RK Suresh
-
నేను అలా అనలేదు.. అవాస్తవాలు ప్రచారం చేశారు: ప్రముఖ నటుడు
తన గురించి ఎన్నో కట్టుకథలు ప్రచారం చేశారని ప్రముఖ తమిళ నటుడు-నిర్మాత ఆర్కే.సురేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈయన హీరోగా నటించిన కొత్త సినిమా 'కాడు వెట్టి'. సోలై ఆరుముగం దర్శకుడు. త్వరలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే ఆర్కే సురేశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్) 'ఇప్పటివరకూ 100కి పైగా సినిమాల్ని పంపిణీ చేశాను. పలు చిత్రాలు నిర్మించాను. 40కి పైగా మూవీస్‌లో నటించాను. ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉన్నాను. అందరితోనూ నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి నాపై అవాస్తవాలు ప్రచారం చేశారు. ఇది జాతికి సంబంధించిన చిత్రం కాదు. నేను ఏ జాతిని కించపరచేలా మాట్లాడలేదు. జాతి అనేది ఒక భావన మాత్రమే' అని ఆర్కే సురేశ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే రానుందా?) -
వరలక్ష్మి శరత్ కుమార్ ఇంతలా కష్టపడిందా.. రివీల్ చేసిన టాప్ డైరెక్టర్
వరలక్ష్మి శరత్ కుమార్‌ను ప్రశంసించని వారు ఉండరనే చెప్పాలి. ఆమె స్టార్ వారసురాలైనా ప్రతిభతోనే కథానాయకిగా రంగ ప్రవేశం చేసింది. వరలక్ష్మి శరత్‌కుమార్ సూపర్ బెల్లీ డ్యాన్సరన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె కూడా ఎక్కడా ప్రస్తావించలేదు. తన తండ్రి శరత్ కుమార్ సిఫార్సునే తీసుకోని ఆమె ప్రతిభనే నమ్ముకుని వివిధ రకాల పాత్రల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. ఆమెను దర్శకుడు బాలా తనకు నచ్చిన నటి అని ప్రశంసించడం విశేషం. సేతు, నందా, శివ పుత్రుడు వంటి పలు సంచలన విజయాలను సాధించిన చిత్రాల దర్శకుడు బాలా. ఈయన ప్రస్తుతం కోలీవుడ్‌లో వణంగాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో మొదట నటుడు సూర్య కథానాయకుడిగా నటించారు. ఆ తర్వాత అనివార్య కారణాలవల్ల ఆయన చిత్రం నుంచి వైదొలగడంతో నటుడు అరుణ్ విజయ్ ఆ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దర్శకుడు బాలా ఇటీవల ఒక భేటీలో మాట్లాడుతూ తాను చాలా తక్కువ మంది కథానాయకిలతోనే చిత్రాలు చేశానని, అందులో తనకు నచ్చిన నటి వరలక్ష్మి శరత్ కుమార్ అని పేర్కొన్నారు. తాను ఇంతకుముందు తెరకెక్కించిన తారై తప్పట్టై చిత్రం షూటింగ్లో ఘనంగా నటించిన ఆర్కే సురేష్‌కు నటి వరలక్ష్మి శరత్ కుమార్‌కు మధ్య జరిగిన సన్నివేశంలో ఆమె ఒంటి ఎముక చిట్లినా లెక్కచేయకుండా మళ్లీ మళ్లీ టేక్ చెప్పినా నటించారని చెప్పారు. అసలు ఆర్కే సురేష్ ఆమైపె బలంగా పడాలన్నారు. షార్ట్ సరిగ్గా రావాలని తాను గట్టిగా అరవడంతో ఆర్కే సురేష్ ఆమైపె బలంగానే పడ్డారన్నారు. అలా తొలి షాట్ లోనే వరలక్ష్మి శరత్ కుమార్ ఒంటి ఎముక చిట్లిందన్నారు. ఆమె తనతో ఆ విషయాన్ని చెప్పలేదన్నారు. తాను పర్ఫెక్షన్ కోసం మరో రెండు మూడు టేకులు చేశానన్నారు. ఆమె కాదనకుండా నటించారని చెప్పారు. ఆ తర్వాత ఆమె ఊరికి తిరిగి వచ్చిన తర్వాత తదుపరి షెడ్యూల్ చిత్రీకరిస్తున్నప్పుడు తన ఒంటి ఎముక చిట్లినదానికి సంబంధించిన ఎక్స్‌రేను చూపించడంతో ఇది నిజమా అని అడిగానన్నారు. దాంతో ఆమె నిజమేనని చెప్పి చాలా కష్టపడినట్లు చెప్పారన్నారు. అలా ఆమె కఠిన శ్రమజీవి అని దర్శకుడు బాలా పేర్కొన్నారు. -
రూ. 2 వేల కోట్లకు పైగా మోసం కేసులో సినీ నటుడు,నిర్మాత
తమిళనాడులో ఆరుద్రా గోల్డ్ పెట్టుబడుల విషయంలో రూ. 2,438 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన ఘటన కొన్ని నెలల క్రితం సంచలనం రేపింది. ఈ కేసులో కోలీవుడ్ నటుడు ఆర్కే సురేష్‌కు కూడా సంబంధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో కొన్ని నెలల అనంతరం దుబాయ్ నుంచి చైన్నెలో ఆర్కే సురేష్ అడుగు పెట్టాడు. ఆయన్ని అధికారులు విమానాశ్రయంలో ప్రశ్నించారు. ఆర్థిక నేర విభాగం పోలీసుల విచారణకు నేడు హాజరు కానున్నట్టు సురేష్ వెల్లడించారు. వివరాలు.. చైన్నె కేంద్రంగా రాష్ట్రంలో ఆరుద్రా గోల్డ్ పెట్టుబడుల పేరిట రూ. 2,438 కోట్లకు పైగా మోసాలకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితులను ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద జరిపిన విచారణలో బీజేపీ నేతల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఆరుద్రా గోల్డ్‌లో డైరెక్టర్లుగా ఉన్న వాళ్లు బీజేపీకి చెందిన వారుగా తేలడంతో విచారణ వేగం పుంజుకుంది. అదే సమయంలో ఈ కేసుతో సినీ నటుడు ఆర్కే సురేష్‌కు సంబంధాలు ఉన్నట్టు వెలుగు చూశాయి. దీంతో ఆయన్ని విచారించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేశారు. అయితే విదేశాలలో షూటింగ్ బిజి పేరిట ఆయన తప్పించుకునే ప్రయత్నం చేశారు. కొన్ని నెలల పాటు ఆయన విదేశాలలోనే ఉండి పోయారు.ముందస్తు బెయిల్ ప్రయత్నాలు, ఈ కేసుతో తనకు సంబంధం లేదని చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలను చేశారు. చివరకు ఆయనకు వ్యతిరేకంగా లుక్ అవుట్ నోటీసును చైన్నె ఆర్థిక నేర విభాగం పోలీసులు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో కొన్ని నెలల అనంతరం దుబాయ్ నుంచి చైన్నెకు సురేష్ వచ్చారు. చైన్నె విమానాశ్రయంలో అడుగు పెట్టిన ఆయన్ను ఇమిగ్రేషన్ అధికారులు విచారణ జరిపారు. తాను చైన్నె ఆర్థిక నేర విభాగం పోలీసుల విచారణకు హాజరయ్యేందుకే ఇక్కడకు వచ్చినట్టు వారికి వివరించారు. విచారణ అనంతరం చైన్నెలోకి ఆయన్ని అనుమతించారు. విమానాశ్రయం నుంచి తన ఇంటికి చేరుకున్న ఆర్కే సురేష్ డిసెంబర్ 12న చైన్నె ఆర్థిక నేర విభాగం పోలీసుల విచారణకు హాజరవుతారు. ఎవరీ ఆర్.కె. సురేష్ ఆర్.కె. సురేష్ సినీ నిర్మాత, సినిమా నటుడు. ఆయన స్టూడియో 9 నిర్మాణ సంస్థకు అధిపతి. సురేశ్ 2015లో తారై తప్పట్టై సినిమా ద్వారా నటుడిగా అరంగ్రేటం చేశాడు. ఆయన ప్రస్తుతం తమిళనాడు బీజేపీ ఒబిసి విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. డిస్ట్రిబ్యూటర్‌గా కూడా ఆయన పలు సినిమాలకు భాగం పంచుకున్నాడు. తెలుగులో విశాల్ రాయుడు చిత్రంతో పాటు విక్రమ్ స్కెచ్ మూవీలో కనిపించాడు. ఆపై కాశి, రాజా నరసింహా చిత్రాల్లో మెప్పించాడు. -
కోలీవుడ్‌లో జాంబిరెడ్డి హీరోయిన్ కొత్త సినిమా!
మంచి కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్న నటి 'కయల్' ఆనంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వైట్‌రోస్. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నటుడు ఆర్కే సురేష్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. రంజని నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు సుశిగణేశన్ శిష్యుడు అన్నది గమనార్హం. చిత్ర యూనిట్ వైట్‌రోస్ వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యువతి ఎదుర్కొనే సమస్యలు ఇతివృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రం అన్నారు. ఇది ఉత్కంఠ భరితంగా సాగే సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో ఆనంది పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆమె కెరీర్లోనే ఇది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చెప్పారు. ఆనంది అద్భుతంగా నటిస్తున్నారన్నారు. సురేష్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నారు. అదేవిధంగా చిత్రంలో మరో ప్రముఖ నటి నటించనున్నారని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి జోహన్, శివనేశ్ సంగీతాన్ని ఇళయరాజా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇకపోతే జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలతో ఆనంది తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఇటీవలే ఆమె తెలుగులో కస్టడీ సినిమాలో కనిపించింది. చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషిపై జాలి చూపించిన హీరోయిన్ వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల -
ఇద్దరు హీరోలతో సైకో థ్రిల్లర్ మూవీ 'వైట్ రోస్'
నటుడు, నిర్మాత ఆర్.కె సురేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వైట్ రోస్. మరో కథానాయకుడిగా ఎస్.రుసో నటిస్తున్న ఇందులో కయల్ ఆనంది ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వీరితో పాటు మాజీ పోలీస్ అధికారి జాంగిట్ ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. రాజశేఖర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్కే సురేష్ స్టూడియో 9 సంస్థ, ఎస్.రుసోతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ సోమవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాత కలైపులి ఎస్. థాను, నటుడు ఆది తదితర సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆస్పత్రిల్లో జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న సైకో థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. దీనికి ఎన్.ఎస్.ఉదయకమార్ ఛాయాగ్రహణం, జోహన్ శివనేశ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చదవండి 👇 నా సినిమాను చంపేశారు: శేఖర్ నిర్మాత ఆవేదన ‘బిందు మాధవి అలా అనడంతో పెళ్లి గురించి ఆలోచించడం మానేశా’ -
అజిత్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు : నిర్మాత
