
అరవింద్‌స్వామి
నేరస్తులను పట్టుకోవడానికి క్లూస్ వెతుకుతున్నాడు అరవింద్‌స్వామి. సత్యాన్వేషణ కోసం సాక్ష్యాన్వేషణ చేసి, దోషులకు శిక్ష పడేలా చేయగల చాలా తెలివైన సిబీసీఐడీ ఆఫీసర్ అతను. ‘హరహరమహాదేవకి, ఇరుట్టు అరయిల్ మురట్టు కుత్తు, గజనీకాంత్’ వంటి సినిమాలను తెరకెక్కించిన సంతోష్ పి. జయకుమార్ దర్శకత్వంలో అరవింద్‌స్వామి హీరోగా ఓ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ఇందులోనే సీబీసీఐడీ ఆఫీసర్ పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. నా గత చిత్రాలకన్నా ఇది భిన్నమైన చిత్రం. హీరో పాత్ర కూడా కొత్తగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు.