అటు షూటింగ్ మొదలైందో లేదో అప్పుడే రిలీజ్ డేట్ ప్రకటించేసింది సర్కారు వారి పాట చిత్రయూనిట్. వచ్చే ఏడాది సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనున్నామంటూ రిలీజ్ డేట్ ప్రకటించేసింది. ఇంత త్వరగా విడుదల తేదీ ప్రకటించడంతో ఓ వైపు షాకవుతూనే మరోవైపు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మహేశ్ ఫ్యాన్స్. సంక్రాంతి బరిలో దిగేందుకు పందెంకోడి ఇప్పటి నుంచే సిద్ధమవుతుందంటూ సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మహేశ్‌బాబు హీరోగా స్టార్ డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమే 'సర్కారు వారి పాట'. ఈ వారం ప్రారంభంలో సినిమా షూటింగ్ మొదలైంది. మహేశ్‌తో 'మహానటి' కీర్తి సురేశ్ తొలిసారిగా జోడీ కడుతున్నారు. వెన్నెల కిషోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. (చదవండి: ‘మహేశ్‌ను డైరెక్ట్ చేయాలన్న కల నిజమైంది’)
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు వరుస సక్సెస్‌ల తర్వాత మహేశ్ నటిస్తోన్న లేటెస్ట్ చిత్రం కావడంతో సరిలేరు మీద భారీ అంచనాలే నెలకొన్నాయి. 14 రీల్స్ ప్లస్, మహేశ్‌బాబు సొంతంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నారు. సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట. (చదవండి: సంగీత దర్శకుడిని మోసం చేసిన నిర్మాత)
Sankranthi it is!!! 😊 #SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @MythriOfficial pic.twitter.com/QkwE7glZTa
— Mahesh Babu (@urstrulyMahesh) January 29, 2021
Comments
Please login to add a commentAdd a comment