ఆర్‌కే.సురేశ్‌తో వరలక్ష్మి | RK Suresh talks about Vargam co-starring Varalaxmi Sarathkumar | Sakshi
Sakshi News home page

ఆర్‌కే.సురేశ్‌తో వరలక్ష్మి

Published Wed, May 17 2017 2:46 AM | Last Updated on Tue, Sep 5 2017 11:18 AM

ఆర్‌కే.సురేశ్‌తో వరలక్ష్మి

ఆర్‌కే.సురేశ్‌తో వరలక్ష్మి

ఆర్‌కే.సురేశ్‌తో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ మరోసారి జత కట్టడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. సంచలన తారగా ముద్ర పడిన కథానాయికల్లో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఒకరని చెప్పవచ్చు. ఒక టీవీ భేటీలో తనను ఇంటర్వూ్య చేసిన వ్యక్తి మళ్లీ కలుద్దాం అన్నాడని బహిరంగంగా చెప్పి కలకలానికి తెరలేపిన ఈ బ్యూటీని నటుడు విశాల్‌తో కలుపుతూ చాలానే వందతులు ప్రచారం అయ్యాయన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇక నటిగా చూస్తే ఆ మధ్య బాలా దర్శకత్వంలో గరగాట కళాకారిణిగా అద్భుతమైన అభినయాన్ని ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలను సైతం పొందిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ఆ చిత్రంలో నటుడు ఆర్‌కే.సురేశ్‌కు అర్ధాంగిగా నటించారు. అందులో ఆర్‌కే.సురేశ్‌ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను చంపాలని ప్రయత్నిస్తుంటారు.

కాగా అదే ఆర్‌కే.సురేశ్‌ తాజాగా హీరోగా నటించనున్నారు. ఈ చిత్రానికి వర్గం అనే టైటిల్‌ను నిర్ణయించారు. సాలై ఇంద్రజిత్‌ దర్శకత్వం వహించనున్న ఇందులో ఆర్‌కే.సురేశ్‌కు జంటగా నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ఎంపిక చేసినట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement