మంచి కథా పాత్రలను ఎంపిక చేసుకుని నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను తెచ్చుకున్న నటి 'కయల్' ఆనంది. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం వైట్‌రోస్. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రంలో నటుడు ఆర్‌కే సురేష్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. రంజని నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా రాజశేఖర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు సుశిగణేశన్ శిష్యుడు అన్నది గమనార్హం.
చిత్ర యూనిట్ వైట్‌రోస్ వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ.. మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యువతి ఎదుర్కొనే సమస్యలు ఇతివృత్తంతో రూపొందిస్తున్న కథా చిత్రం అన్నారు. ఇది ఉత్కంఠ భరితంగా సాగే సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రంలో ఆనంది పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటుందని, ఆమె కెరీర్‌లోనే ఇది ప్రత్యేక చిత్రంగా నిలుస్తుందని చెప్పారు.
ఆనంది అద్భుతంగా నటిస్తున్నారన్నారు. సురేష్ పాత్ర చాలా కీలకంగా ఉంటుందన్నారు. అదేవిధంగా చిత్రంలో మరో ప్రముఖ నటి నటించనున్నారని, ఆ వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి జోహన్, శివనేశ్ సంగీతాన్ని ఇళయరాజా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇకపోతే జాంబిరెడ్డి, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమాలతో ఆనంది తెలుగు ప్రేక్షకులకూ దగ్గరైంది. ఇటీవలే ఆమె తెలుగులో కస్టడీ సినిమాలో కనిపించింది.
చదవండి: శోభన ఇంట్లో చోరీ.. పనిమనిషిపై జాలి చూపించిన హీరోయిన్
వృద్ధుడిపై సీరియల్ నటి వలపు వల
Comments
Please login to add a commentAdd a comment