టైసన్‌గా మారుతున్న ఆర్‌కే.సురేశ్‌ | RK Suresh Next Movie Titled TYSON | Sakshi
Sakshi News home page

టైసన్‌గా మారుతున్న ఆర్‌కే.సురేశ్‌

Published Tue, Mar 13 2018 4:47 AM | Last Updated on Tue, Mar 13 2018 4:47 AM

RK Suresh Next Movie Titled TYSON - Sakshi

టైసన్‌ చిత్ర యూనిట్‌

తమిళసినిమా: నిర్మాత, నటుడు ఆర్‌కే.సురేశ్‌ ఇప్పుడు తన చిత్రాలతో బిజీ అయ్యారు. తొలుత నిర్మాతగా రంగప్రవేశం చేసి ధర్మదురై లాంటి కొన్ని మంచి చిత్రాలను నిర్మించారు. ఆ తరువాత ప్రతి నాయకుడిగా అవతారమెత్తి మరుదు, తారైతప్పట్టై వంటి చిత్రాలలో దుమ్మురేపారు. ఇప్పుడు కథానాయకుడిగా బిజీ అయిపోయారు. ఆయన హీరోగా నటిస్తున్న బిల్లాపాండి,వేట్టైనాయ్‌ తదితర చిత్రాలలో నటిస్తున్నారు. తాజాగా టైసన్‌ అనే చిత్రాన్ని తన స్టూడియో 9 పతాకంపై నిర్మిస్తూ, కథానాయకుడిగా నటించడానికి రెడీ అయ్యారన్నది తాజా వార్త. దీనికి రత్తన్‌లింగా దర్శకత్వం వహిస్తున్నారు.

ఈయన ఆ మధ్య విడుదలై సినీ పరిశ్రమ వర్గాల నుంచి మంచి  ప్రశంసలు అందుకున్న అట్టు చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఇది టైసన్‌ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం అవుతుంది. టైసన్‌ చిత్రం గురించి రత్తన్‌లింగా తెలుపుతూ ఆర్‌కే.సురేశ్‌ ఇందులో ఇంతకు ముందెప్పుడూ నటించని పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఆయనతో పాటు నటుడు అజయ్‌ రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం అన్నారు. ఇందులో హీరోయిన్‌ ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తామని, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం అంతా ప్రముఖులే ఉంటారని దర్శకుడు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement