![Karthik Naren to direct Arvind Swami's next for Lyca Productions - Sakshi](/styles/webp/s3/article_images/2018/11/18/aravind-sami.jpg.webp?itok=lO8HNrKQ)
అరవింద స్వామి
వినూత్న సినిమాలకు, కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు అరవింద స్వామి. తాజాగా విడుదలైన మణిరత్నం ‘చెక్క చివంద వానమ్’ చిత్రం సక్సెస్ కావడంతో పాటు అరవింద స్వామి పోషించిన పాత్రకు మంచి అభినందలు వచ్చాయి. మరి.. నెక్ట్స్ అరవింద స్వామి ఏ సినిమా చేయబోతున్నారంటే.. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో చేయనున్నారని కోలీవుడ్ టాక్.
ఆల్రెడీ ఆయన ఈ దర్శకుడితో ‘నరగాసురన్’ అనే చిత్రం చేశారు. ఈ సినిమా రిలీజ్ పలు వాయిదాలు పడుతూ వస్తోంది. ‘నరగాసురన్’ చిత్రం చేస్తున్నప్పుడే ఈ దర్శకుడు టాలెంట్ చూసి మరో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారట అరవింద స్వామి. ఈ చిత్రాన్ని ‘2.0’ నిర్మించిన లైకా సంస్థ నిర్మించనుంది. ‘నరగాసురన్’ ఎప్పుడు తెరకు వస్తుంది? అనే ప్రశ్నకు యూనిట్ తెరదించాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment