
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మైంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థల నిర్మాణంలో యువ దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. శనివారం కేపీహెచ్‌బీ కాలనీలోని కాశీ విశ్వనాధ స్వామి గుడిలో పూజా కార్యక్రమాలతో ఈ చిత్ర షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయింది. మహేష్ కూతురు ఘట్టమనేని సితార ఫస్ట్ క్లాప్ కొట్టగా, నమ్రత మహేష్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ( నాని కొత్త సినిమా అప్‌డేట్ వచ్చేసింది..)
ముహూర్తం షాట్‌ని కాశీ విశ్వనాధ స్వామి గుడిలో చిత్రీకరించారు. జనవరి మొదటి వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేష్, వెన్నెల కిషోర్, సుబ్బరాజు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment