
‘‘సర్కారువారి పాట’ కథ అనుకున్నప్పుడే మహేశ్‌గారి కెరీర్‌లో పెద్ద హిట్ అవ్వాలని భావించాం. మేము ఊహించినట్లే సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డానో మహేశ్‌గారికి తెలుసు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం ఆనందంగా ఉంది’’ అని డైరెక్టర్ పరశురాం అన్నారు. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది.
ఈ సందర్భంగా పరశురాం బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా సినిమా రిలీజైన రోజు ఉదయం మహేశ్‌గారు ఫోన్ చేసి, ‘అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది.. కంగ్రాట్స్’ అన్నారు. దర్శకులు సుకుమార్, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్‌గార్లు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ‘మహేశ్‌గారిని ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు.. బాగా చూపించారు’ అని ఆయన అభిమానులు ఫోన్ చేసి, ఆనందపడ్డారు. కథ చెప్పడంలో ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో శైలి. ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తూ చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్పడం నాకు ఇష్టమైన శైలి. ఈ సినిమా పరంగా సూపర్ స్టార్ మహేశ్‌గారిని డైరెక్ట్ చేశాననేది నా మొదటి కిక్కు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం రెండో కిక్. మహేశ్‌గారిని కొత్తగా చూపించారని ఫ్యాన్స్ ఆనందపడటం మూడో కిక్’’ అన్నారు.
చదవండి 👇
Comments
Please login to add a commentAdd a comment