
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’.పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ బాబు ఈ సినిమా సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్‌ఫార్మెన్స్ గురించి అడగ్గా.. మహేశ్ మాట్లాడుతూ.. అది తమన్ ఆలోచన అని, నమ్రతతో ఈ విషయం గురించి చెప్పేలోపు తమన్ నమ్రతని అడిగాడని చెప్పారు. ఇక ఈ సినిమాలో సితార డ్యాన్స్ ఎండ్ టైటిల్స్‌లో అయినా కనిపిస్తుందా అని అడగ్గా.. 'మేకింగ్ వీడియోలో అనుకున్నాం. ఇప్పటికే ప్రింట్స్ యూఎస్‌కి వెళ్లిపోయాయి.
అయినా దయచేసి ఇవన్నీ అడగకండి. ఇప్పటికే సినిమాల్లో ఎందుకు లేను అని సితర అడుగుతుంది. కానీ పర్‌ఫార్మన్స్ పరంగా తను నన్ను చాలా గర్వపడేలా చేసింది. నాకు తెలిసి తను భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మహేశ్.
Comments
Please login to add a commentAdd a comment