కొచ్చిన్ షాదీ అట్ చెన్నై 03 చిత్ర యూనిట్
తమిళసినిమా: నటుడు విశాల్ తనకు అవసరమైన వారిని వాడుకుని వదిలేస్తారు. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ అంతేనని నటుడు, నిర్మాత ఆర్‌కే.సురేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాల్ అవకాశవాది అని,ఆయన చర్యలు సరికాదని ఆరోపించారు. ఆర్‌కే.సురేశ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం కొచ్చిన్ షాది అట్ చెన్నై 03. తమిళం, మలయాళం భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆర్య ఆది ఇంటర్నేషనల్ మూవీస్ పతా కంపై అబ్దుల్ లతీఫ్ వడుకోట్ నిర్మిస్తున్నారు.
నటి అర్చిత శ్రీధర్, నేహా సక్సెనా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి మంజి దివాకర్ దర్శకత్వం వహిస్తున్నారు. దీని ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది.ఈ సందర్భంగా చిత్ర కథానా యకుడు ఆర్‌కే.సురేశ్ నడిగర్ సంఘం వ్యవహా రంపై స్పందిస్తూ తాను సంఘంలో సభ్యుడిగా చేరి నాలుగేళ్లయ్యిందని, అయినా ఎలాంటి పదవికీ పోటీ చేయలేని పరిస్థితి ఉందన్నారు. నడిగర్ సంఘం ఎన్నికల్లో విశాల్‌కు మినహా అందరికీ తన మద్దతు ఉంటుందన్నారు. నటుడు ఉదయ నడిగర్ సంఘ నిర్వాహనికి ఒక జట్టును తయారు చేస్తున్నారని,వారికి తన మద్దుతు ఉంటుందన్నారు.
ఆరోపణలు చేయలేదు
నటుడు విశాల్‌పై తాను ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేదని, ఆయన అలాంటి వారు కాదని అన్నారు. అయితే ఆయన తనకెవరూ అవసరమో వారిని వాడుకుని ఆ తరువాత వదిలేస్తారని అన్నారు. విశాల్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఆయనతో నటుడు, మాజీ ఎంపీ రితీష్ కూడా ఉన్నారని, ఆ తరువాత ఆయన విడిపోయారని అన్నారు. విశాల్‌తో ఉన్న నటుడు ఉదయ ఇప్పుడు ఆయనతో విభేదించి బయటకు వచ్చారని, ఆయన మేనేజర్ మురుగరాజ్ విశాల్‌తో లేడని అన్నారు.
నటి వరలక్ష్మీది అదే పరిస్థితి అని పేర్కొన్నారు. విశాల్ ఎందుకిలా చేస్తున్నారన్నది అర్థం కావడం లేదన్నారు. కాగా తాను నటుడు ఎస్‌వీ.శేఖర్ జట్టులో చేరలేదని, అసలు ఆయన ఏ జట్టులో ఉన్నారన్నదీ తనకు తెలియదని అన్నారు. పెద్ద నిర్మాతలెవరూ ఇప్పుడు లేరని, వారంతా నెలసరి వేతనాన్ని పొందుతున్నారని అన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం పేరును తమిళ్ నడిగర్ సంఘంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు. విశాల్ గురించి మాట్లాడు తూ ఆయన్ని నటించనీయండి, చాలా కమిట్‌మెంట్స్ ఉన్నాయి అని ఆర్‌కే.సురేశ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment