Mahesh Babu Daughter Sitara Sign The Major Jewellery Brand Contract, Deets Inside - Sakshi
Sakshi News home page

Sitara: మహేశ్‌ బాబు కూతురు సితార రికార్డ్‌.. అందుకు భారీ రెమ్యునరేషన్‌

May 26 2023 1:07 PM | Updated on May 26 2023 1:40 PM

Mahesh Babu Daughter Sitara Sign The Major Jewellery Brand Contract - Sakshi

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు కూతురు సితార ఘట్టమనేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. స్టార్‌ కిడ్‌గా సోషల్‌ మీడియాలో సితారకు మంచి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో బాగా యాక్టివ్‌గా ఉండే సితార.. ఫ్యామిలీ మూమెంట్స్‌తో పాటు తనకు సంబంధించిన విషయాలను కూడా షేర్‌ చేస్తుంటుంది. లేటెస్ట్‌ ఫోటోలు, డ్యాన్స్‌ వీడియోలతో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ఇప్పటికే ఆమెకు ఇన్‌స్టాలో 12లక్షలకు పైగానే ఫాలోవర్స్‌తో సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. దీనికి తోడు  డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి కూతురు ఆద్యతో కలిసి సొంతంగా ఓ యూట్యూబ్‌ చానెల్‌ కూడా నిర్వహిస్తుంది. మహేశ్‌ ముద్దుల కూతురిగానే కాకుండా తన స్పెషల్‌ టాలెంట్‌తో ఈ లిటిల్‌ సూపర్‌స్టార్‌ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తాజాగా మరో రికార్డును క్రియేట్‌ చేసింది.

సితారకు ఉన్న ఫ్యాన్‌ బేస్‌ను దృష్టిలో ఉంచుకొని ఓ ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌ సితారను తన ప్రచారకర్తగా నియమించుకుంది. ఇందుకోసం ఆమెకు పెద్ద మొత్తంలోనే రెమ్యునరేషన్‌ అందించినట్లు సమాచారం. ఇప్పటికే సితారతో మూడు రోజుల పాటు యాడ్‌ షూట్‌ చేశారట. ప్రముఖ టెక్నీషియన్లు ఈ యాడ్‌ కోసం పనిచేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించిన యాడ్‌ టీవీల్లో కనిపించనుంది.  ఈ విషయం తెలిసి మహేశ్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement