![Photo Viral: Director Parasuram Simplicity Wins Hearts - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/4/mahesh.jpg.webp?itok=uFFqUXme)
పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన పరశురామ్ యువత చిత్రంతో దర్శకుడిగా మారాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన సర్కారు వారి పాటకు దర్శకత్వం వహిస్తున్నాడు. మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ క్రమంలో సెట్స్‌లో సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న కీర్తి ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సెట్స్‌లో గొడుగు నీడన నడుస్తున్న మహేశ్ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: జనగణమన: మహేశ్ నుంచి పవన్‌కు!)
కానీ ఈ ఫొటోను చూసిన వెంటనే అందరూ మహేశ్‌కు బదులు డైరెక్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. మండుటెండను లెక్క చేయకుండా, తన హోదాను పక్కనపెట్టి మరీ ఏదో స్క్రిప్ట్ చూసుకుంటూ నేలమీద కూర్చుండిపోయాడు పరశురామ్. నిజానికైతే అక్కడున్న బాయ్స్‌ను పిలిచి కుర్చీ తెమ్మని పిలవచ్చు, తనకో గొడుగు పట్టమని అడగనూవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. పనిలో మమేకమై అలాంటివేవీ పట్టించుకోకుండా ఎర్రటి ఎండలోనే మట్టి మీద కూర్చుండిపోయాడు. ఇక ఆయన సింప్లిసిటీ చూసిన జనాలు పరశురామ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎంత శ్రద్ధ!, ఎంత నిబద్ధత! అని కొనియాడుతున్నారు. (చదవండి: సంక్రాంతికి వస్తున్న 'సర్కారు వారి పాట')
Comments
Please login to add a commentAdd a comment