
తమిళసినిమా: భాస్కర్ ఒరు రాస్కెల్ చిత్ర టీజర్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రోజుల్లో టీజర్ ప్రభావం ఆయా చిత్రాలపైనా చాలానే ఉంటోంది. టీజర్‌కు లభించే ఆదరణను బట్టి చిత్రాల విజయాలు ఉండేలా పరిస్థితి నెలకొంది. మలయాళంలో మమ్ముట్టి, నయనతార జంటగా నటించిన భాస్కర్ ది రాస్కెల్ చిత్రం అక్కడ మంచి విజయాన్ని అందుకుంది. ఆ చిత్ర దర్శకుడు సిద్ధిక్‌నే ఇప్పుడు భాస్కర్ ఒరు రాస్కెల్ పేరుతో తమిళంలో తెరకెక్కిస్తున్నారు.
మమ్ముట్టి పాత్రలో అరవిందస్వామి, నయనతార పాత్రలో నటి అమలాపాల్ నటిస్తున్న ఇందులో నాజర్, సూరి, రోబోశంకర్, రమేశ్‌ఖన్నా, సిద్ధిక్, మాస్టర్ రాఘవ్, బేబీ నైనిక( నటి మీనాకూతురు) ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. కీలక పాత్రలో హిందీ నటుడు అఫ్‌దాబ్‌శివదశాని నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర టీజర్‌ను త్వరలోనే విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.