నటుడు అజిత్ గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదని నటుడు, నిర్మాత ఆర్కే సురేష్ అన్నారు. ఆదివారం చెన్నైలో మాయన్ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఉండేవారే ఇక్కడి వారిని విమర్శిస్తున్నారని, అజిత్ నటించిన వలిమై చిత్రం గురించి కొందరు తీవ్రంగా విమర్శలు చేశారన్నారు. తప్పులను ఎత్తి చూపించవచ్చని, నటుడు అజిత్ గురించి మాట్లాడే అర్హత వారెవరికీ లేదన్నారు. సోషియే ఫాంటసీ కథా చిత్రంగా రూపొందిన మాయాన్ చిత్రాన్ని చూసి రాజమౌళి చిత్ర దర్శకుడు రాజేష్‌ను అభినందించారని అన్నారు. ఈ సినిమాను తమిళనాడుకు చెందిన మలేషియా వాసి డత్తో గణేష్ నిర్మింస్తుండగా రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. వినోద్ మోహన్, బిందు మాధవి, ప్రియా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. గూగుల్ కుట్టప్ప ట్రైలర్ ఆవిష్కరణలో సురేష్ -
మహా శివరాత్రికి శివలింగాపురం
ఆర్.కె. సురేష్, మధుబాల జంటగా తోట కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శివలింగాపురం’. రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై రావూరి వెంకట స్వామి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 21న విడుదలవుతోంది. ఈ సందర్భంగా రావూరి వెంకట స్వామి మాట్లాడుతూ– ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ భక్తిరస చిత్రమిది. శివలింగాపురం అనే గ్రామంలో అత్యంత మహిమగల శివలింగం దొంగలించబడుతుంది. ఆ శివలింగాన్ని విద్రోహుల చెర నుంచి ధైర్య సాహసాలతో ప్రాణాలకు తెగించి హీరో ఎలా రక్షించాడు? అనే కథని తోట కృష్ణ చక్కగా తెరకెక్కించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న మా సినిమాని తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో మహా శివరాత్రి పర్వదినాన విడుదల చేస్తున్నాం’’ అన్నారు. డీఎస్ రావు, బేబీ హర్షిత తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఘన శ్యామ్. -
యాక్షన్ ఎంటర్టైనర్
తమిళ, మలయాళ భాషల్లో యాక్షన్ హీరోగా చేసిన ఆర్.కె.సురేశ్ ‘శివలింగాపురం’ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. తోట కృష్ణ దర్శకత్వంలో రావూరి అల్లికేశ్వరి సమర్పణలో రావూరి వెంకటస్వామి ఈ చిత్రాన్ని నిర్మించారు. మధుబాల కథానాయిక. ఈ సినిమా ఆడియో, ట్రైలర్ విడుదల కార్యక్రమంలో నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ –‘‘అభిరుచితో ఆయన తీసిన ఈ చిత్రం విజయవంతం కావాలి’’ అన్నారు. ‘‘గతంలో లిటిల్ హార్ట్స్, మా తల్లి గంగమ్మ, కొక్కొరోకో’ వంటి సినిమాలు తీశాను. మేము పెరిగిన లొకేషన్లో ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించాం. ఈ నెలాఖరులో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు వెంకటస్వామి. ‘‘గ్రామీణ నేపథ్యంలో యాక్షన్, ఫాంటసీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలిచాను. అన్న, చెల్లెలి సెంటిమెంట్ హైలైట్ అవుతుంది’’అన్నారు. ఈ కార్యక్రమంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టి.ప్రసన్నకుమార్, మోహన్ వడ్లపట్ల, సాయివెంకట్, రాకేష్ రెడ్డి, పద్మిని నాగులపల్లి, డి.ఎస్.రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆయన వాడుకొని వదిలేసే రకం!
తమిళసినిమా: నటుడు విశాల్ తనకు అవసరమైన వారిని వాడుకుని వదిలేస్తారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అంతేనని నటుడు, నిర్మాత ఆర్కే.సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాల్ అవకాశవాది అని,ఆయన చర్యలు సరికాదని ఆరోపించారు. ఆర్కే.సురేశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కొచ్చిన్ షాది అట్ చెన్నై 03. తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్య ఆది ఇంటర్నేషనల్ మూవీస్ పతా కంపై అబ్దుల్ లతీఫ్ వడుకోట్ నిర్మిస్తున్నారు. నటి అర్చిత శ్రీధర్, నేహా సక్సెనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మంజి దివాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీని ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ సందర్భంగా చిత్ర కథానా యకుడు ఆర్కే.సురేశ్ నడిగర్ సంఘం వ్యవహా రంపై స్పందిస్తూ తాను సంఘంలో సభ్యుడిగా చేరి నాలుగేళ్లయ్యిందని, అయినా ఎలాంటి పదవికీ పోటీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్‌కు మినహా అందరికీ తన మద్దతు ఉంటుందన్నారు. నటుడు ఉదయ నడిగర్ సంఘ నిర్వాహనికి ఒక జట్టును తయారు చేస్తున్నారని,వారికి తన మద్దుతు ఉంటుందన్నారు. ఆరోపణలు చేయలేదు నటుడు విశాల్‌పై తాను ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేదని, ఆయన అలాంటి వారు కాదని అన్నారు. అయితే ఆయన తనకెవరూ అవసరమో వారిని వాడుకుని ఆ తరువాత వదిలేస్తారని అన్నారు. విశాల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో నటుడు, మాజీ ఎంపీ రితీష్ కూడా ఉన్నారని, ఆ తరువాత ఆయన విడిపోయారని అన్నారు. విశాల్‌తో ఉన్న నటుడు ఉదయ ఇప్పుడు ఆయనతో విభేదించి బయటకు వచ్చారని, ఆయన మేనేజర్ మురుగరాజ్ విశాల్‌తో లేడని అన్నారు. నటి వరలక్ష్మీది అదే పరిస్థితి అని పేర్కొన్నారు. విశాల్ ఎందుకిలా చేస్తున్నారన్నది అర్థం కావడం లేదన్నారు. కాగా తాను నటుడు ఎస్వీ.శేఖర్ జట్టులో చేరలేదని, అసలు ఆయన ఏ జట్టులో ఉన్నారన్నదీ తనకు తెలియదని అన్నారు. పెద్ద నిర్మాతలెవరూ ఇప్పుడు లేరని, వారంతా నెలసరి వేతనాన్ని పొందుతున్నారని అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం పేరును తమిళ్ నడిగర్ సంఘంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విశాల్ గురించి మాట్లాడు తూ ఆయన్ని నటించనీయండి, చాలా కమిట్మెంట్స్ ఉన్నాయి అని ఆర్కే.సురేశ్ పేర్కొన్నారు. -
శివతాండవం హైలైట్
‘‘కొక్కొరొకో, మా తల్లి గంగమ్మ, లిటిల్ హార్ట్స్’ వంటి చిత్రాలతో మంచి అభిరుచి గల నిర్మాత అనిపించుకున్నారు రావూరి వెంకటస్వామి. తాజాగా ఆయన నిర్మించిన చిత్రం ‘శివలింగాపురం’. ఆర్.కె. సురేష్, మధుబాల జంటగా, శివుడిగా డాక్టర్ భూమారెడ్డి, పార్వతిగా మేఘనా శ్రీలక్ష్మి నటించారు. తోట కృష్ణ దర్శకత్వంలో రావూరి అల్లికేశ్వరి సమర్పణలో అపోలో ప్రొడక్షన్స్ పతాకంపై వెంకటస్వామి నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తోట కృష్ణ మాట్లాడుతూ– ‘‘శివలింగాపురంలో జరిగిన కొన్ని సంఘటనలతో ఈ చిత్రకథ సాగుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. శివశంకర్ మాస్టర్ చేసిన శివతాండవం నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు. ‘‘కథ నచ్చి ఈ సినిమా నిర్మించా. చిత్తూరు పరిసర ప్రాంతాల్లో 35 రోజుల పాటు జరిపిన షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ పనులు పూర్తి చేసుకుని, ప్రస్తుతం రీరికార్డింగ్, గ్రాఫిక్స్ పనులు జరుగుతున్నాయి. జూన్‌లో విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రఫి, సంగీతం: ఘనశ్యామ్. -
టైసన్‌గా మారుతున్న ఆర్కే.సురేశ్
తమిళసినిమా: నిర్మాత, నటుడు ఆర్కే.సురేశ్ ఇప్పుడు తన చిత్రాలతో బిజీ అయ్యారు. తొలుత నిర్మాతగా రంగప్రవేశం చేసి ధర్మదురై లాంటి కొన్ని మంచి చిత్రాలను నిర్మించారు. ఆ తరువాత ప్రతి నాయకుడిగా అవతారమెత్తి మరుదు, తారైతప్పట్టై వంటి చిత్రాలలో దుమ్మురేపారు. ఇప్పుడు కథానాయకుడిగా బిజీ అయిపోయారు. ఆయన హీరోగా నటిస్తున్న బిల్లాపాండి,వేట్టైనాయ్ తదితర చిత్రాలలో నటిస్తున్నారు. తాజాగా టైసన్ అనే చిత్రాన్ని తన స్టూడియో 9 పతాకంపై నిర్మిస్తూ, కథానాయకుడిగా నటించడానికి రెడీ అయ్యారన్నది తాజా వార్త. దీనికి రత్తన్లింగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఆ మధ్య విడుదలై సినీ పరిశ్రమ వర్గాల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న అట్టు చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఇది టైసన్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం అవుతుంది. టైసన్ చిత్రం గురించి రత్తన్లింగా తెలుపుతూ ఆర్కే.సురేశ్ ఇందులో ఇంతకు ముందెప్పుడూ నటించని పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఆయనతో పాటు నటుడు అజయ్ రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం అన్నారు. ఇందులో హీరోయిన్ ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తామని, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం అంతా ప్రముఖులే ఉంటారని దర్శకుడు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. -
నెపోలియన్ రీమేక్‌లో వరలక్ష్మి?
తమిళ సినిమా: నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ నటుడు, నిర్మాత ఆర్కే.సురేశ్‌తో జత కట్టనున్నారా? ఇందుకు అవుననే సమాధానమే కోలీవుడ్ నుంచి వస్తోంది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు వీరిద్దరూ తారాతప్పట్టై చిత్రంలో విలన్, హీరోయిన్గా నటించారు. తాజాగా హీరోహీరోయిన్లుగా నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. నిర్మాతగా రంగప్రవేశం చేసిన ఆర్కే.సురేశ్ ఆ తరువాత ప్రతి నాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎదుగుతూ తాజాగా కథానాయకుడిగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయనిప్పుడు తనీముగం, బిల్లాపాండి, వర్గన్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. మరో పక్క విలన్‌గానూ నటిస్తున్న ఆర్కే.సురేశ్ తెలుగు చిత్రం నెపోలియన్ చిత్ర రీమేక్ హక్కులను సొంతం చేసుకున్నారన్నది తాజా వార్త. తెలుగులో ఆనంద్ రవి స్వీయ దర్శకత్వంలో హీరోగా నటించిన ఈ చిత్రాన్ని చూడమని ఒక మిత్రుడు చెప్పారని, చిత్రం చూసిన తరువాత తనకు బాగా నచ్చిందని ఆర్కే.సురేశ్ తెలిపారు. తాను స్టూడియో 9 పతాకంపై విజయ్‌సేతుపతి హీరోగా ధర్మదురై చిత్రం నిర్మించిన తరువాత చాలా కథలు విన్నా సంతృప్తి కలిగించలేదన్నారు. అలాంటిది నెపోలియన్ తెలుగు చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తే బాగుందని భావించానన్నారు.ఈ చిత్రం కోలీవుడ్‌కు చాలా కొత్తగా ఉంటుందని తెలిపారు.ఇందులో తాను హీరోగా నటిస్తూ నిర్మించనున్నానని, ఒక ముఖ్య పాత్రలో నటుడు సముద్రఖని నటించనున్నారని, మరో కీలక పాత్రను బాలీవుడ్ నటుడు పోషించనున్నారని తెలిపారు. ఇందులో హీరోయిన్ పాత్రను నటి వరలక్ష్మీశరత్‌కుమార్ పోషించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నాయి. -
ఆర్కే.సురేశ్‌తో వరలక్ష్మి
ఆర్కే.సురేశ్‌తో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ మరోసారి జత కట్టడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. సంచలన తారగా ముద్ర పడిన కథానాయికల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఒకరని చెప్పవచ్చు. ఒక టీవీ భేటీలో తనను ఇంటర్వూ్య చేసిన వ్యక్తి మళ్లీ కలుద్దాం అన్నాడని బహిరంగంగా చెప్పి కలకలానికి తెరలేపిన ఈ బ్యూటీని నటుడు విశాల్‌తో కలుపుతూ చాలానే వందతులు ప్రచారం అయ్యాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక నటిగా చూస్తే ఆ మధ్య బాలా దర్శకత్వంలో గరగాట కళాకారిణిగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను సైతం పొందిన వరలక్ష్మీ శరత్‌కుమార్ ఆ చిత్రంలో నటుడు ఆర్కే.సురేశ్‌కు అర్ధాంగిగా నటించారు. అందులో ఆర్కే.సురేశ్ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను చంపాలని ప్రయత్నిస్తుంటారు. కాగా అదే ఆర్కే.సురేశ్ తాజాగా హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి వర్గం అనే టైటిల్‌ను నిర్ణయించారు. సాలై ఇంద్రజిత్ దర్శకత్వం వహించనున్న ఇందులో ఆర్కే.సురేశ్‌కు జంటగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
ఉత్తర చెన్నై నేపథ్యంగా స్కెచ్
ఉత్తర చెన్నై మరో కోణాన్ని ఆవిష్కరించే చిత్రంగా స్కెచ్ ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు విజయ్‌చందర్ అంటున్నారు. వీ క్రియేషన్స్ కలైపులి ఎస్.థాను సమర్పణలో మూవింగ్ ఫ్రేమ్ సంస్థ నిర్మిస్తున్న భారీ చిత్రం స్కెచ్. సియాన్ విక్రమ్, మిల్కీబ్యూటీ తమన్నా తొలిసారిగా జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో సూరి, ఆర్కే.సురేశ్, అరుళ్దాస్, మలయాళ నటుడు హరీశ్, శ్రీమాన్, రవికిషన్,విశ్వంత్, మాలి ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఇందులో ప్రియాంక్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్ఎస్.థమన్ సంగీతాన్ని, సుకుమార్ ఛాయాగ్రహణం అందిస్తున్న ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను విజయ్‌చందర్ నిర్వహిస్తున్నారు. చిత్రం గురించి ఆయన తెలుపుతూ ఇది ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందిస్తున్న కథా చిత్రం అని తెలిపారు. ఉత్తర చెన్నై అనగానే ఇప్పటి వరకూ చదవులేని వారు, ఆర్థికంగా ఎదగని వారి గురించే చిత్రాల్లో చూపించారన్నారు. అయితే అక్కడ విద్యాధికులు, డాక్టర్లు, లాయర్లు ఉన్నారని చెప్పే స్టైలిష్ చిత్రంగా స్కెచ్ ఉంటుందని తెలిపారు. ఈ చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని అన్నారు. చిత్రంలో భారీ పోరాట దృశ్యాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయని చెప్పారు. ఇప్పటికే చెన్నైలో బ్రహ్మాండమైన సెట్ వేసి 30 రోజులకు పైగా చిత్రంలోని పలు ముఖ్య సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలిపారు. ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం కోసం నటుడు విక్రమ్ కణవే కణవే..పుదుకణవే అనే పాటను పాడడం విశేషంగా పేర్కొన్నారు.