RK SUresh, Kayal Anandhi Starrer White Rose Movie Launched Deets Inside - Sakshi
Sakshi News home page

Actor RK Suresh: ఇద్దరు హీరోలతో వైట్‌ రోస్‌, షూటింగ్‌ స్టార్ట్‌..

Published Tue, May 24 2022 1:23 PM | Last Updated on Tue, May 24 2022 4:37 PM

RK SUresh, Kayal Anandhi Starrer White Rose Movie Launched - Sakshi

నటుడు, నిర్మాత ఆర్‌.కె సురేష్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం వైట్‌ రోస్‌. మరో కథానాయకుడిగా ఎస్‌.రుసో నటిస్తున్న ఇందులో కయల్‌ ఆనంది ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. వీరితో పాటు మాజీ పోలీస్‌ అధికారి జాంగిట్‌ ప్రత్యేక పాత్రలో నటించడం విశేషం. రాజశేఖర్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్కే సురేష్‌ స్టూడియో 9 సంస్థ, ఎస్‌.రుసోతో కలిసి నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ సోమవారం ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

నిర్మాత కలైపులి ఎస్‌. థాను, నటుడు ఆది తదితర సినీ ప్రముఖులు అతిథులుగా పాల్గొని చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇది ఆస్పత్రిల్లో జరుగుతున్న యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిస్తున్న సైకో థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. దీనికి ఎన్‌.ఎస్‌.ఉదయకమార్‌ ఛాయాగ్రహణం, జోహన్‌ శివనేశ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

చదవండి 👇
 నా సినిమాను చంపేశారు: శేఖర్‌ నిర్మాత ఆవేదన
‘బిందు మాధవి అలా అనడంతో పెళ్లి గురించి ఆలోచించడం మానేశా’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement