌ను పట్టించుకోవడం లేదు. సర్వం బాలీవుడ్ అన్నట్లుగా ఉంది. బాలీవుడ్లో తొంభై శాతం మ్యూజిక్ హిప్ హాప్, పంజాబీ, ర్యాప్. ఆర్డీ బర్మన్ క్లాసిక్స్లాంటివి ఇప్పడు వినే పరిస్థితి లేదు. పాటలు స్క్రీన్‌ప్లేలో భాగంగా ఉండడం లేదు. సినిమాను ప్రమోట్ చేయడానికి అన్నట్లుగా ఉంటున్నాయి. బాలీవుడ్‌లోని ఒకప్పటి స్వర్ణ శకం తిరిగి రావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. బాలీవుడ్ గాయకుల్లో పాప్ సంగీత నేపథ్యం నుంచి వచ్చిన వారే ఎక్కువ. ఖవ్వాలి ఎవ్వరికీ పట్టని కళ అయింది’ అని నిట్టూర్చేవాడు పంకజ్. -
చందమామలా మెరిసిపోతున్న నటి ప్రణవి మానుకొండ (ఫోటోలు)
-
వాస్తవిక నటి.. షబానా ఆజ్మీ @ 72
పది డైలాగులు అవసరమైన చోట ఒక ముఖ కవళిక. పెద్దగా అరవాల్సిన చోట ఒక లోగొంతుక. భోరున విలపించాల్సిన చోట కంటి నుంచి జారని నీటి చుక్క. పగలబడి నవ్వాల్సిన చోట పంటి మెరుపు... ఇవి నటన అని చూపించిన నటి షబానా ఆజ్మీ. ఆమె వల్ల స్త్రీ పాత్రలు తెరపై వాస్తవికంగా కనిపించాయి. ఆమె వల్ల కథలు నిజంగా నమ్మించాయి. ఆమె కొంతమంది నటీనటులకు నటగ్రంథం అయ్యింది. ఆమెను భారతీయ వెండితెర సదా గౌరవంగా చూస్తుంది. మన హైదరాబాద్ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతోంది. చూడండి ఎలా హైదరాబాద్‌తో ఆమె జీవితం ముడిపడిందో. 1950 సెప్టెంబర్ 18న ఇక్కడే పుట్టిందామె. తల్లి షౌకత్ ఆజ్మీది హైదరాబాద్ కనుక కాన్పుకు పుట్టింటికి రావడంతో ఇక్కడే నాలుగు నెలలు ఊపిరి పీల్చింది. ఆ తర్వాత ముంబై చేరుకుంది. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకునే సమయంలో ఆమెకు రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి కె.ఏ.అబ్బాస్ ‘ఫాస్లా’, రెండు కాంతిలాల్ రాథోడ్ ‘పరిణయ్’. కాని రెంటి కంటే ముందు తొలిసినిమాగా ‘అంకుర్’ విడుదలైంది. శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఆ కథే ఆమె తొలి కథ అయ్యింది. అందులోని గ్రామీణురాలు లక్ష్మి ఆమె తొలి పాత్ర అయ్యింది. దక్కనీ ఉర్దూ ఆమె తొలి సంభాషణ అయ్యింది. తొలి జాతీయ అవార్డు కూడా ఆ సినిమాతోనే వచ్చింది. హైదరాబాద్ గాలి హైదరాబాద్ అమ్మాయికి గొప్ప ప్రారంభం ఇచ్చింది. తండ్రి కైఫీ ఆజ్మీ కమ్యూనిస్టు కవి. షౌకత్ ఆజ్మీ ‘ఇప్టా’ సభ్యురాలు. 9 ఏళ్ల వయసు వచ్చే వరకూ షబానా ఆజ్మీ ముంబైలో రెడ్‌ఫ్లాగ్ హౌస్‌లో ఉండేది. అంటే 8 కమ్యూనిస్టు కుటుంబాలు ఉండే చిన్న భవనం అన్నమాట. దానికి ఒకటే టాయ్‌లెట్. ఒకటే బాత్రూమ్. కాని వాళ్లంతా కలిసి మెలిసి జీవించేవారు. కైఫీ ఆమెకు ఆ వయసులో ఒక నల్లటి బొమ్మ తెచ్చి ఇచ్చాడు. షబానా ఆ బొమ్మను చూసి ‘నా ఫ్రెండ్స్ అందరి దగ్గర తెల్లటి బొమ్మలున్నాయి’ అనంటే ఆయన ‘నలుపు కూడా అందమైనదే. నీకు ఆ సంగతి తెలియాలి’ అని చెప్పాడు. అలాంటి వాతావరణంలో ఆమె పెరిగింది. ఇంటికి ఎప్పుడూ వచ్చేపోయే కవులు... పార్టీ సభ్యులు. షబానాకు పేరు పెట్టక ఇంట్లో ‘మున్నీ’ అని పిలుస్తుంటే ఇంటికి వచ్చిన కవి అలీ సర్దార్ జాఫ్రీ ‘ఇంకా పేరు పెట్టకుండా ఏమిటయ్యా’ అని తనే షబానా అని పేరు పెట్టాడు. ఆమె తోటి స్నేహితురాళ్లు ఫ్యాంటసీ బొమ్మల పుస్తకాలు చదువుతుంటే షబానాకు రష్యా నుంచి వచ్చే పుస్తకాలు చదవడానికి దొరికేవి. తండ్రి వల్ల సాహిత్యం తల్లి పృధ్వీ థియేటర్లో పని చేయడం వల్ల నటన ఆమెకు తెలిశాయి. పృథ్వీ థియేటర్లో నాటకం వేస్తే గ్రూప్‌లో ఒకరిగా స్టేజ్ ఎక్కేసేది. స్కూల్లో కూడా స్టేజ్ వదిలేది కాదు. కాలేజీలో చేరితే అక్కడ కేవలం ఇంగ్లిష్ థియేటరే నడుస్తూ ఉంటే తన సీనియర్ అయిన నటుడు ఫరూక్ షేక్‌తో కలిసి హిందీ డ్రామా ప్రారంభించింది. అన్ని పోటీల్లో ప్రైజులు కొట్టేది. షబానాకు తాను నటించగలనని తెలుసు. కాని నటనను వృత్తిగా తీసుకోవాలనుకున్న సందర్భం వేరు. షబానా ఆజ్మీ ఒకసారి జయ భాదురి నటించిన ‘సుమన్’ అనే సినిమా చూసింది. అందులో జయ భాదురి నటన కొత్తగా అనిపించింది. ‘ఈమెలాగా నేనూ నటిని కావాలి’ అనుకుని తండ్రితో చెప్పి, పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరతానంటే ‘నువ్వు ఏ రంగమైనా ఎంచుకో. కాని అందులో బెస్ట్‌గా నిలువు’ అని ఆయన అన్నాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో షబానా నటిగా తొలిరోజుల్లోనే అందరి దృష్టిలో పడింది. పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘అంకుర్’ కూడా అలాగే వచ్చింది. నగరమే తప్ప పల్లెటూరు చూసి ఎరగని షబానా ‘అంకుర్’ కోసం చాలా హోమ్ వర్క్ చేయాల్సి వచ్చింది. మడమల మీదుగా చీర కట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్న పల్లెటూళ్లలో అలా ఉండే స్త్రీలను గమనించింది. అంతవరకూ ఆమెకు మునికాళ్ల మీద కూచోవడం రాదు. ‘లక్ష్మి’ పాత్ర వంట చేయాలన్నా పనులు చేయాలన్నా మునికాళ్ల మీద కూచోవాలి. అందుకని శ్యాం బెనగళ్ ఆమెను ‘నువ్వు మునిగాళ్ల మీద కూచుని భోం చేయ్’ అని డైనింగ్ టేబుల్ మీద కూచోనిచ్చేవాడు కాదు. ‘అంకుర్’ సినిమాలో షబానా తన నడక, మాట తీరు, ముఖ కవళికలు వీటన్నింటితో లక్ష్మి పాత్రను గొప్పగా తెర మీద ప్రతిష్టించింది. ఆ సినిమా వేసిన అంకురం అతి త్వరగానే మహా వృక్షమైంది. ఒక కాలం అది. నసీరుద్దీన్ షా, ఫరూక్ షేక్, ఓంపురి, స్మితాపాటిల్, షబానా ఆజ్మీ... వీళ్లు భారతీయ పారలల్ సినిమాకు ఊతంగా నిలబడ్డారు. వీరే పునాది, వీరే గోడలు, వీరే పైకప్పు. స్మితా పాటిల్, షబానా ఆజ్మీల మధ్య పోటీ ఉండేది. కాని ఎవరికి వారు తమ పాత్రలలో చెలరేగి ఎవరు గొప్పో చెప్పడం కష్టం చేసి పెట్టేవారు. శేఖర్ కపూర్ ‘మాసూమ్’ లో భర్త అక్రమ సంతానాన్ని అంగీకరించేందుకు మథన పడే భార్యగా షబానా గొప్ప నటన ప్రదర్శించింది. మహేశ్ భట్ ‘అర్థ్’లో మరొక స్త్రీ ఆకర్షణలో పడిన భర్త గురించి ఆమె పడిన సంఘర్షణ ప్రేక్షకులను కదిలించింది. శ్యామ్ బెనగళ్ ‘మండీ’, మృణాల్‌సేన్ ‘ఖండర్’, గౌతమ్‌ఘోష్ ‘పార్’... దర్శకులు ఆమె వల్ల ఆమె దర్శకుల వల్ల భారతీయ సినిమాను ఉత్కృష్ట ప్రమాణాలకు చేర్చారు. దీపా మెహతా ‘ఫైర్’, శాయి పరాంజపె ‘స్పర్శ్’, సత్యజిత్ రే ‘షత్రంజ్ కే ఖిలాడీ’, తపన్ సిన్హా ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’... ఇవన్నీ ఆమెను తలిస్తే తలువబడే సినిమాలు. తెలుగు దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన ‘మార్నింగ్ రాగా’లో క్లాసికల్ సింగర్‌గా నటించిందామె. మూస తల్లి పాత్రలు, మూస వదిన, అత్త పాత్రలు ఆమె ఏనాడూ చేయలేదు. ఆమెకు పాత్ర రాసి పెట్టి ఉండాలి. పాత్రకు ఆమె రాసి పెట్టి ఉండాలి. ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘ఫకీరా’ వంటి కమర్షియల్ సినిమాలు చేసినా ఆమె అందుకు పుట్టలేదు. ఆ తర్వాత ఆ దారి పట్టలేదు. షబానా ఆజ్మీ గీతకర్త జావేద్ అఖ్తర్‌ను వివాహం చేసుకుంది. రాజ్యసభ సభ్యురాలిగా పని చేసింది. సామాజిక కార్యకలాపాలలో పాల్గొంది. తండ్రి పేరు మీద ఆయన స్వగ్రామంలో స్త్రీల కోసం ఉపాధి కల్పనా కేంద్రాలను తెరిచింది. ఆమెకు ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. షబానా వెండితెరకు హైదరాబాద్ అందించిన గోల్కొండ వజ్రం. దాని మెరుపులు మరిన్ని కొనసాగాలి. -
సూపర్ హీరోయిన్లు
సూపర్ హీరోల సినిమాలు తరచూ చూస్తూనే ఉంటాం. సూపర్‌మేన్, స్పైడర్‌మేన్ వంటివి. మన దేశీ సూపర్ హీరోలు శక్తిమాన్, క్రిష్ కూడా ఉన్నారు. కానీ సూపర్ హీరో సినిమాలతో పోల్చు కుంటే సూపర్ హీరోయిన్ల సినిమాలు తక్కువ. హాలీవుడ్లో వండర్ ఉమెన్, బ్లాక్ విడో, కెప్టెన్ మార్వెల్ సినిమాలు ఉన్నాయి. కానీ భారతీయ చిత్రాల్లో సూపర్ హీరోయిన్ సినిమాలు అసలు రాలేదు. ప్రస్తుతం సూపర్ హీరోయిన్ సినిమాలను స్క్రీన్ మీదకు తీసుకురావడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ విశేషాలు... శ్రద్ధ... నాగకన్య శ్రద్ధా కపూర్ ఓ సినిమాలో నాగకన్యగా నటించనున్నారని తెలిసిందే. మూడు భాగాలుగా రూపొందించనున్న ఈ సినిమాను ఓ సూపర్ హీరోయిన్ ఫిల్మ్‌లా డిజైన్ చేస్తున్నారట చిత్రబృందం. విషాల్ ఫూరియా దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అవసరమైనప్పుడు నాగకన్యగా మారే శక్తులు శ్రద్ధకపూర్కి ఉంటాయని తెలిసింది. మరి సూపర్ హీరోలకు ప్రేక్షకులు ప్రేమను పంచినట్టే సూపర్ హీరోయిన్లను కూడా ఆదరిస్తారా? వేచి చూడాలి. అదితీ... ఆనా కన్నడంలో ‘ఆనా’ అనే సూపర్ హీరోయిన్ ఫిల్మ్ చిత్రీకరణ పూర్తయింది. అదితీ ప్రభుదేవా లీడ్ రోల్లో పి. మనోజ్ దర్శకత్వం వహించారు. ‘తొలి ఫీమేల్ సూపర్ హీరోయిన్ చిత్రం’ ఇదే అని చిత్రబృందం ప్రకటించింది. రెండు భాగాలుగా తెరకెక్కే ఈ సినిమా తొలి భాగానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. కన్నడంలో తెరకెక్కిన ఈ సినిమా మిగతా భాషల్లోనూ విడుదల కావచ్చు. మొదటి భాగంతో పోలిస్తే రెండో భాగంలో మరింత యాక్షన్ ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. కత్రినా... ది సూపర్ ఉమన్ ‘సుల్తాన్, టైగర్ జిందా హై’ వంటి సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఓ సూపర్ హీరోయిన్ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం కత్రినా కైఫ్ తొలిసారి సూపర్ హీరోయిన్గా మారుతున్నారు. ఆల్రెడీ ఇందులో చేయబోయే యాక్షన్ సన్నివేశాల కోసం శిక్షణ తీసుకుంటున్నారు కత్రినా. వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. సుమారు నాలుగైదు దేశాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నట్టు ప్రకటించారు అలీ అబ్బాస్. -
బాలీవుడ్ బంగారు గని
అక్షయ్ కుమార్... బాలీవుడ్ మోస్ట్ బ్యాంకబుల్ స్టార్. హిందీ బాక్సాఫీస్‌కి దొరికిన అక్షయ పాత్ర. నిర్మాతల పాలిట బంగారు గని. 3 సినిమాలు 6 యాడ్స్‌తో అక్షయ్ ఎప్పుడూ బిజీ బిజీ. ఈ బిజినెస్ వల్లే ఆయన బిజినెస్ వందల కోట్లు. ఫోర్బ్స్ పత్రిక ప్రకారం అత్యధిక పారితోషికం అందుకుంటున్న వాళ్లలో భారతీయ సినిమా పరిశ్రమ నుంచి అక్షయ్ ఒక్కరే కావడం విశేషం. గత రెండేళ్లుగా ఆ జాబితాలో నిలిచింది అక్షయ్ ఒక్కరే. రెండొందలతో ప్రయాణం ప్రారంభించారు అక్షయ్. ప్రస్తుతం అక్షయ్ ఏడాదికి ఆర్జిస్తుంది 350 కోట్లు పైనే. ఆయన జర్నీ పై స్పెషల్ స్టోరీ. ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీనటుల జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది ఆ జాబితాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఒక్కరే ఉన్నారు. సుమారు 48.5 మిలియన్ల సంపాదనతో 6వ స్థానం దక్కించుకున్నారు. అంటే మన రూపాయిల్లో సుమారు 360 కోట్లు. ఈ జాబితాలో హాలీవుడ్ నటుడు డ్వెన్ జాన్సన్ 87.5 మిలియన్ల సంపాదనతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ర్యాన్ రొనాల్డ్స్ (71.5 మిలియన్లు), మార్క్ వాల్ బెర్గ్ (58 మిల్లియన్లు) బెన్ అఫ్లిక్ (55 మిలియన్లు), విన్ డీజిల్ (54 మిలియన్లు) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారు. అక్షయ్ కుమార్ తర్వాత లిన్ మానుల్ మిరండా, విల్ స్మిత్, ఆడమ్ సాండ్లర్, జాకీ చాన్ మిగతా స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాను 1 జూన్ 2019 నుంచి 1 జూన్ 2020 ఆధారంగా చేశారు. అలాగే ఈ సంపాదనను ప్రీ– టాక్స్ గా నమోదు చేశారు. అంటే ఈ నటీనటులు తమ టీమ్ (ఏజెంట్స్, మేనేజర్ లు, లాయర్లు,)కి చెల్లించేది మినహాయించకుండా వీరి సంపాదన ఇంత అని అర్థం. వెయిటర్ టు యాక్టర్ బాలీవుడ్‌కి అక్షయ్ కుమార్ ప్రయాణం అంత సులువుగా ఏం సాగలేదు. సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టకముందు రకరకాల ఉద్యోగాలు చేశారు. వివిధ దేశాలు తిరిగారు. రాజీవ్ హరి ఓం భాటియాగా అక్షయ్ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత అక్షయ్ కుమార్ గా మారారు. చిన్నప్పటి నుంచి చదువు పై పెద్ద శ్రద్ధ లేదని చాలా సందర్భాల్లో ఆయనే చెప్పారు. 12 పూర్తవ్వగానే చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం మొదలుపెట్టారు అక్షయ్. ఆ సమయంలో బ్యాంకాక్ వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. అక్కడే కొన్ని రోజులు వెయిటర్‌గానూ పని చేశారు. బ్యాక్ టు ముంబై బ్యాంకాక్ లో నాలుగైదేళ్లు ఉన్న తర్వాత ముంబైకి తిరిగి వచ్చేశారు అక్షయ్. మళ్లీ ముంబైలో చిన్నా చితక ఉద్యోగాలు చేశారు. జేబులో 200 రూపాయిలతో ముంబైలో గడిపిన రోజులున్నాయి అని చాలా సందర్భాల్లో అక్షయ్ తెలిపారు. తర్వాత కొన్ని రోజులు బంగ్లాదేశ్ లోనూ ఉన్నారు. మార్షల్ ఆర్ట్స్ టీచర్ టు మోడల్ తాను నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ద్వారానే కొన్ని రోజులు ఉపాధి పొందారు. అలా కొన్ని రోజులు పాటు పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ ఉన్నారు. అనుకోకుండా అక్షయ్ స్టూడెంట్స్‌లో ఒకరి తండ్రి అక్షయ్‌కు మోడల్‌గా అవకాశం చూపించారు. జయేష్ సేథ్ అనే ఫోటోగ్రాఫర్ దగ్గర సుమారు 18 నెలలు అసిస్టెంట్ గా పని చేశారు. అలా ఆయన జయేష్ దగ్గరే ఫ్రీగా పోర్ట్ ఫోలియో షూట్ చేయించుకోగలిగారు. మోడల్‌గా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేశారు అక్షయ్. మార్షల్ ఆర్ట్స్ ద్వారా సంపాదించే దాన్ని మోడలింగ్ లో రెండు మూడు రోజుల్లో సంపాదించారు. చూడటానికి బావుండటం, చురుకుతనం వల్ల మోడల్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌గా త్వరగా ప్రమోషన్ వచ్చింది అక్షయ్‌కు. ఫ్లైట్ మిస్ – కెరీర్ టేక్ ఆఫ్ ఓసారి మోడలింగ్ పని మీద బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది అక్షయ్. అనుకోకుండా ఫ్లైట్ మిస్ అయ్యారు. ఎక్కడ లేని నిరుత్సాహం అంతా అక్షయ్‌ని ఆవహించింది. కానీ కుంగిపోకుండా ఆ మధ్యాహ్నం నుంచి మళ్లీ తన పని ప్రారంభించారు. స్టూడియోల చుట్టూ ఆల్బమ్ పట్టుకు తిరగడం ప్రారంభించారు. ఆ సాయంత్రమే ప్రమోద్ చక్రవర్తి ‘దీదార్’ అనే సినిమాకు అక్షయ్‌ను హీరోగా సెలెక్ట్ చేశారు. కానీ అక్షయ్ చేసిన ‘సౌగంది’ అనే చిత్రం (1991)లో ముందు విడుదలయింది. కానీ బాలీవుడ్ లోకి ఒక కొత్త హీరో వచ్చాడు అని తెలిసేలా చేసింది మాత్రం ‘కిలాడీ’. నటుడిగా అక్షయ్ మొదటి బ్రేక్ అదే. అలా వరుస సినిమాలు చేస్తూ వెళ్లిపోయారు. 1994లో అక్షయ్ కుమార్ సుమారు 14 సినిమాల్లో కనిపించారు. లవ్‌స్టోరీ అక్షయ్ కుమార్ తన కో స్టార్, బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నాని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఓసారి ఫిలింఫేర్ మ్యాగజీన్ షూటింగ్ కోసం కలసిన వీళ్ల మనసులు కలిశాయి. కొన్నిరోజులు డేటింగ్ చేశారు. 2001లో అక్షయ్ కుమార్, ట్వింకిల్ పెళ్లి చేసుకున్నారు. వీళ్లిద్దరికీ ఇద్దరు పిల్లలు. ఆరవ్, నితారా. యాక్షన్ – కామెడీ కెరీర్ ప్రారంభంలో వరుసగా యాక్షన్ సినిమాల్లో కనిపించారు అక్షయ్. సినిమాల్లో రిస్కీ స్టంట్ లు చేస్తూ ‘ఇండియన్ జాకీ చాన్’ అనిపించుకున్నారు కిలాడీ కుమార్. ఆ తర్వాత కామెడీ రోల్స్‌కి జానర్ ను షిఫ్ట్ చేశారు అక్షయ్. అయితే కెరీర్ అనుకున్నట్టే సాగదు కదా. ఓసారి వరుసగా 14 ఫ్లాప్‌లు చూశారు అక్షయ్. డిప్రెషన్లోకి వెళ్లిపోయారట. కానీ తాను నేర్చుకున్న, నమ్మిన మార్షల్ ఆర్ట్స్ అందులో నుంచి బయట పడేలా చేసిందని చెప్పారు. స్త్రీలకు సెల్ఫ్ డిఫెన్స్ ముఖ్యం అంటారు అక్షయ్. అందుకే స్త్రీలకోసం ప్రత్యేకంగా ఓ అకాడమీని స్థాపించారు. నేర్చుకోవాలని ఆసక్తి ఉన్నవారు ఇందులో ఉచితంగా ప్రొఫెషనల్ ట్రైనర్ల సహాయంతో శిక్షణ పొందవచ్చు. కామెడీ – మెసేజ్ ఆ మధ్య వరుస ఫన్ ఫిల్మ్స్‌లో కనిపించారు అక్షయ్. ఆ తర్వాత వరుసగా సామాజిక సందేశం ఉన్న సినిమాల్లోనూ (‘టాయిలెట్ – ఏక్ ప్రేమ్ కథా’, ‘ప్యాడ్ మాన్’) కనిపించారు అక్షయ్. 2010 నుంచి 2019 వరకు ఏడాదికి 3 సినిమాలు తక్కువ కాకుండా చేస్తున్నారు అక్షయ్. ప్రస్తుతం ఇండియాలోనే ఏ స్టార్ హీరో చేయని ఫీట్ ఇది అని చెప్పుకోవచ్చు. మిస్టర్ డిపెండబుల్ ప్రస్తుతం ఇండియన్ సినిమా నంబర్ గేమ్స్ చుట్టూ తిరుగుతోంది. వంద కోట్ల క్లబ్.. రెండొందల కోట్ల క్లబ్.. మూడొందల కోట్ల క్లబ్ అని విజృంభిస్తున్నారు. ఒక స్టార్ సినిమాలు ఎంత బిజినెస్ చేస్తున్నాయి అని లెక్కకడితే అక్షయ్ సినిమాల బిజినెస్ ఇలా ఉంది. ∙2016లో 365 కోట్లు (3 సినిమాలు) ∙2017లో 287 కోట్లు (2 సినిమాలు) ∙2018లో 376 కోట్లు (3 సినిమాలు) ∙2109లో 720 కోట్లు (4 సినిమాలు) ప్రస్తుతం అక్షయ్ చేతిలో ఉన్న సినిమాలు ఆరు ► సూర్యవన్షీ – షూటింగ్ పూర్తి. థియేటర్స్ ఓపెన్ చేస్తే విడుదలయ్యే మొదటి సినిమా ఇది ► లక్ష్మీ బాంబ్ – త్వరలో డిస్నీ హాట్ స్టార్‌లో విడుదల కానుంది ► పృథ్వీ రాజ్ – చిత్రీకరణ సగం పూర్తయింది ► అత్రాంగి రే – షూటింగ్ కొన్ని రోజులు జరిగింది ► బచ్చన్ పాండే – మే లో చిత్రీకరణ ప్రారంభం కావాల్సింది ► బెల్ బాటమ్ – ఇటీవలే చిత్రబృందం షూటింగ్ కోసం స్కాట్‌ల్యాండ్ వెళ్లారు. పెద్ద మనసు అక్షయ్ జేబు మాత్రమే కాదు. మనసు కూడా చాలా పెద్దది. కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డవారిని ఆదుకోవడానికి అక్షయ్ 25 కోట్లను విరాళంగా ప్రకటించారు. భార్య ట్వింకిల్, కుమారుడు ఆరవ్, కుమార్తె నితారాతో... -
ఇండియా నుంచి ఈ ఇద్దరూ..
ప్రియాంకా చోప్రా గత ఏడాది సందడి చేసిన వేడుకల్లో టొరొంటో చలన చిత్రోత్సవాలు ఒకటి. ఆమె నటించిన ‘ది స్కై ఈజ్ పింక్’ ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. దాంతో ఈ వేడుకకు హాజరై, ఎర్ర తివాచీపై ‘క్యాట్ వాక్’ చేసి, కనువిందు చేశారు. ఈసారి ప్రియాంక ఈ చిత్రోత్సవాలకు ‘బ్రాండ్ అంబాసిడర్’. ప్రపంచవ్యాప్తంగా ఈ వేడుకలకు 50 మంది సినీ ప్రముఖులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఆహ్వానంగా అందుకున్నారు. భారతీయ చిత్రపరిశ్రమ నుంచి ప్రియాంకా చోప్రా, దర్శకుడు అనురాగ్ కశ్యప్‌లు బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంపిక కావడం విశేషం. సెప్టెంబర్ 10 నుంచి 19 వరకూ... కరోనా వల్ల ఆస్కార్ అవార్డు వేడుక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్‌కి వాయిదా పడింది. మేలో ఫ్రాన్స్‌లో జరగాల్సిన కాన్స్ చలన చిత్రోత్సవాలు జరగలేదు. అయితే టొరొంటో చలన చిత్రోత్సవాలు మాత్రం ప్రతి ఏడాదిలానే సెప్టెంబర్‌లో 10 నుంచి 19 వరకూ జరగనున్నాయి. ఈ వేడుకలు డిజిటల్లో స్క్రీనింగ్ అవుతాయి. ‘‘ఇవి 45వ టొరొంటో చలన చిత్రోత్సవాలు. ఇన్నేళ్ల టొరొంటో ఫిల్మ్ ఫెస్టివల్ చరిత్రలో డిజిటల్లో ప్రసారం కాబోతున్న తొలి వేడుక ఇదే’’ అని చిత్రోత్సవాల ప్రతినిధులు పేర్కొన్నారు. వేడుకల్లో భాగంగా 50 చిత్రాలను థియేటర్లలో ప్రదర్శించాలనుకుంటున్నామని, సామాజిక దూరాన్ని పాటించే దిశగా సీట్ల ఏర్పాటు ఉంటుందని, అయితే ప్రభుత్వం అనుమతిస్తేనే ఇది సాధ్యపడుతుందని కూడా తెలిపారు. -
అరె.. భలే ఉందే!
రుతుపవనాలు సంవత్సరానికి ఒకసారి కొత్తవానను తెస్తాయి. కాని తెర మీద మూడు నెలలకొకసారి కొత్త సౌందర్యపు వాన కురుస్తుంది. హీరోయిన్లు చమక్కుమని మెరుస్తారు. ఎవరీ అమ్మాయి అనిపిస్తారు. భలే ఉందే అని మెప్పు పొందుతారు. హీరోల తెర ఆయుష్షు పెద్దది. హీరోయిన్లది చిన్నది. అందుకే హీరోల బైక్ సీటు వెంట వెంటనే ఖాళీ అయ్యి కొత్త హీరోయిన్లకు చోటు ఇస్తుంటుంది. ఇప్పుడు మార్కెట్లో మెరుస్తున్న కొత్త తారల పరిచయం ఇది. నిర్మాతలకు ఐశ్వర్య ప్రస్తుతం తమిళంలో అరడజను సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నారు కథానాయిక ఐశ్వర్యా రాజేష్. ఐశ్వర్య మంచి నటి అని కోలీవుడ్ ఆల్రెడీ సర్టిఫికెట్ ఇచ్చేసింది. సేమ్ సర్టిఫికేట్ కోసం తెలుగు సీమకు అప్లికేషన్ పెట్టుకుని వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు ఐశ్వర్యా రాజేష్. భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘కౌసల్య కృష్ణమూర్తి: క్రికెటర్’ అనే సినిమాలో నటించారు ఐశ్వర్య. తమిళంలో ఐశ్వర్యానే ప్రధాన పాత్రలో నటించిన ‘కణా’ సినిమాకు ఇది తెలుగు రీమేక్. ఈ సినిమాను జూలై తొలివారంలో విడుదల చేయాలనుకుంటున్నారు. అన్నట్లు ఈ సినిమా కంటే ముందే క్రాంతిమాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సినిమాలో ఒక హీరోయిన్గా ఎంపికయ్యారు ఐశ్వర్య. ‘మిస్ మ్యాచ్’ అనే మరో తెలుగు సినిమాలోనూ నటిస్తున్నారు. ఇలా తెలుగులో కూడా ఆమె బిజీ అయిపోయారు. అన్నట్లు.. తమిళంలో ‘కాక్క ముటై్ట’, ‘కణా’ తర్వాత ఐశ్వర్యకు ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్‌కి అవకాశం వస్తోంది. ఈవిడతో సినిమా తీస్తే నిర్మాతలకు ఐశ్వర్యమే అనే పేరు తెచ్చుకోగలిగారు. మరో మలయా కుట్టి రజనీకాంత్ ‘పేట’లో త్రిష, సిమ్రాన్, మేఘా ఆకాష్ కాకుండా మాళవికా మోహనన్ కూడా నటించారు. అయితే పెద్ద స్టార్లు ఉండటం, పైగా తల్లి పాత్రలో నటించడంతో మాళవిక పేరు అంతగా చర్చకు రాలేదు. 2013లో ‘పట్టమ్ పోలే’ అనే మలయాళ సినిమాతో సిల్వర్‌స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇచ్చిన ఈ తార ఆ తర్వాత మలయాళం, కన్నడ సినిమాలు కూడా చేశారు. ‘బియాండ్ ది క్లౌడ్స్’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌ను కూడా పలకరించిన మాళవిక ఇప్పుడు ‘హీరో’తో స్ట్రయిట్‌గా టాలీవుడ్ గడప తొక్కబోతున్నారు. ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరో. బైక్ రేస్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అన్నట్లు చెప్పడం మరిచితిమి... ‘లస్ట్‌స్టోరీస్’ (2018), ‘అంధా ధున్’(2018), ‘మహర్షి’ (2019) సినిమాలకు కెమెరామేన్‌గా వర్క్ చేసిన కేయు. మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్. మలయాళ కుట్టీలు నిత్యామీనన్, నయనతార వంటివారు పేరు తెచ్చుకున్నట్లుగానే ఈ మలయాళీ కుట్టీ కూడా ఇక్కడ బోలెడంత పేరు తెచ్చుకుంటారనే అంచనాలు ఉన్నాయి. ముంబై ఫ్లయిట్ వచ్చింది... హీరోయిన్ను తెచ్చింది తెలుగు వెండితెరపై బాలీవుడ్ హీరోయిన్లు చాలామంది మెరిశారు. కొందరైతే సౌత్‌లోనే సెటిలైపోయారు. అలా ఈ ఏడాది కూడా కొందరు బాలీవుడ్ భామలు తెలుగు ఇండస్ట్రీలో కథానాయికలుగా తమ ప్రస్థానాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్లో ఫుల్ బిజీగా ఉన్న వన్నాఫ్ ది టాప్ హీరోయిన్స్ శ్రద్ధాకపూర్. ఈమె ‘సాహో’ సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. మరో బాలీవుడ్ బ్యూటీ ఎవెలిన్ శర్మకు ఇదే తొలి తెలుగు చిత్రం కావడం విశేషం. ఆలియా భట్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో టాలీవుడ్‌ను పలకరించబోతున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. రామ్‌చరణ్ సరసన ఆలియా భట్ నటిస్తున్నారు. మరో హిందీ తార జరీనా ఖాన్ కూడా తెలుగు ఆడియన్స్‌కు తనను తాను పరిచయం చేసుకోబోతున్నారు. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో జరీన్ ఖాన్ ఓ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో మెహరీన్ మెయిన్ హీరోయిన్. అలాగే ‘ఎర్ఎక్స్ 100’ ఫేమ్ కార్తికేయ హీరోగా నటిస్తున్న ‘హిప్పి’ సినిమా దిగంగనా సూర్యవన్షీకు హీరోయిన్గా టాలీవుడ్ తలుపులు తెరుచుకున్నాయి. శాండిల్ పరిమళం రక్షిత, సంజన, అనుష్కా, ప్రణీత తాజాగా రష్మికా మండన్నా... ఈ కన్నడ భామలు అందరూ టాలీవుడ్ తెరపై సత్తా చాటారు. ఈ లిస్ట్‌లో తన పేరును కూడా రిజిష్టర్ చేయించుకోవాలనుకుంటున్నారు మరో శాండిల్ వుడ్ బ్యూటీ కృతీశెట్టి. ‘ఉప్పెన’ సినిమాతో తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతున్నారు. చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇందులో హీరో. దర్శకుడు సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 2009లో ‘సరిగమ’ అనే కన్నడ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చిన కృతీ శెట్టి 2017లో ‘సెవిలి’ అనే తమిళ సినిమాలో కనిపించారు. అలాగే నాని హీరోగా కె. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గ్యాంగ్‌లీడర్’ ద్వారా మరో కన్నడ బ్యూటీ ప్రియాంకా అరుళ్ మోహన్ కథానాయికగా పరిచయం కానున్నారు. ఇంతకుముందు ‘ఓంధ కథ హెల్లా’ అనే హారర్ బ్యాక్‌డ్రాప్ రూపొందిన కన్నడ సినిమాలో నటించారామె. స్మాష్ గాళ్ అభిప్రాయాలను పంచుకునే వేదికైన సోషల్ మీడియా ప్రతిభ ఉన్నవారికి అవకాశాల వారధిగా కూడా మారింది. ఇలా కన్ను కొట్టి ఓవర్‌నైట్‌లో అలా స్టారై హీరోయిన్గా చాన్స్ దక్కించుకున్నారు ప్రియా ప్రకాశ్ వారియర్. అలాగే డబ్ స్మాష్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న మృణాళినీ రవి ‘వాల్మీకి’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ హీరో. తమిళ హిట్ ‘జిగర్తండా’కు ఇది తెలుగు రీమేక్ అని టాక్. డబ్ స్మాష్‌లో హిట్ కొట్టిన మృణాళిని వెండితెరపై కూడా హిట్ కొడతారా? లెటజ్.. వెయిట్ అండ్ సీ. శివాని... శివాత్మిక... అంజలి, ఈషా రెబ్బా, ప్రియాంకా జవాల్కర్.. ఇలా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఒకే కుటుంబంలోని ఇద్దరు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా తెలుగు తెరపైకి రాబోతున్నారు. వారు అక్కాచెల్లెళ్లు కూడా. ఈ పాటికే అర్థం అయ్యి ఉంటుంది. వారే రాజశేఖర్, జీవితల కుమార్తెలు శివానీ, శివాత్మిక అని. తెలుగులో రీమేక్ అవుతున్న హిందీ హిట్ ‘2 స్టేట్స్’ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్నారు శివాని. ‘దొరసాని’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను హాయ్ చెబుతున్నారు శివాత్మిక. ఇదే సినిమా ద్వారా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయం కానున్నారు. ఈ తెలుగు హీరోయిన్స్ లిస్ట్‌లో ఇంకొందరు తమ పేరును ఆడియన్స్ గుర్తుపెట్టుకోవాలనే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఇక ఇప్పటికే ఈ ఏడాది రిలీజైన నాగచైతన్య ‘మజిలీ’ సినిమాతో దివ్యాంశా కౌశిక్, ‘చిత్రలహరి’ సినిమాతో నివేథా పేతురాజ్, నాని ‘జెర్సీ’ సినిమాతో శ్రద్ధా శ్రీనాథ్ తెలుగు తెరకు పరిచయమై నటన పరీక్షలో ఆడియన్స్ చేత మంచి మార్కులు వేయించుకున్న విషయం తెలిసిందే. తెలుగు తెర ఈ ఏడాది ఇంకెంతమంది కొత్త హీరోయిన్లను పరిచయం చేస్తుందో చూద్దాం. – ముసిమి శివాంజనేయులు -
టాప్ డైరెక్టర్‌పై లైంగిక ఆరోపణలు.. షాక్‌లో బాలీవుడ్!
‘మీటూ’ ఉద్యమంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలలో చాలామంది లైంగిక వేధింపుల ఆరోపణలను ఎదుర్కొన్నారు. తాజాగా ‘3 ఇడియట్స్, సంజు’ వంటి చిత్రాలను తెరకెక్కించిన అగ్రదర్శకుడు రాజ్ కుమార్ హిరానీపై ‘సంజు’ సినిమాకి దర్శకత్వ శాఖలో పని చేసిన ఓ మహిళ ఆరోపించారు. ‘‘సంజు’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో హిరానీ నన్ను లైంగికంగా వేధించారు. ఆయన్ని ఓ తండ్రిలా భావించాను. మా నాన్నగారి ఆరోగ్యం బాగాలేదు. ఆ పరిస్థితుల్లో ఉద్యోగం పోతే మళ్లీ ఉద్యోగం సంపాదించడం కష్టం అవుతుందని సైలెంట్‌గా ఉండిపోయాను’’ అని పేర్కొన్నారు. ఈ విషయాన్ని హిరానీ ఫిల్మ్ మేకింగ్ పార్ట్నర్ విదూ వినోద్ చోప్రా, ఆయన భార్య అనుపమా చోప్రా, రచయిత అభిజిత్ జోషీకు మెయిల్ చేశారామె. అయితే ఈ ఆరోపణలు అసత్యమని, తన ఇమేజ్‌ని డ్యామేజ్ చేసే ప్రయత్నమే అని కొట్టిపారేశారు హిరానీ. టాప్ డైరెక్టర్‌పై ఇలాంటి ఆరోపణ రావడం బాలీవుడ్‌కి పెద్ద షాకే. -
అవగాహన లేకుండా మాట్లాడను
ఈ ఏడాది ‘మీటూ’ ఉద్యమం ఇండియన్ ఇండస్ట్రీలను ఊపేసింది. మమ్మల్ని వేధించారంటూ చాలామంది నటీమణులు కొందరి స్టార్స్‌పై ఆరోపణలు చేశారు. ఈ ఉద్యమాన్ని చాలా మంది సపోర్ట్ చేయగా కొందరు వ్యతిరేకించారు కూడా. ‘మీటూ’ ఉద్యమాన్ని మీరు సపోర్ట్ చేస్తారా? అని నటుడు అరవింద స్వామిని అడగ్గా – ‘మీటూ’ ఉద్యమాన్ని స్వాగతిస్తాను. కానీ సపోర్ట్ చేస్తానా? లేదా విమర్శిస్తానా అనే స్టాండ్ తీసుకోలేను’’ అని పేర్కొన్నారాయన. ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ – ‘‘ఎవరైనా ఎవరి మీదైనా ఆరోపణలు చేశారంటే ఆ మాటలు విని ఆరోపించినవారిని సపోర్ట్ చేసి, నిందకు గురైనవారిని విమర్శించను. ఎందుకంటే ఆ ఆరోపణల గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటాను. ఆ విషయం మీద ఎంతో కొంత అవగాహన ఉంటే తప్ప నేను మాట్లాడలేను. ఆధారాలు లేనప్పుడు ఎటు వైపు మాట్లాడినా అది తప్పు. అలా కామెంట్ చేస్తే ఆ అభిప్రాయం ఆ ఒక్కరిదే అవుతుంది. అలాగే ఒక గుంపుగా చేరి ఆరోపించేవాళ్లను సమర్థించను కూడా’’ అని పేర్కొన్నారు అరవింద స్వామి. -
ప్చ్.. మళ్లీ నిరాశే
భారతీయ చిత్ర పరిశ్రమకు మరోసారి నిరాశ ఎదురైంది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో ఇండియా నుంచి అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఆస్కార్ నామినేషన్‌కి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేటగిరీకి ‘విలేజ్ రాక్‌స్టార్స్’తో కలిపి మొత్తం 87 చిత్రాలు వెళ్లాయి. అయితే.. ‘విలేజ్ రాక్‌స్టార్స్’ ఆస్కార్స్ 2018 బరిలో నామినేషన్ దక్కించుకోలేకపోయింది. నిరుపేదలైన చిన్నారులు తమ కష్టాలు, బాధలను దిగమింగుకుంటూ జీవితాలను ఎలా సంతోషంగా మలుచుకున్నారు? అనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’. రీమాదాస్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ సినిమా 2017 సెప్టెంబర్ 8న విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా జాతీయ అవార్డు కూడా పొందింది. ఈ చిత్రాన్ని రీమాదాస్ స్వస్థలమైన అస్సోంలోని చైగావ్ గ్రామంలోనే తెరకెక్కించడం విశేషం. ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఎంపికైన ‘విలేజ్ రాక్‌స్టార్స్’కి తర్వాతి ఎంపిక ప్రక్రియలో మాత్రం చోటు దక్కలేదు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న ఆస్కార్స్ వేడుక ఘనంగా జరగనుంది. కాగా ‘మదర్ ఇండియా, సలాం బొంబాయ్, ‘లగాన్’ వంటి చిత్రాలు కూడా గతంలో ఉత్తమ విదేశీ విభాగంలో నామినేషన్‌కి వెళ్లినా, దక్కించుకోలేకపోయాయి. -
దీపికా, కంగనాల రెమ్యునరేషన్ తెలిస్తే షాక్!
పారితోషికం అనాల్సింది.. భారితోషికం అన్నారేంటి అనుకుంటున్నారా? అయితే మ్యాటర్‌లోకి ఎంటర్ అవ్వండి. మనలో మన మాట. హీరోలకు పారితోషికం ఎక్కువా? హీరోయిన్లకా? అంటే.. ఎవరైనా ‘హీరో’లకే అంటారు కదా. ఇద్దరు నాయికల విషయంలో ఈ సీన్ రివర్స్ అయింది. ఆ విషయంలోకి వస్తే.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలు ఎక్కువగా హీరో ఇమేజ్ మీద నడుస్తున్నాయి. కథలన్నీ వాళ్ల చుట్టూనే తిరుగుతుంటాయి కూడా. అందుకే పారితోషికం విషయంలోనూ హీరోలదే పై చేయి. కానీ మెల్లిగా ఈ పద్ధతి మారుతున్నట్టుగా కనిపిస్తోంది. వాళ్ల మార్కెట్‌ని బట్టి మాకింత కావాలని నాయికలు నిక్కచ్చిగా తమ పారితోషికాన్ని డిమాండ్ చేసి, పుచ్చుకుంటున్నారు. ఈ ఏడాది రిలీజ్ అయిన ‘పద్మావత్’ సినిమాలో హీరోలు షాహిద్ కపూర్, రణ్వీర్ సింగ్‌ల కంటే కూడా దీపికా పదుకోన్‌నే ఎక్కువ పారితోషికం (దాదాపు 13 కోట్లు) పుచ్చుకున్నారు. షాహిద్, రణ్‌వీర్‌లు చెరో 10 కోట్లు తీసుకున్నారట. ఈ విషయం గురించి దీపిక మాట్లాడుతూ – ‘‘నా మార్కెట్ గురించి నాకు తెలుసు. అందుకే ఎక్కువ పారితోషికం డిమాండ్ చేశాను’’ అన్నారు. తాజాగా ‘మణికర్ణిక’ సినిమా కోసం కంగనా రనౌత్ సుమారు 14కోట్లు దాకా తీసుకున్నారని టాక్. సాధార ణంగా కంగనా తీసుకునే పారితోషికం కంటే ఇది డబుల్ అట. స్క్రిప్ట్ బట్టి, అందులో పోషించాల్సిన పాత్ర బట్టి ఈ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్నారట కంగనా. పారితోషికం అనేది హీరో, హీరోయిన్ బట్టి కాకుండా మార్కెట్లో తమకున్న డిమాండ్‌ని, పాత్ర కోసం పడాల్సిన కష్టాన్ని బట్టి ‘భారితోషికం’ పుచ్చుకుంటున్నారు. పాత పద్ధతులకు ఫుల్స్టాప్ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది శుభ పరిణామమే అంటున్నారు సినీ విశ్లేషకులు. -
భారతీయ సినిమా పరువు తీసిన ప్రియాంక చోప్రా
-
పరువు తీసిన ప్రియాంక చోప్రా.. వీడియో వైరల్
నటి ప్రియాంక చోప్రా వరుసగా వివాదాల్లో చిక్కుకుంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా క్వాంటికో ఎపిసోడ్లో హిందువులను ఉగ్రవాదులుగా చూపించటం, అది కాస్త వివాదాస్పదంగా మారటం తెలిసిందే. దీంతో ఆమె క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియన్ సినీ ఇండస్ట్రీ పరువు తీసేలా ఆమె చేసిన వ్యవహారం తాలూకూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అవార్డుల వేడుకకు హాజరైన ప్రియాంక అక్కడి వ్యాఖ్యాతతో మాట్లాడుతూ... ‘భారతీయ సినిమాలు అంటే ఏం ఉండదు.. కేవలం నడుము(హిప్) మరియు పై భాగం(బూ*) ఆడించటమే. అక్కడి చిత్రాల్లో అలా స్టెప్పులేస్తే సరిపోతుంది’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. సరదాగా మూమెంట్స్ చేసి మరీ చూపించారు. తన క్రేజ్‌ను పెంచుకోడానికి దిగజారి భారతీయ చలన చిత్రపరిశ్రమ పరువు తీయాలా? అంటూ ఆమెపై మండిపడుతున్నారు. పాత వీడియోనే... అయితే తర్వాత అది 2016 ఎమ్మీ అవార్డు వేడుకల తాలూకూ వీడియో అన్నది తేలింది. అయినప్పటికీ ప్రస్తుతం ప్రియాంక వైఖరిపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. ఆ వీడియోను బయటకు దులిపిన కొందరు దానిని వైరల్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ ఆ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న యువత.. అదే స్థాయిలో కామెంట్లు కూడా చేస్తున్నారు. గతంలో అస్సాం రాష్ట్ర పర్యాటక శాఖకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న ఆమె.. టూరిజం క్యాలెండర్ కోసం చేసిన ఓ ఫోటో షూట్లో హాట్ హాట్‌గా ఫోజులివ్వగా, ఆ అంశం అసెంబ్లీని కుదిపేసింది కూడా. (నటి హాట్ ఫోటో.. అసెంబ్లీలో దుమారం) According to @priyankachopra - Bollywood in a Nutshell pic.twitter.com/nykaU9ZFnl — Rishi Bagree 🇮🇳 (@rishibagree) 9 June 2018 Indian movie is all about Hips and Boobs. According to mentality retired @priyankachopra. pic.twitter.com/fpzYD8IEQU — Hardik Bhatt 🧘♂️ (@iHardikB) 9 June 2018 I have just unfollowed @priyankachopra on Twitter and decided not to watch any of her movies/shows from now on. I request everyone to do the same. #BoycottPriyanka — Shusmita Rani 🇮🇳 (@ShusmitaRani) 9 June 2018 Humari billi hume hi meow .#Shame #PriyankaChopra #Quantico #quantico3 pic.twitter.com/vY8cgwqJM1 — Hunट₹₹♂ (@nickhunterr) 9 June 2018 Unexpected from Priyanka Chopra tbh describing our movies in that way is so so wrong ffs Indian movies are known for family drama & music & dance.. since when it is about boobs hips @priyankachopra which planet you live in? Cool banne ki ghatya koshish saali chutyaah. https://t.co/fRFiykPuPu — Zahra ♛ (@BreadAurJam) 9 June 2018 Disgusting of Priyanka Chopra to demean Bollywood. Bollywood makes worldclass movies. Even the recent ones like Dangal, Padman are fantastic. Looks like she has acted mostly in such low grade movies. https://t.co/qNzj5LrsUC — Arun Rao (@bigsanturi) 9 June 2018 Ha :@priyankachopra ne Bollywood me bahut boob's and hips hilayenge honge #castingcouch ke samne tabhi movies mili hogi😠😠😠😠 Insulting indian culture is her fashion now a days.. — Ticks (@ticks1301) 9 June 2018 Awesome! What else to expect from a wannabe firangan. So movie like Barfi where u were praised for your performance is also about that, right @priyankachopra ? Want to see how far ur arrogance with that irritating fake accent & plastic beauty will take u.Continue selling ur soul. https://t.co/9CWRMNZFRk — 🇮🇳 Shweta Singh (@swetassingh1) 9 June 2018 -
‘నో’ చెప్పడం నేర్చుకున్నా!
‘కెరీర్ బిగినింగ్ డేస్‌లో నేనూ క్యాస్టింగ్ కౌచ్‌ను ఫేస్ చేశాను’ అంటున్నారు బాలీవుడ్ హాట్ యాక్టర్ రాఖీ సావంత్. క్యాస్టింగ్ కౌచ్ ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో హాట్ టాపిక్. ఈ విషయం గురించి రాఖీ సావంత్ మాట్లాడుతూ –‘‘కెరీర్ స్ట్రగ్లింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు నేనూ క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాను. అలా అని అందరు దర్శకులు, నిర్మాతలను తప్పుపట్టడం లేదు. కేవలం కొందరిని మాత్రమే. అవును.. ఇండస్ట్రీలో సెక్సువల్ కరప్షన్ ఉంది. అయినా.. ఎక్కడ లేదని? నేను నా ట్యాలెంట్‌ని నమ్ముకున్నాను. అందుకే ఎక్కడా లొంగిపోలేదు. ‘నో’ చెప్పడం నేర్చుకున్నాను. ఆర్టిస్ట్‌గా ప్రూవ్ చేసుకోవడానికి నా ట్యాలెంట్‌ను ఉపయోగించుకున్నాను. స్ట్రగ్లింగ్ స్టేజ్‌లో ఉన్న ఆర్టిస్ట్‌లందరికీ నేను చెప్పేది ఒక్కటే. ఓపికగా ఉండండి. షార్ట్‌కట్స్‌కు టెంప్ట్ అవ్వకండి’’ అని పేర్కొన్నారు. -
ఉగ్రదాడులతో మాకు లింకేంటి: నటి
దాయాది దేశాల మధ్య జరుగుతున్న ఉగ్రవాద పోరు వల్ల పాకిస్తాన్ ఆర్టిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ అంటోంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో అల్లకల్లోల పరిస్థితులు కుదుటపడే వరకూ పాక్ ఆర్టిస్టులపై భారత్ లో తాత్కాలికంగా నిషేధం విధించగా.. బాలీవుడ్ కు చెందిన కొందరు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాను నటించిన 'నిల్ బట్టే సన్నాటా' మూవీకిగానూ ఉత్తమనటిగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా పాక్ ఆర్టిస్టుల ప్రస్తుత పరిస్థితిపై నోరువిప్పింది. మా నటీనటులకు రాజకీయాలతోగానీ, ఉగ్రదాడులతోగానీ ఎలాంటి సంబంధం లేదని, అయినా వారిని ఇందులోకి లాగుతున్నారని ఆమె పేర్కొంది. నిజం చెప్పాలంటే.. పాక్ కు చెందిన ఆర్టిస్టుల పరిస్థితి దారుణమని అభిప్రాయపడింది. కొన్ని నెలల కిందట పాక్ బెస్ట్ సింగర్లలో ఒకరైన అంజాద్ సాబ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. పాకిస్తాన్ ప్రజలు కూడా ఉగ్రవాదం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో రెండుసార్లు దాయాది దేశంలో పర్యటించిన స్వర భాస్కర్ తెలిపింది. పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఎక్కువగా విమర్శలపాలయ్యాడని చెప్పింది. ఇటీవల ఉడీలో ఉగ్రదాడి చేసి 19 మంది భారతీయ జవాన్లను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారని ఈ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించింది. పీఓకేలో భారత ఆర్మీ పటిష్టమైన సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి 38 మంది ఉగ్రవాదులను హతం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ నటులకు ఎలాంటి హానీ జరగకూడదని భావించిన భారతీయ సినీ ఇండస్ట్రీ పెద్దలు వారిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. -
పాక్ నటీనటులపై భారత్ నిషేధం!
దాయాది దేశాల మధ్య జరుగుతున్న ఉగ్రవాద పోరు సెగ పాకిస్తాన్ నటీనటులకు తాకింది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో అల్లకల్లోల పరిస్థితులు కుదుటపడే వరకూ పాక్ నటులపై భారత్ లో తాత్కాలికంగా నిషేధం విధించారు. తాజాగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) లోని భూభూగంలో భారత ఆర్మీ పటిష్టమైన సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. దీంతో భారత్-పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో కాస్త ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలో పాక్ నటులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదని భావించిన భారతీయ సినీ ఇండస్ట్రీ పెద్దలు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు పాక్ నటులు నటించిన రెండు బాలీవుడ్ మూవీలు త్వరలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో ప్రతికూల పరిస్థితులు తలెత్తకుండా చూడటంలో భాగంగా పాక్ నటీనటులపై తాత్కాలికంగా నిషేధం విధించారు. ఇటీవల జమ్ముకశ్మీర్ లో జరిగిన ఉడీ ఉగ్రదాడిలో 18 మంది భారతీయ జవాన్లు అమరులైన నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఎంఎన్ఎస్ పాక్ నటులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. 48 గంటల్లోగా పాక్ నటీనటులు దేశం విడిచి వెళ్తే అది వారికే మంచిదంటూ ఎంఎన్ఎస్ సభ్యులు హెచ్చరించారు. పీఓకేలో భారత ఆర్మీ జరిపిన దాడుల్లో దాదాపు 38 మంది ఉగ్రవాదులు హతమైనట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ ఇదివరకే వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రభుత్వం నిర్ణయించాలి.. మీరుకాదు: హీరో
ముంబయి: రెండు రోజుల్లో పాకిస్థాన్ కు చెందిన నటులు, టీవీ ఆర్టిస్టులు భారత దేశాన్ని విడిచి వెళ్లిపోవాలన్న మహారాష్ట్ర నవ నిర్మాణ సేన వ్యాఖ్యలపై ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ స్పందించారు. భారత్ లో ఎవరు పనిచేయాలి? ఎవరు పనిచేయకూడదు? అని చెప్పాల్సింది ఒక్క ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. టాలెంట్ ఉన్నవాళ్లందరికీ భారత చిత్ర పరిశ్రమ స్వాగతం పలుకుతుందని, ఆదరిస్తుందని అన్నారు. ఇది ఒక్క దేశ సరిహద్దుకే పరిమితం అని తాను అనుకోవడం లేదని చెప్పారు. ఉడీ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ ఉగ్రవాదం పై మండిపడుతూ ఆ దేశానికి చెందిన ఫవాద్ ఖాన్, మహీరా ఖాన్ తదితర పాక్ నటులంతా భారత్ ను 48గంటల్లో విడిచి వెళ్లాలని లేదంటే ఎలా వెళ్లగొట్టాలో తమకు తెలుసు అని వార్నింగ్ ఇచ్చారు. 'కళల సంస్కృతిని మార్చుకోవడం అనేది కచ్చితంగా ప్రోత్సహించాల్సిన విషయం. చిత్ర పరిశ్రమ అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టాలెంట్ ఉన్నవారికి తలుపులు తెరిచి ఉంచుతుంది. ముఖ్యంగా భారత్ తో సరిహద్దు ఉన్న దేశాలకు కూడా. అయితే, ఇలాంటివన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. మేమంతా నటులం.. మేం ప్రేమ, శాంతి గురించి మాట్లాడతాం. చట్టం ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం చేస్తుంది' అంటూ జీక్యూ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పంపిణీ కార్యక్రమంలో సైఫ్ చెప్పారు. -
దేశం మారింది! సినిమా మారింది!
రీల్ టు డిజిటల్ వివిధ భాషల్లో ఏటా వెయ్యికి పైగా సినిమాలను నిర్మిస్తూ, 300 కోట్ల పైచిలుకు ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తున్న ఘనత భారతీయ సినీ రంగానిది. ఆదాయం లెక్కల సంగతి పక్కనపెడితే, ఈ రకంగా మనది ప్రపంచంలోని అతి పెద్ద వినోద పరిశ్రమ. స్వాతంత్య్రం అనంతరం ఈ ఏడు దశాబ్దాల్లో భారత సినీ పరిశ్రమలో వచ్చిన నిర్మాణ, సాంకేతిక పరిణామాలు అనేకం. 1913లో దాదాసాహెబ్ ఫాల్కే తీసిన మూకీ ‘రాజా హరిశ్చంద్ర’ తొలి స్వదేశీ కథాకథనాత్మక చిత్రం. అప్పటి నుంచి 1931లో తొలి భారతీయ టాకీ ‘ఆలమ్ ఆరా’ వచ్చే దాకా అన్నీ మాటలు లేని సినిమాలే. 1940 తొలి నాళ్ల దాకా చిత్రీకరణ సమయంలో నటిస్తూ నటీనటులు స్వయంగా పలికిన మాటలు, పాటలనే ఫిల్మ్‌పై రికార్డ్ చేసేసేవారు. ఆ తరువాత డైలాగుల్ని విడిగా రికార్డు చేసే డబ్బింగ్ ప్రక్రియ, ప్లేబ్యాక్ సిస్టమ్ వచ్చేశాయి. ఇప్పుడు మళ్లీ సెట్లో నటిస్తున్నప్పుడే డైలాగ్‌లు కూడా రికార్డు చేసేసే పద్ధతి ‘సింక్ సౌండ్’ పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చింది. నాడు షూటింగ్ అంటే బండ బరువుండే డెబ్రీ, మిచెల్ తరహా కెమేరాలతోనే! నేడు బరువు తక్కువ యారీఫ్లెక్స్ కెమేరాలు, ఒంటికి తగిలించుకొనే ‘స్టడీ కామ్’లు వచ్చాయి. స్వాతంత్య్రం తర్వాత 35 ఎంఎం నుంచి సినిమా స్కోప్, 70 ఎం.ఎం, ఆపైన అద్దాలు పెట్టుకొని చూసే 3డీ సినిమాలు తయారయ్యాయి. డాల్బీ, డీటీఎస్, డాల్బీ ఎట్మాస్ల పేరిట సౌండ్ ఎఫెక్ట్లూ అదిరిపోతున్నాయి. అప్పట్లో సినిమాను ముడి ఫిల్ముపై చిత్రీకరించేవారు. ఎన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించాలంటే, అన్ని ప్రింట్లు తీయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఫిల్మ్ అక్కర్లేదు... హార్డ్ డిస్క్ ఉంటే చాలు. డిజిటల్ చిత్రాన్ని శాటిలైట్ ద్వారా థియేటర్లకు పంపి, ప్రొజెక్టర్ల ద్వారా ప్రదర్శిస్తున్నారు. నాడు ఊరూరా తిరుగుతూ, డేరాలు వేసి సినిమాలు ప్రదర్శించేవారు. టాకీలొచ్చాకా టూరింగ్ టాకీస్‌లే ఎక్కువ. క్రమంగా పర్మినెంట్ థియేటర్లు వచ్చాయి. 1927లో 309 హాళ్లుంటే... 1947లో సుమారు 2 వేల థియేటర్లుండేవి. ప్రస్తుతం మల్టీప్లెక్స్‌లు, ఐ-మ్యాక్స్‌లు... వెరసి దేశంలో నేడు 14 వేల సినిమా స్క్రీన్స్ ఉన్నట్లు అంచనా. -
ఇది ఇంకో షోలే
భారతీయ సినిమా రంగంలో షోలే స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. 1975 ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా దాని నిర్మాత, దర్శకులకు ఎన్ని వందల కోట్లు ఆ రోజుల్లోనే కలెక్ట్ చేసి పెట్టిందో ఎవరి ఊహకూ అందదు. అంతులేని సంపదను ఇప్పటికీ షోలే అందిస్తూనే ఉంది. ఎందరో నిర్మాతలకు, దర్శకులకు స్ఫూర్తినిచ్చిన ఈ సినిమా 40 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 40 విడ్డూరాలు తెలుసుకుందాం. ►షోలే దర్శకుడు రమేశ్ సిప్పి నిర్మాత జి.పి.సిప్పీ కుమారుడు. అందాజ్ (1971), సీతా ఔర్ గీతా (1972) తీశాడు. తండ్రీ కొడుకులు ఇద్దరూ కలిసి ఈసారి భారీ సినిమా తీద్దాం అని నిర్ణయించుకోవడంతో షోలేకు అంకురార్పణ జరిగింది. ►సిప్పీలు సింథీలు. స్వస్థలం కరాచి. జి.పి.సిప్పీ కాశ్మిర్ నుంచి కార్పెట్లు తెచ్చి అమ్మేవాడు. ఆ తర్వాత బిల్డర్ అయ్యి డబ్బు సంపాదించి నిర్మాతగా మారాడు. ►రచయితలు సలీమ్-జావేద్ అప్పటికి ఇంకా గొప్ప పేరులోకి రాలేదు. కొన్ని కథల నుంచి ఒక కథను తయారు చేయడంలో సిద్ధహస్తులు. మన రాముడు- భీముడును తిరగేసి సీతా-గీత స్క్రిప్ట్ రాశారు. ఆ టాలెంట్ కనిపెట్టి వీరిద్దరినీ ఒక నెల పాటు కూచోబెట్టి రమేష్ సిప్పి ఈ కథను తయారు చేయించాడు. ► ‘వీరూ’ పాత్రకు ధర్మేంద్ర ముందే ఖాయమయ్యాడు. అయితే ‘జయ్’ పాత్ర శతృఘ్నసిన్హాను వరించాల్సింది. అమితాబ్‌కు రాసిపెట్టి ఉంది. అయితే ఇందులో ధర్మేంద్ర రికమండేషన్, జయబాధురి వేడుకోలు ఉన్నాయని అంటారు. ►గబ్బర్ సింగ్ అనే బందిపోటు 1950లలో నిజంగానే ఉండేవాడు. సలీమ్ తండ్రి గ్వాలియర్ ప్రాంతంలో పోలీస్ కావడం వల్ల ఆయన ద్వారా సలీమ్‌కు బందిపోట్ల కథలు తెలుసు. అలా ఆ పాత్ర వచ్చింది. దీనికి ముందు డేనీ డెంజోప్పాని అనుకున్నారు. కాని కొత్త నటుడు అంజద్‌ఖాన్ దీని కోసం ఇది వరకే పుట్టి ఉన్నాడు. ►షోలే కంటే ముందే హిందీలో అలాంటి కథాంశంతో ‘ఖోటే సిక్కే’, ‘మేరా గావ్ మేరా దేశ్’ సినిమాలు వచ్చాయి. ఆ రెండూ చూసినవారికి షోలే చూడటంలో థ్రిల్ కొంచెం తగ్గుతుంది. ►షోలే ఆదాయంలో కొంతభాగం నిజానికి జపాన్ దర్శకుడు అకిరా కురసావాకు దక్కాలి. షోలేకు మూలం లాంటి ‘సెవన్ సమురాయ్’ ఆయనే తీశాడు. ►షోలే డైలాగ్స్ రాసింది జావేద్ అక్తర్. కాని సినిమా మొత్తాన్ని ఆలోచించింది సలీమ్. పని విభజన అలా జరిగిందని తెలుసుకోవాలి. ►నిజజీవితంలో హేమమాలిని చాలా తక్కువ మాట్లాడుతుంది. జయబాధురి వాగుడుకాయ. షోలేలో ఈ స్వభావాలకు పూర్తి భిన్నమైన పాత్రలను వాళ్లిద్దరూ పోషించారు. ►షోలేలో నటించిన అమితాబ్, జయబాధురి అప్పటికే దంపతులు. ధర్మేంద్ర, హేమమాలిని సినిమా విడుదలైన 5 సంవత్సరాలకు పెళ్లి చేసుకున్నారు. ►బందిపోటు సినిమాలను అప్పటి వరకూ చంబల్లోయలో తీయడం ఆనవాయితీ. రమేష సిప్పీ దీనిని నిరాకరించడంతో ఆర్ట్ డెరైక్టర్ రామ్ ఎదేకర్ దేశమంతా ఒక కారేసుకుని తిరిగి బెంగుళూరు మైసూరు దారిలో ఉన్న కొండప్రాంతాన్ని ఎంపిక చేశారు. షోలే భక్తులు ఇప్పటికీ ఆ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. అక్కడ రామ్‌నగర్ అనే ఊరు కూడా ఉంది. ►షోలేను 1973లో మొదలుపెట్టి రెండున్నరేళ్లు తీశారు. గబ్బర్ అసిస్టెంట్ ‘సాంబ’ పాత్రను పోషించిన మెక్ మోహన్ లాంటి నటుడు ముంబై నుంచి బెంగుళూరుకి 26 సార్లు తిరగాల్సి వచ్చింది. ►సినిమాటోగ్రాఫర్ ద్వారకా ద్వివేచాకు పర్ఫెక్షనిస్ట్ అని పేరు. రాజీపడేవాడు కాదు. అరవైఏళ్లు పైబడిన ఆయన ఈ షూటింగ్ సమయంలో స్థానికంగా ఉండే ఒక ఇరవై ఏళ్ల అమ్మాయి ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నాడు. ►యూనిట్ బస చేసిన బెంగుళూరులో రోజూ పార్టీలు జరిగేవి. అందరికంటే ఎక్కువ తాగడం మేల్కోవడం అనే బాధ్యత సంజీవ్ కుమార్ తీసుకునేవాడు. ►షోలేలో చిన్న పాత్రలు వేసినవాళ్లకు చిరకీర్తి లభించింది. కాలియా పాత్రను ధరించిన విజూ ఖోటే ఈ పాత్ర వల్లే ఇండస్ట్రీలో కొనసాగాడు. ►ముస్లిం ఇమామ్ పాత్ర పోషించిన కె.ఎ.హంగల్‌కు చాలా పేరు వచ్చింది. అయితే హంగల్ ఆ పాత్రను అలా కాకుండా వేరేలా చేసి ఉండాల్సిందనే అసంతృప్తితోనే చివరి వరకూ గడిపాడు. ►జయబాధురి దీపాలు వెలిగించే సీన్ సినిమాలో ఒకటి రెండు నిమిషాలు ఉంటుంది. కాని దానిని పందొమ్మిది రోజులు తీశారు. ►షోలేలో హింస ఉంది కాని రక్తం కనపడదు. ఠాకూర్ మనవణ్ణి గబ్బర్‌సింగ్ కాల్చడం ఇందులో చాలా కలచివేసే దృశ్యం. కాని శవాన్ని చూపించరు. చీమను చంపడం ద్వారా ఇమామ్ కొడుకైన సచిన్‌ను చంపినట్టు సజెస్టివ్గా చూపిస్తాడు దర్శకుడు. ►రామ్‌లాల్ పాత్ర వేసిన సత్యన్‌కు ఇండస్ట్రీలో చాలా గౌరవం ఉండేది. ఆయన లెఫ్టిస్ట్. సినీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేసేవాడు. ►షోలే కోసం హాలీవుడ్ స్టంట్స్మెన్ ఇద్దరు వచ్చి పని చేశారు. వాళ్లు తెచ్చిన సేఫ్టీ ఎక్విప్మెంట్ వల్లే ప్రమాదాలు లేకుండా ఆ పోరాటాలన్నీ తీయగలిగారు. ►సూర్మా భోపాలి పాత్రను వేసిన జగ్దీప్ పాత్ర ఎంత ఫేమస్ అంటే చివరకు ఆ పేరుతోనే అతడు హీరోగా యాక్ట్ చేసి సినిమా తీశాడు. ►జైలర్ పాత్ర అస్రానీకి చాలా పేరు తెచ్చింది. ఇప్పటికీ అలాగే నటించమని అతణ్ణి దర్శకులు పీక్కుతింటుంటారు. ►మౌసీ దగ్గరకు వెళ్లి ధర్మేంద్రతో బసంతి పెళ్లి గురించి అమితాబ్ మాట్లాడే సీన్ చాలా హిలేరియస్‌గా ఉంటుంది. కాని అది కిశోర్ కుమార్ నటించిన హాఫ్ టికెట్ సినిమాలోని సీన్‌కు కాపీ. ►ధర్మేంద్ర వాటర్ ట్యాంకర్ మీదెక్కి గోల చేసే సీన్‌ను బెంగుళూర్ ఎయిర్‌పోర్ట్‌లో జావేద్ అక్తర్ హడావిడిగా రాసిచ్చి బొంబాయి ఫ్లయిట్ ఎక్కాడు. ►సినిమాకు రాసిన ప్రతీ డైలాగ్ హిట్టే. జో డర్ గయా సంఝో మర్గయా... తేరా క్యా హోగా కాలియా.... యే హాత్ ముఝే దేదే ఠాకూర్... బసంతీ... ఇన్ కుత్తోంకే సామ్నే మత్ నాచ్నా.... ప్రతిదీ హిట్టే. ►షోలే విడుదలయ్యాక మొదటి రెండు వారాలు సూపర్ ఫ్లాప్. ప్రొడ్యూసర్ పారిపోబోతున్నాడనే పుకార్లు రేగితే ఫైనాన్షియర్లు ఎయిర్పోర్ట్ దగ్గర జి.పి.సిప్పీ కోసం కాపు కాచారు. ►{పివ్యూ చూసి షోలేను రాజ్‌కపూర్ కూడా అంచనా వేయలేకపోయాడు. మొదటి పది నిముషాల్లోనే అంత పెద్ద ట్రైన్ రాబరీ పెట్టేయడం ఆయనకు మింగుడు పడలేదు. ►బ్లాక్ టికెట్లు అమ్ముకున్నవాళ్లు ఈ సినిమాతో సెటిలైపోయారని అంటారు. ►సినిమా ఫ్లాపైతే తమ మీదకు ఎక్కడ వస్తుందోనని జావేద్ అఖ్తర్‌లు భయపడ్డారు. ఎందుకైనా మంచిదని అంజద్‌ఖాన్ మీద నెపం వెతుక్కున్నారు. ఒకవేళ ఫ్లాప్ అయితే అతని యాక్టింగ్ వీక్‌గా ఉండటం వల్లే పోయింది అని చెప్పాలనుకున్నారు. కాని సినిమా రిలీజయ్యి అంజాద్ ఖాన్‌కు ఎక్కడ లేని కీర్తి తెచ్చి పెట్టింది. అయితే వీళ్ల పథకం తెలిసిన అంజాద్ ఖాన్ మనసు కష్టపెట్టుకుని ఆ తర్వాత జావేద్ అఖ్తర్‌లు రాసిన ఏ సినిమాలోనూ పని చేయలేదు. ►ధర్మేంద్ర మెయిన్‌రోల్ వేసిన సినిమాల్లో అమితాబ్ యాక్ట్ చేశాడు తప్ప అమితాబ్ మెయిన్ రోల్ వేసిన సినిమాల్లో ధర్మేంద్ర యాక్ట్ చేయలేదు. షోలేలో ధర్మేంద్రదే మెయిన్ రోల్. ►ఆర్.డి.బర్మన్ ఈ సినిమాకు ఇచ్చిన రీరికార్డింగ్ పెద్ద హిట్. ఏ దోస్తీ పాట స్నేహానికి ఒక జాతీయ గీతంలా స్థిరపడింది. ►షోలేలో రఫీ ఒక్క పాట కూడా పాడలేదు. ►మెహబూబా... మెహబూబా... పాట మొదట ఆశాభోంస్లేతో అనుకున్నారు. కాని ఆర్.డి.బర్మన్ పాడాడు. హెలన్ డాన్స్ చేసింది. పాటగాడిగా జలాల్ ఆగా యాక్ట్ చేశాడు. అప్పటికే ఆమె సలీమ్‌తో ప్రేమలో ఉంది. ►స్టీరియోఫొనిక్లో తీయడం వల్ల సినిమా చివర్లో అమితాబ్ కాయిన్ విసిరితే ప్రేక్షకులు కుర్చీల కింద వెతికేవారు. ►షోలేలో ధర్మేంద్ర, అమితాబ్‌లు వాడిన బట్టలు రెండు మూడు జతలకు మించి ఉండవు. ►షోలేని కాస్త అటూ ఇటూ మార్చి శోభన్‌బాబుతో కక్ష తీశారు. ఈ కథను గుహనాథన్ తయారు చేశాడు. ►షోలేలోని కొన్ని సన్నివేశాలు అడవి రాముడులో కనిపిస్తాయి. ►షోలేకి రామ్‌గోపాల్ వర్మ ఎంత వీరాభిమాని అంటే దానిని రీమేక్ చేసి ఎక్కడలేని అప్రతిష్ట మూటగట్టుకున్నాడు. ►షోలే సినిమా వల్లే పవన్ కల్యాణ్‌కు గబ్బర్‌సింగ్ అనే హిట్ సినిమా టైటిల్ దొరికింది. ►విలన్‌ను కాళ్లు చూపిస్తూ ఇంట్రడ్యూస్ చేయడం ఆ తర్వాత వందలాది సినిమాలో విలన్లకూ హీరోలకూ అనుకరించారు. -
‘మరో చరిత్ర’ ముగిసింది
-
‘మరో చరిత్ర’ ముగిసింది
* దర్శక శిఖరం కె. బాలచందర్ ఇక లేరు * అస్వస్థతతో చెన్నైలో కన్నుమూత * సినీ చరిత్రకే మకుటాయమానమైన చిత్రాలను తీసిన కేబీ * ‘మేజర్ చంద్రకాంత్’ నాటకంతో రంగస్థలంపై తొలి గుర్తింపు * మరోచరిత్ర, అంతులేనికథ, ఆకలిరాజ్యం వంటి ఎన్నో మరపురాని చిత్రాలకు దర్శకత్వం * దర్శక శిఖరం మృతితో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి సాక్షి, చెన్నై, హైదరాబాద్: మరో చరిత్ర ముగిసింది.. రుద్రవీణ మూగబోయింది.. భారత సినీ పరిశ్రమలో ధ్రువతారగా వెలిగిన దర్శక శిఖరం నేలకొరిగింది.. చిత్ర పరిశ్రమకు మకుటాయమానంగా వెలిగిన కైలాసం బాలచందర్(84) తుదిశ్వాస విడిచారు. కొద్ది రోజులుగా అస్వస్థతతో బాధపడుతున్న ఆయన మంగళవారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తమిళనాడులోని తిరువారూర్ (గతంలో తంజావూరు జిల్లా) జిల్లా నన్నిలం గ్రామంలో దండపాణి కైలాసం, సరస్వతి దంపతులకు 1930, జూలై 9న బాలచందర్ జన్మించారు. 1956లో రాజంను వివాహమాడారు. వీరికి ఇద్దరు కుమారులు (కైలాసం, ప్రసన్న), ఓ కూతురు(పుష్పా కందసామి). అనారోగ్యంతో పెద్ద కుమారుడు కైలాసం ఇటీవల మృతి చెందడంతో బాలచందర్ బాగా కుంగిపోయారు. అదే బెంగతో అస్వస్థతకు గురై ఈనెల 15న ఆస్పత్రిలో చేరారు. చిన్నతనం నుంచే నాటకాలు, చిత్రాలపై మక్కువ పెంచుకున్న బాలచందర్‌పై.. త్యాగరాజ భాగవతార్ సినిమాలు ప్రభావం చూపాయి. బాలచందర్ మృతితో సినీలోకం దిగ్భ్రాంతికి గురైంది. 12 ఏళ్ల ప్రాయంలోనే నటన వైపు... తమిళ, తెలుగు సినిమాను వైవిధ్య భరితమైన కథాంశాలతో ఓలలాడించిన దర్శక వైతాళికుడు కె.బాలచందర్(కేబీ) తన 12 ఏళ్ల ప్రాయంలోనే నటనవైపు అడుగులు వేశారు. ఒక నాటిక సమాజంలో సభ్యుడిగా చేరి పేరు తెచ్చుకున్నారు. అన్నామలై యూనివర్సిటీ ద్వారా 1949లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసి 1950లో తిరువారూరు జిల్లా ముత్తుపేటలో టీచర్‌గా పనిచేశారు. తర్వాత 1956లో చెన్నైలోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో సాధారణ అకౌంటెంట్‌గా చేరారు. అదే ఏడాది రాజంను పెళ్లిచేసుకున్నారు. ఆ సమయంలో యునెటైడ్ అమెరికన్ ఆర్టిస్ట్ (మద్రాసు) నాటక కంపెనీలో సభ్యుడిగా చేరి కొద్ది కాలంలోనే సొంతంగా నాటక బృం దాన్ని ఏర్పరుచుకున్నారు. స్వీయ దర్శకత్వంలో అనేక నాటక ప్రదర్శనలు ఇచ్చి రంగస్థల ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ఆయన రచించిన ‘మేజర్ చంద్రకాంత్’ నాటకంతో రంగస్థలంలో గుర్తిం పు తెచ్చుకున్నారు. ఎంజీ రామచంద్రన్ హీరోగా నటించిన ‘దైవత్తాయ్’ చిత్రానికి డైలాగ్ రైటర్‌గా 1965లో సినీ పరిశ్రమకు పరిచయమయ్యూరు. ఆ తర్వాత ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత ఏవీ మెయ్యప్పన్ ప్రోత్సాహంతో ‘సర్వర్ సుం దరం’ చిత్రానికి స్క్రిప్ట్ సహకారం అందించారు. 1965లో ‘నీర్కుముళి’తో దర్శకుడిగా మారారు. 1981లో కవితాలయా ప్రొడక్షన్స్‌ను సొంతంగా స్థాపించి తమిళం, తెలుగు, కన్నడం, హిందీ భాషల్లో ఎన్నో చిత్రరాజాలను ప్రేక్షకులకు అందించారు. దర్శకుడిగా 101 సినిమాలు.. స్టార్ హీరోలతో సినిమాలు చేయడం బాలచందర్‌కి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. తన కథలు స్టార్లకు నప్పవని, వాళ్ల డేట్స్, కాలపరిమితికి లోబడి పనిచేయడం తన వల్ల కాదని కరాకండీగా చెప్పేవారు. సాధ్యమైనంత వరకూ కొత్తవారితోనే పని చేసేవారు. దాదాపు వందకు పైచిలుకు కొత్త నటులను తెరకు పరిచయం చేసిన ఘనత ఆయనదే. దర్శకుడిగా 101 సినిమాలు చేశారాయన. వాటిలో తమిళంలోనే దాదాపు 80 సినిమాలుంటాయి. అన్నీ ఆణిముత్యాలే. బాలచందర్ సినిమాల్లో కాలం కోరల్లో నలిగిపోతున్న సగటు జీవితాలు కనిపిస్తాయి. సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యనూ 1970ల్లోనే వెండితెరపై ఆవిష్కరించిన సృజనశీలి బాలచందర్. నిరుద్యోగం, అంటరానితనం, కట్టుబాట్లు, వ్యసనాలు, మూఢనమ్మకాలు, తదితర సామాజిక రుగ్మతలపై ఎన్నో సినిమాలు తీశారు. దర్శకుడు బాలచందర్ చాలా జానర్లు స్పృశించలేకపోవచ్చు. కానీ ఆయన తెరకెక్కించిన చిత్రాలన్నీ అన్ని వర్గాలను రక్తికట్టించాయి. సగటు జీవితాలు ఎదుర్కొంటున్న సున్నిత సమస్యల్ని ఆయన ఎంత సునిశితంగా చూస్తారో చెప్పడానికి ‘అం తులేని కథ’ ఓ మచ్చుతునకగా మిగిలిపోతుంది. తెలుగులో ఆయన భలే కోడళ్లు, సత్తెకాలపు సత్తెయ్య, బొమ్మా బొరుసా, అంతులేని కథ, మరో చరిత్ర, ఇది కథ కాదు, గుప్పెడు మనసు, ఆకలిరాజ్యం, అందమైన అనుభవం, తొలికోడి కూసింది, కోకిలమ్మ, రుద్రవీణ వంటి ఆణిముత్యాలను తెరకెక్కించారు. రజనీ కాంత్‌ని ‘అపూర్వరాగంగళ్’తో వెండితెరకు పరిచయం చేసింది బాలచందరే. ‘మరో చరిత్ర’ ద్వారా కమల్‌హాసన్, సరితలను హీరోహీరోయిన్లుగా పరి చయం చేశారు. మణిరత్నం దర్శకత్వంలో ‘రోజా’ చిత్రాన్ని నిర్మించి, సినీ లోకానికి స్వరమాంత్రికుడు ఏఆర్ రెహమాన్ పరిచ యం చేసిన ఘనత బాలచందర్దే. ‘డ్యూయెట్’ చిత్రం ద్వారా ప్రకాశ్‌రాజ్‌ను వెలుగులోకి తెచ్చారు. నటుడిగా.. : దర్శకుడిగా ఖ్యాతిపొందినా అప్పుడప్పుడూ నటుడిగా కూడా కనిపించారు బాలచందర్. చిన్నచిన్న పాత్రలతో ఐదు సినిమాల్లో నటుడిగా ప్రేక్షకులకు దర్శనమిచ్చారు. ‘రెట్టైసుళి’ అనే తమిళ చిత్రంలో ప్రధాన పాత్ర చేసి మెప్పిం చారు. ప్రస్తుతం కమల్‌హాసన్ హీరోగా రూపొందిస్తున్న ‘ఉత్తమ విలన్’ చిత్రంలో కూడా బాలచందర్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది. ఎన్నెన్నో అవార్డులు... పద్మశ్రీ(1987), దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు(2011), జాతీయ అవార్డు(2013), పలు ఫిలింఫేర్ అవార్డులు, అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డు, తమిళనాడు ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక కలైమామణి పురస్కారాలు బాలచందర్‌ను వరించాయి. ఇవిగాక ప్రైవేటు సంస్థలు అందజేసిన అవార్డులు కోకొల్లలు. సినిమాలకు దూరమైన దశలో ఎన్నో టీవీ సీరియళ్లకు దర్శకత్వం అందించారు. -
వెండి తెరపై జయరాజసం
బాలీవుడ్లో మన ‘జయ’కేతనాన్ని ఎగురవేసిన తొలితరం నటుడు. భారతీయ చలనచిత్ర రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న తొలి తెలుగుసినీప్రముఖుడు కూడా ఆయనే. కరీంనగర్ బిడ్డ అయిన పైడి జయరాజ్ చదువు సంధ్యలు సాగింది హైదరాబాద్‌లోనే. నాటి హైదరాబాద్, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్లో 1909 సెప్టెంబర్ 28న జయరాజ్ జన్మించారు. ఆయన చదువు సంధ్యలన్నీ హైదరాబాద్‌లోనే సాగాయి. నిజాం కాలేజీలో ఆయన డిగ్రీ చదువుకున్నారు. టాకీలు ఇంకా ప్రారంభం కాని ఆ కాలంలోనే ఆయనకు సినిమాలపై మక్కువ ఏర్పడి, 1929లో బాంబే చేరుకున్నారు. మూకీ సినిమా ‘స్టార్ క్లింగ్ యూత్’ ఆయన తొలిచిత్రం. ‘ట్రయాంగిల్ ఆఫ్ లవ్’, ‘మాతృభూమి’, ‘ఆల్ ఫర్ లవర్’, ‘మహా సాగర్ మోతీ’, ‘ఫ్లైట్ ఇన్టు డెత్’, ‘మై హీరో’ వంటి పదకొండు మూకీ సినిమాల్లో జయరాజ్ నటించారు. 1931లో ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఏకకాలంలో రూపొందించిన ‘షికారీ’ ఆయన తొలి టాకీ చిత్రం. అక్కడి నుంచి జయరాజ్ వెనుదిరిగి చూసుకోలేదు. ఆనాటి నట దిగ్గజాలు పృథ్వీరాజ్ కపూర్, శాంతారామ్, మోతీలాల్ వంటి వారికి దీటుగా దాదాపు రెండు దశాబ్దాల పాటు యాక్షన్ హీరోగా బాలీవుడ్లో ఓ వెలుగు వెలిగారు. నిరూపా రాయ్, శోభనా సమర్థ్, షకీలా, శశికళ, దేవికారాణి, మీనాకుమారి, చాంద్ ఉస్మానీ, జేబున్నీసా, ఖుర్షీద్ వంటి హీరోయిన్ల సరసన ఆయన నటించిన చిత్రాలు ఘనవిజయం సాధించాయి. చారిత్రక పాత్రలతో చెరగని ముద్ర మంచి శరీర దారుఢ్యానికి స్ఫురద్రూపం తోడవడంతో చారిత్రక పాత్రల్లో జయరాజ్ అద్భుతంగా రాణించగలిగారు. రూప దారుఢ్యాలకు మించి అద్భుతమైన అభినయంతో చారిత్రక పాత్రలతో ఆయన ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. రాజ్పుటానీ, షాజహాన్, అమర్‌సింగ్ రాథోడ్, వీర్ దుర్గాదాస్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణాప్రతాప్, టిప్పు సుల్తాన్, రజియా సుల్తానా, అల్లావుద్దీన్, జై చిత్తోడ్, రాణా హమీర్ వంటి పాత్రలు ఆయనను తిరుగులేని యాక్షన్ హీరోగా నిలిపాయి. అదేకాలంలో మజ్దూర్, షేర్దిల్ ఔరత్, జీవన్ నాటక్, తూఫానీ ఖజానా, మధుర్ మిలన్, ప్రభాత్, మాలా, స్వామి, నయీ దునియా, నయీ కహానీ, హమారీ బాత్, ప్రేమ్ సంగీత్ వంటి సాంఘిక చిత్రాల్లోనూ రాణించారు. మొహర్, మాలా (1943), ప్రతిమా, రాజ్‌ఘర్, సాగర్ (1951) వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ‘సాగర్’ చిత్రాన్ని స్వయంగా నిర్మించారు. వయసు మళ్లిన తర్వాత కేరక్టర్ యాక్టర్‌గా పలు చిత్రాల్లో ప్రధాన పాత్రలు పోషించారు. షోలే, ముకద్దర్ కా సికందర్, డాన్, ఫిఫ్టీ ఫిఫ్టీ వంటి బ్లాక్‌బస్టర్స్‌లో కీలక పాత్రలు ధరించారు. ‘గాడ్ అండ్ గన్’ ఆయన చివరి చిత్రం. తెలుగువాడైన జయరాజ్ హిందీ, ఇంగ్లిష్, ఉర్దూ, మరాఠీ, గుజరాతీ చిత్రాల్లో నటించినా, ఒక్క తెలుగు సినిమాలోనూ నటించలేదు. తెలుగు సినీరంగం సైతం ఆయనను పట్టించుకోకపోవడమే విషాదం. అయితే భారత సినీరంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర ప్రభుత్వం 1980లో పద్మభూషణ్ అవార్డునిచ్చింది. అదే ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా జయరాజ్‌ను వరించింది. చరమాంకం విషాదకరం దాదాపు ఆరున్నర దశాబ్దాల నట జీవితాన్ని విజయవంతంగా గడిపిన జయరాజ్‌కు చరమాంకం మాత్రం విషాదమే. పంజాబీ మహిళ సావిత్రిని పెళ్లాడిన ఆయనకు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. ఆస్తి కోసం కొడుకు దిలీప్‌రాజ్ వేధింపులకు దిగడంతో భరించలేక వార్ధక్యంలో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. సొంత ఫ్లాట్‌పై జయరాజ్‌కే అధికారం ఉంటుందని, కొడుకు దిలీప్ రాజ్ రోజుకు ఒకసారి చూసిపోవడం తప్ప అక్కడ ఉండేందుకు వీలులేదని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత జయరాజ్ ఎన్నాళ్లో బతకలేదు. 2000 ఆగస్టు 11న తుదిశ్వాస విడిచారు. - పన్యాల జగన్నాథదాసు