చెన్నై, సాక్షి ప్రతినిధి:అన్నాడీఎంకే సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహిస్తారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎంజీ రామచంద్రన్ పేరు శాశ్వతం కావడంతో ప్రధాన కార్యదర్శి స్థానానికి మాత్రమే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరుపుతారు. ఎంజీఆర్ మరణం తరవాత కొద్దికాలం ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అయితే అంతర్గత రాజకీయాలకు తట్టుకోలేక దూరమయ్యారు. తరువాత ఆ స్థానాన్ని జయలలిత భర్తీ చేశారు. ఉన్నత విద్యతోపాటూ తనదైన రాజకీయ శైలిలో పార్టీని పరుగులు పెట్టించా రు. అనేక సార్లు పార్టీని అధికారంలోకి తెచ్చా రు. తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఎంజీఆర్‌కం టే మెరుగైన ఓట్లశాతాన్ని రాబట్టుకున్న రికార్డు ను సాధించారు. ఎంజీఆర్ తరువాత పార్టీ నాయకత్వంతో అంతటి కీర్తిని దక్కించుకున్న జయలలిత తనకు ఎదురులేదని నిరూపించుకుంటున్నారు. ఇప్పటికి ఆరుసార్లు ప్రధాన కా ర్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2008 లో పార్టీ ఎన్నికలు జరిగాయి. ఏడాదితో ఐదేళ్లు పూర్తవడంతో ఎన్నికలు అనివార్యమయ్యాయి.
క్యూలో మంత్రులు: పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బుధవారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. దీని కోసం తరలివచ్చిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల తో రాయపేటలోని అన్నాడీఎంకే కేంద్ర కార్యాలయం కిటకిటలాడింది. ముఖ్యమంత్రి జయలలిత స్వయంగా భర్తీ చేసిన నామినేషన్ నామినేషన్ పత్రాలను, రూ.25వేలు డిపాజిట్టును పార్టీ కార్యాలయంలోని ఎన్నికల అధికారి విశాలాక్షి నెడుంజెళియన్‌కు పలువురు మంత్రులు అందజేశారు. మంత్రులు పన్నీర్ సెల్వం ప్రధాన కార్యదర్శిగా జయలలిత పేరును ప్రతిపాదించగా, మరో మంత్రి వలర్మతి, పార్టీ కార్యాలయ కార్యదర్శి మధుసూదన్ బలపరిచారు. నామినేషన్ పత్రాలను అందజేస్తున్న తరుణంలో పార్టీ శ్రేణులంతా ‘పురట్చీ తలైవీ వాళ్గ’ (విప్లవ నాయకి వర్ధిల్లాలి) అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు.
జయ అందజేసిన నామినేషన్‌ను హుందాగా ఎన్నికల అధికారి చాంబర్‌లోకి వెళ్లి సమర్పించిన మంత్రులు, ఆ తరువాత సాధారణ కార్యాకర్తల్లా క్యూలో తోసుకుంటూ మరిన్ని నామినేషన్ పత్రాలను అందజేయడం విశేషం. ఈనెల 24 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 27న పరిశీలన, 28న ఉపసంహరణ, 29న ఎన్నికలు అదే రోజు సాయంత్రం ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. పార్టీ సిద్ధాంతాల ప్రకారం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ప్రధాన కార్యదర్శి హోదాలో జయలలిత ప్రస్తుతం ఆరోసారి కొనసాగుతున్నారు. తాజా ఎన్నికల్లో జయలలితకు పోటీగా మరెవ్వరూ నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేనందున ఈనెల 29వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటిస్తారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఏడో సారి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికవుతారు.
అమ్మకోసం పోటాపోటీ
Published Thu, Aug 21 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM
Advertisement