
సాక్షి, బెంగళూరు : సినీ నిర్మాత శ్రీధర్ అలియాస్ హరిప్రసాద్ స్థలం పేరుతో ఘరానా మోసానికి పాల్పడ్డాడు. సంగీత దర్శకుడు ప్రవీణ్‌రావ్‌కు స్థలం ఇప్పిస్తామని రూ.94 లక్షలు స్వాహా చేసినట్లు బెంగళూరు గిరినగర పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఇదే మాదిరి అనేకమంది సినీ రంగంలో స్నేహితులను అతడు మోసగించినట్లు ఆరోపణలున్నాయి. రెండేళ్ల కిందట రాష్ట్ర హౌసింగ్ బోర్డులో ప్రవీణ్‌రావ్‌కు 4 ప్లాట్లు ఇప్పిస్తామని నమ్మించి నగదు, చెక్‌రూపంలో మొత్తం రూ.94 లక్షలు తీసుకుని ముఖం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment