
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ 2014లో ఫగ్లీ సినిమాతో కెరీర్ ప్రారంభించింది.

తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లోనూ నటించింది.

చివరగా సత్యప్రేమ్ కీ కథ మూవీలో నటించిన ఈ బ్యూటీ ప్రస్తుతం వార్ 2, గేమ్ ఛేంజర్ చిత్రాల్లో నటిస్తోంది.

ఇండస్ట్రీలో అడుగుపెట్టి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.






