
అరవింద్ స్వామి
‘సరిలేరు నీకెవ్వరు’ వంటి హిట్ మూవీ తర్వాత మహేశ్‌బాబు హీరోగా చేస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. కీర్తీ సురేశ్ కథానాయికగా నటించనున్నారు. మైత్రీ మూవీస్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, 14రీల్స్ ప్లస్ పతాకాలపై నవీన్ యర్నేని, రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రతినాయకునిగా నటించేది ఎవరనే విషయంపై చిత్రబృందం ఇప్పటివరకూ క్లారిటీ ఇవ్వలేదు. విలన్ పాత్రకు ముందు ఉపేంద్ర, ఆ తర్వాత సుదీప్ పేర్లు వినిపించగా తాజాగా అరవింద్ స్వామి పేరు వినిపిస్తోంది. రామ్‌చరణ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ధృవ’ సినిమాలో స్టయిలిష్ విలన్‌గా మెప్పించారు అరవింద్ స్వామి. ఇప్పుడు ‘సర్కారువారి పాట’ చిత్రంలోనూ మహేశ్‌కి ప్రతినాయకునిగా ఆయనే నటించనున్నారనే వార్తలు ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment