janaki ramachandran
-
శ్రీమతి ఎంజీఆర్
మధుబాల మంచి నటి. ‘రోజా’, ‘జెంటిల్‌మేన్’ వంటి సినిమాలు చాలు.. ఆమె ఎంత మంచి నటో చెప్పడానికి. కథానాయికగా మంచి పాత్రలు చేసిన మధు ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గానూ అలాంటి పాత్రలే చేస్తున్నారు. వచ్చే నెల 23న విడుదల కానున్న ‘తలైవి’లో ఆమె ఓ నిజజీవిత పాత్ర చేశారు. దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా రూపొందిన చిత్రమిది. కంగనా టైటిల్ రోల్ చేశారు. ఇందులో ఎంజీఆర్ పాత్రను అరవింద్ స్వామి చేశారు. ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ పాత్రను మధుబాల చేశారు. శుక్రవారం (మార్చి 26) మధుబాల బర్త్‌డే సందర్భంగా ఆమె లుక్ విడుదలైంది. ఆస్పత్రిలో ఎంజీఆర్ పక్కన కూర్చుని, ఆయన్ను చూస్తున్న జానకీ రామచంద్రన్ లుక్‌కి మంచి స్పందన లభించింది. -
బలపరీక్ష ఎప్పుడు పెట్టినా ఇంతే!
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీద విశ్వాస పరీక్ష ఎప్పుడు నిర్వహించినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తీవ్ర గందరగోళం, సభలో సభ్యుల కేకలు, అరుపులు.. సభను సజావుగా నడవనివ్వకపోవడం లాంటివి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. ఇంతకుముందు ఎంజీఆర్ మరణం అనంతరం జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తినప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించారు. 1988 జనవరి 27వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించారు. అప్పుడు అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి, అసెంబ్లీలో కొట్టుకుంటున్న సభ్యులను నియంత్రించేందుకు తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. జయలలిత వర్గానికి నెడుంజెళియన్ నాయకత్వం వహించారు. సభ్యులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు కూడా. అప్పుడు స్పీకర్ పీహెచ్ పాండియన్ చాలామంది ప్రతిపక్ష సభ్యులపై ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొనడం, స్పీకర్ చొక్కా చించి అవమానించడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తనకు జరిగిన అవమానానికి తాను ఎవరికి చెప్పుకోవాలని స్పీకర్ ధనపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ముందున్న టేబుల్‌ను పడగొట్టేసి, ఆయన కుర్చీలో కూర్చుని, బెంచీల మీదకు ఎక్కి, స్పీకర్‌ను నెట్టేసి.. ఇలా పలు రకాలుగా విధ్వంసం సృష్టించడంతో సభను దాదాపు గంట సేపు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభ సమావేశమైనప్పుడు డీఎంకే సభ్యులందరినీ బయటకు వెళ్లాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. వాళ్లను బయటకు తీసుకెళ్లాల్సిందిగా మార్షల్స్‌కు సూచించారు. అయితే డీఎంకే ఎమ్మెల్యేలు మళ్లీ పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌ను ఘెరావ్ చేసి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. -
30 ఏళ్ల క్రితం కూడా.. తమిళనాట ఓ బలపరీక్ష
తమిళనాడు అసెంబ్లీలో దాదాపు 30 ఏళ్ల తర్వాత మరోసారి బలపరీక్ష జరుగుతోంది. ఇంతకుముందు ఎంజీ రామచంద్రన్ మరణించిన తర్వాత ఆయన భార్య జానకీ రామచంద్రన్, వీఆర్ నెడుంజెళియన్ నేతృత్వంలోని జయలలిత వర్గాల మధ్య పోటీ ఫలితంగా 1988 జనవరి 27వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. అప్పుడు అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి, అసెంబ్లీలో కొట్టుకుంటున్న సభ్యులను నియంత్రించేందుకు తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. అప్పట్లో నెడుంజెళియన్ పోషించిన పాత్రను ఇప్పుడు ఓ పన్నీర్ సెల్వం పోషిస్తున్నారు. ఇప్పుడు బలపరీక్ష విషయంలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనన్న ఆసక్తి అన్ని వర్గాల్లో నెలకొంది. ఇక 2006 సంవత్సరంలో డీఎంకేకు పూర్తి మెజారిటీ రాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ కేవలం 96 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. అయితే 34 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ.. ఐదేళ్ల పాటు బయటి నుంచి మద్దతిచ్చింది. కేంద్రంలో కాంగ్రెస్ అప్పట్లో అధికారంలో ఉండటంతో తమిళనాడులోనూ పట్టు ఉండాలని అలా చేసింది. కాంగ్రెస్ మద్దతు ఉందన్న విషయం స్పష్టం కావడంతో అప్పట్లో డీఎంకేను బలం నిరూపించుకోవాలని గవర్నర్ అడగలేదు. 1988లో ఏం జరిగింది... అప్పట్లో తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా స్పీకర్ పీహెచ్ పాండియన్ చాలామంది ప్రతిపక్ష సభ్యులపై ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. దాంతో రాష్ట్రంలో తీవ్రస్థాయిలో హింసాకాండ చెలరేగింది. చివరకు ఆర్టికల్ 356ను ప్రయోగించి, జానకీ రామచంద్రన్ ప్రభుత్వాన్ని దించేశారు. 1989లో మళ్లీ ఎన్నికలు నిర్వహించగా, డీఎంకే సంపూర్ణ మెజారిటీతో విజయం సాధించింది. 13 ఏళ్ల తర్వాత కరుణానిధి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. -
మళ్లీ తెరపైకి రజనీ
చెన్నై, సాక్షి ప్రతినిధి:రాష్ట్ర రాజకీయాల్లో విజయసోపానాలకు అనాదిగా సినీ ప్రముఖులే కారకులవుతున్నారు. అనాటి అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత ఇలా అందరు వెండితెరను ఏలినవారే. అయితే అన్నాదురై, కరుణానిధి వరకు వె ండితెర వెనుక నుంచి సేవలు అందించారు. సినీ పరిశ్రమకు సంబంధం లేనివారికి సీఎం పట్టం కట్టడం కామరాజనాడార్తోనే చెల్లిపోయింది. ఎంజీఆర్ మరణం తరువాత ఆయన భార్య జానకీ రామచంద్రన్ కొద్దిరోజులు సీఎం పీఠంపై కూర్చున్నా రాణించలేకపోయారు. ఆ తరువాత పార్టీ, ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన జయలలిత పార్టీకి ఏకైక ప్రజాకర్షణ నేతగా మారిపోయారు. సినీ ఆకర్షణే పార్టీలకు గెలుపు మంత్రంగా రుజువైన తరుణంలో ప్రస్తుతం అన్నాడీఎంకే జయ ఆకర్షణను కోల్పోయింది. వెండితెర రంగుల గుబాళింపులు లేని భారతీయ జనతా పార్టీ ఎన్నో ఏళ్లుగాసూపర్స్టార్ను రాజకీయ ముగ్గులోకి దింపే ప్రయత్నాలు చేస్తోంది. 1996లో డీఎంకే, తమిళ మానిల పార్టీల కూటమికి రజనీ మద్దతు పలకగా ఆ పార్టీ విజయం సాధించింది. అలాగే 2004లో బీజేపీకి మద్దతు పలికి ఓటు సైతం ఆ పార్టీకే వేసినట్లు ఆయనే ప్రకటించారు. ఆ తరువాత ప్రతి ఎన్నికల్లోనూ తటస్థంగానే ఉంటున్నారు. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో రజనీ చేత రాజకీయ ప్రవేశం చేయించేందుకు బీజేపీ పడరాని పాట్లు పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చెన్నైకి వచ్చిన నరేంద్రమోడీ రజనీకాంత్ ఇంటికి వెళ్లారు. అయితే తమ ఇద్దరి కలయికలో రాజకీయం ఏమీ లేదని, స్నేహపూర్వకంగానే మాట్లాడుకున్నామని రజనీ ప్రకటించారు. అయితే ఆనాటి పరిస్థితులు వేరు, నేడు రాష్ట్ర రాజకీయాల్లో వచ్చిన మార్పులు వేరని రాజకీయ వర్గాల వాదనగా ఉంది. రజనీ రాజకీయ ప్రవేశానికి ప్రస్తుతం అనుకూలమైన వాతావరణం ఉందని భావిస్తున్న బీజేపీ మళ్లీ రజనీని ప్రసన్నం చేసుకునే పనిలో పడిందని తెలుస్తోంది. ఈ మేరకు డిల్లీ స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభమయ్యూయనే వార్త ప్రచారంలో ఉంది. అయితే ఎప్పటికప్పుడు దాటవేసే రజనీ ఇటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారోనని అభిమానులు, ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
అమ్మకోసం పోటాపోటీ
చెన్నై, సాక్షి ప్రతినిధి:అన్నాడీఎంకే సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎంజీ రామచంద్రన్ పేరు శాశ్వతం కావడంతో ప్రధాన కార్యదర్శి స్థానానికి మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుతారు. ఎంజీఆర్ మరణం తరవాత కొద్దికాలం ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే అంతర్గత రాజకీయాలకు తట్టుకోలేక దూరమయ్యారు. తరువాత ఆ స్థానాన్ని జయలలిత భర్తీ చేశారు. ఉన్నత విద్యతోపాటూ తనదైన రాజకీయ శైలిలో పార్టీని పరుగులు పెట్టించా రు. అనేక సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చా రు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఎంజీఆర్కం టే మెరుగైన ఓట్లశాతాన్ని రాబట్టుకున్న రికార్డు ను సాధించారు. ఎంజీఆర్ తరువాత పార్టీ నాయకత్వంతో అంతటి కీర్తిని దక్కించుకున్న జయలలిత తనకు ఎదురులేదని నిరూపించుకుంటున్నారు. ఇప్పటికి ఆరుసార్లు ప్రధాన కా ర్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2008 లో పార్టీ ఎన్నికలు జరిగాయి. ఏడాదితో ఐదేళ్లు పూర్తవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి. క్యూలో మంత్రులు: పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బుధవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. దీని కోసం తరలివచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల తో రాయపేటలోని అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయం కిటకిటలాడింది. ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా భర్తీ చేసిన నామినేషన్ నామినేషన్ పత్రాలను, రూ.25వేలు డిపాజిట్టును పార్టీ కార్యాలయంలోని ఎన్నికల అధికారి విశాలాక్షి నెడుంజెళియన్‌కు పలువురు మంత్రులు అందజేశారు. మంత్రులు పన్నీర్ సెల్వం ప్రధాన కార్యదర్శిగా జయలలిత పేరును ప్రతిపాదించగా, మరో మంత్రి వలర్మతి, పార్టీ కార్యాలయ కార్యదర్శి మధుసూదన్ బలపరిచారు. నామినేషన్ పత్రాలను అందజేస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులంతా ‘పురట్చీ తలైవీ వాళ్గ’ (విప్లవ నాయకి వర్ధిల్లాలి) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. జయ అందజేసిన నామినేషన్‌ను హుందాగా ఎన్నికల అధికారి చాంబర్లోకి వెళ్లి సమర్పించిన మంత్రులు, ఆ తరువాత సాధారణ కార్యాకర్తల్లా క్యూలో తోసుకుంటూ మరిన్ని నామినేషన్ పత్రాలను అందజేయడం విశేషం. ఈనెల 24 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 27న పరిశీలన, 28న ఉపసంహరణ, 29న ఎన్నికలు అదే రోజు సాయంత్రం ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత ప్రస్తుతం ఆరోసారి కొనసాగుతున్నారు. తాజా ఎన్నికల్లో జయలలితకు పోటీగా మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేనందున ఈనెల 29వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏడో సారి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికవుతారు.