ఉత్సవాల్లో బాణసంచాపై నటుడు ఫిర్యాదు | complaints about fireworks at temple festivals | Sakshi
Sakshi News home page

ఉత్సవాల్లో బాణసంచాపై నటుడు ఫిర్యాదు

Published Fri, Sep 8 2017 7:31 AM | Last Updated on Thu, Sep 13 2018 5:25 PM

ఉత్సవాల్లో బాణసంచాపై నటుడు ఫిర్యాదు - Sakshi

ఉత్సవాల్లో బాణసంచాపై నటుడు ఫిర్యాదు

పెరంబూరు(తమిళనాడు): ఆలయ ఉత్సవాల్లో బాణసంచా కాల్చడంపై నటుడు అరవిందస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు నటుడు అరవిందస్వామి స్థానిక తిరువాన్మియూర్‌లో నివశిస్తున్నారు. ఆయన ఇంటి సమీపంలోని ఆలయంలో రెండు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. స్వామి ఊరేగింపులో ఆ ప్రాంత ప్రజలు భారీగా పాల్గొని బాణసంచా పేల్చడంతో తన కుటుంబసభ్యులు అసౌకర్యానికి గురవుతున్నారని నటుడు అరవిందస్వామి బుధవారం రాత్రి ఆన్‌లైన్‌ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు ఊరేగింపులో బాణసంచా పేల్చరాదని సూచించారు. అయితే ఈ విషయంలో ప్రజలు, పోలీసుల మధ్య వాగ్వదం జరిగింది. మొత్తం మీద పోలీసులు సమస్యను పరిష్కరించడంతో బాణసంచా పేల్చకుండా స్వామివారి ఊరేగింపు నిర్వహించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement