
ఆర్.కె. సురేష్, మధుబాల
ఆర్.కె. సురేష్, మధుబాల జంటగా తోట కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శివలింగాపురం’. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకట స్వామి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రావూరి వెంకట స్వామి మాట్లాడుతూ– ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ భక్తిరస చిత్రమిది. శివలింగాపురం అనే గ్రామంలో అత్యంత మహిమగల శివలింగం దొంగలించబడుతుంది. ఆ శివలింగాన్ని విద్రోహుల చెర నుంచి ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి హీరో ఎలా రక్షించాడు? అనే కథని తోట కృష్ణ చక్కగా తెరకెక్కించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న మా సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మహా శివరాత్రి పర్వదినాన విడుదల చేస్తున్నాం’’ అన్నారు. డీఎస్ రావు, బేబీ హర్షిత తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘన శ్యామ్.
Comments
Please login to add a commentAdd a comment