నేను అలా అనలేదు.. అవాస్తవాలు ప్రచారం చేశారు: ప్రముఖ నటుడు | RK Suresh Controversy Comments On Casteism | Sakshi
Sakshi News home page

నేను అలా అస్సలు మాట్లాడలేదు.. కావాలనే అలా: ప్రముఖ నటుడు

Published Tue, Mar 5 2024 12:01 PM | Last Updated on Tue, Mar 5 2024 1:12 PM

RK Suresh Controversy Comments On Casteism - Sakshi

తన గురించి ఎన్నో కట్టుకథలు ప్రచారం చేశారని ప్రముఖ తమిళ నటుడు-నిర్మాత ఆర్‌కే.సురేశ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈయన హీరోగా నటించిన కొత్త సినిమా 'కాడు వెట్టి'. సోలై ఆరుముగం దర్శకుడు. త్వరలో ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ఆడియో లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఇందులోనే ఆర్‌కే సురేశ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

(ఇదీ చదవండి: అంబానీ ప్రీ వెడ్డింగ్‌లో చరణ్‌ని అవమానించిన షారుక్.. షాకింగ్ పోస్ట్)

'ఇప్పటివరకూ 100కి పైగా సినిమాల్ని పంపిణీ చేశాను. పలు చిత్రాలు నిర్మించాను. 40కి పైగా మూవీస్‌లో నటించాను. ఇండస్ట్రీలో 15 ఏళ్లుగా ఉన్నాను. అందరితోనూ నాకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి నాపై అవాస్తవాలు ప్రచారం చేశారు. ఇది జాతికి సంబంధించిన చిత్రం కాదు. నేను ఏ జాతిని కించపరచేలా మాట్లాడలేదు. జాతి అనేది ఒక భావన మాత్రమే' అని ఆర్‌కే సురేశ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి హిట్ సినిమా.. అనుకున్న టైమ్ కంటే ముందే రానుందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement