Tyson
-
'అమ్మా.. కడుపులో నొప్పిగా ఉందన్నా'.. వదలని సవతి తల్లి..
యాదాద్రి: సంసార జీవితానికి అడ్డు వస్తున్నాడన్న నెపంతో ఓ మహిళ బాలుడిని గొంతు నులిచి హత్య చేసి ఆపై సాధారణ మరణంగా చిత్రీకరించేందుకు ప్లాన్ చేసింది. సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం ఫిర్యాదుతో సూర్యాపేట మండలంలోని మూడో విడత ఇందిరమ్మ కాలనీకి చెందిన మచ్చ మధు 2015లో కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి రెండేళ్ల తర్వాత బాబు టైసన్ (06)జన్మించాడు. టైసన్‌కు రెండేళ్ల వయసున్న సమయంలోనే తండ్రి వదిలేసి వెళ్లిన తల్లి మరొకరిని వివాహం చేసుకుంది. దీంతో మధు తల్లి కళమ్మ దగ్గరే టైసన్ పెరుగున్నాడు. ఆరు నెలల క్రితం మోతె మండలం సర్వారం గ్రామానికి చెందిన బొడ్డు వాణి అలియాస్ రాణితో మధు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అప్పటినుంచి ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.టైసన్‌ను సూర్యాపేట పట్టణంలోని సూర్యాపేట పబ్లిక్ స్కూల్లో 1వ తరగతిలో విద్యనభ్యసిస్తున్నాడు. అమ్మా.. కడుపులో నొప్పిగా ఉందన్నా.. టైసన్ రోజు మాదిరిగానే స్కూల్‌కు వెళ్లాడు. స్కూల్నుంచి రాగానే సవతి తల్లికి అమ్మా బాగా కడుపులో నొప్పిగా ఉందని చెప్పాడు. వెంటనే గదిలోకి వెళ్లి మంచంపై నిద్రిస్తుండగా.. సవతి తల్లి టైసన్ గొంతు గట్టిగా నులిమి హతమార్చింది. వెంటనే టైసన్ తండ్రి మధుకు ఫోన్ ద్వారా టైసన్‌కు బాగా కడుపులో నొప్పిగా ఉందని.. రోదిస్తున్నాడంటూ తెలిపింది. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. నాయనమ్మ ఫిర్యాదుతో.. టైసన్ నాయనమ్మ కళమ్మ మనువడి మృతిపై తనకు అనుమానం ఉందని ఈనెల 4న పోలీసులకు ఫిర్యాదు చేసింది. టైసన్ మృతదేహానికి జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేయించగా.. నివేదికలో గొంతు నులిమి చంపినట్లుగా వైద్యులు ధ్రువీకరించారు. వెంటనే సవతి తల్లిపై అనుమానం వ్యక్తం కావడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించింది. దీంతో ఆమెను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీఎస్పీ తెలిపారు. -
‘టైసన్’ ఇలా మారిపోయాడేంటి? షాక్‌లో ఫ్యాన్స్!
హ్యాపీడేస్.. 14 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సెన్సేషన్. పెద్ద సినిమాలను సైతం వెనక్కు నెట్టిన ఈ సినిమా శేఖర్ కమ్ములను డైరెక్టర్‌గా మరో మెట్టు ఎక్కించింది. అంతేకాదు ఎంతోమంది కొత్తవారిని ప్రేక్షకులకు పరిచయం చేసిందీ చిత్రం.. వారందరికీ మంచి గుర్తింపు వచ్చినప్పటికీ కొందరికి మాత్రమే అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమాలో జనాలకు బాగా కనెక్ట్ అయిన పాత్ర టైసన్. అదిరిపోయే డైలాగ్‌లతో, రివర్స్ పంచులతో టైసన్ పాత్రలో ఆకట్టుకున్నాడు రాహుల్. View this post on Instagram A post shared by Rahul Dayakiran (@raahultyson) ఇందులో అతడు మరీ బక్కగా ఉండటంతో అందరూ అతడిని వెటకారంగా ‘టైసన్’ అని ఆటపట్టిస్తుంటారు. అంతెందుకు ఓ సన్నివేశంలో తనకు మంచి బాడీ లేదంటూ తను ప్రేమించిన శ్రావ్స్తోనే చెప్తాడు. కానీ ఇప్పుడు రాహుల్ గుర్తుపట్టకుండా మారిపోయాడు. కండలు తిరిగిన దేహం, మీసకట్టుతో కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. అతడిని ఈ గెటప్‌లో చూసిన అభిమానులు అసలు ఆ టైసన్ నువ్వేనా? అని షాకవుతున్నారు. నిన్ను అసలు గుర్తుపట్టలేకపోతున్నాం, మాస్ చేంజ్ ఓవర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Rahul Dayakiran (@raahultyson) ఇప్పుడు కానీ శ్రావ్స్ నిన్ను చూస్తే ఫ్లాట్ అయిపోద్ది అన్నా.. అంటూ ఫన్నీగా మెసేజ్ చేస్తున్నారు. ఈ రోజు కష్టపడితేనే రేపు మరింత బలంగా తయారవుతాం, నేను ఇక్కడివరకు చేరుకుంటానని అస్సలు ఊహించలేదు. నన్ను సపోర్ట్ చేసిన అందరికీ కృతజ్ఞతలు అంటూ తన ఫొటోలను షేర్ చేశాడు. కాగా రాహుల్ ఆ మధ్య వెంకటాపురం సినిమాలో నటించాడు. ఇది అతడి కెరీర్‌కు ఏమాత్రం ప్లస్ కాలేదు. కొన్నేళ్ల గ్యాప్ తర్వాత 100 క్రోర్స్ అనే మరో కొత్త చిత్రంలో నటించనున్నాడు. చదవండి: నేను తాగింది మందు కాదు: హీరోయిన్ -
టైసన్‌గా మారుతున్న ఆర్కే.సురేశ్
తమిళసినిమా: నిర్మాత, నటుడు ఆర్కే.సురేశ్ ఇప్పుడు తన చిత్రాలతో బిజీ అయ్యారు. తొలుత నిర్మాతగా రంగప్రవేశం చేసి ధర్మదురై లాంటి కొన్ని మంచి చిత్రాలను నిర్మించారు. ఆ తరువాత ప్రతి నాయకుడిగా అవతారమెత్తి మరుదు, తారైతప్పట్టై వంటి చిత్రాలలో దుమ్మురేపారు. ఇప్పుడు కథానాయకుడిగా బిజీ అయిపోయారు. ఆయన హీరోగా నటిస్తున్న బిల్లాపాండి,వేట్టైనాయ్ తదితర చిత్రాలలో నటిస్తున్నారు. తాజాగా టైసన్ అనే చిత్రాన్ని తన స్టూడియో 9 పతాకంపై నిర్మిస్తూ, కథానాయకుడిగా నటించడానికి రెడీ అయ్యారన్నది తాజా వార్త. దీనికి రత్తన్లింగా దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన ఆ మధ్య విడుదలై సినీ పరిశ్రమ వర్గాల నుంచి మంచి ప్రశంసలు అందుకున్న అట్టు చిత్రానికి దర్శకత్వం వహించారన్నది గమనార్హం. ఇది టైసన్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రం అవుతుంది. టైసన్ చిత్రం గురించి రత్తన్లింగా తెలుపుతూ ఆర్కే.సురేశ్ ఇందులో ఇంతకు ముందెప్పుడూ నటించని పాత్రలో నటిస్తున్నారని చెప్పారు. ఆయనతో పాటు నటుడు అజయ్ రెండు విభిన్న పాత్రల్లో ద్విపాత్రాభినయం చేయడం విశేషం అన్నారు. ఇందులో హీరోయిన్ ఎవరన్నది త్వరలోనే వెల్లడిస్తామని, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం అంతా ప్రముఖులే ఉంటారని దర్శకుడు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన తెలిపారు. -
టైసన్ నడిచిందోచ్.
మన పిల్లలు తొలిసారిగా ఈ చిత్రంలోని రోస్‌మేరీ కూడా ప్రస్తుతం అలాంటి ఆనందాన్నే అనుభవిస్తోంది. చిత్రంలో కనిపిస్తోందే.. కుక్క.. అవును అది కుక్కే.. పేరు టైసన్. అదీ కూడా ఇప్పుడు చేస్తోంది తన తొలి అడుగులను వేయడమే.. అవును మరి.. టైసన్ తొలిసారిగా తన ఓనర్ తో కలసి ఇటీవల వాకింగ్‌కు వెళ్లింది. పైగా.. అంత చిన్న కాళ్లతో నడవడానికి ఆపసోపాలు పడిపోయింది కూడా.. టైసన్‌ను చూసి.. దాన్ని తల్లి జడుసుకుని దూరం పెట్టిందట. అప్పుడు రోస్మేరీయే దగ్గరుండి ఆలనాపాలనా చూసింది. బ్రిటన్‌లోని కీల్ పట్టణంలో ఉండే టైసన్ ఎత్తు కేవలం 4 అంగుళాలు.. బరువు 360 గ్రాములు. ఇది బ్రిటన్‌లోనే అత్యంత చిన్న శునకం. వరల్డ్ రికార్డు జస్ట్‌లో మిస్ అయిపోయింది. ప్రపంచంలోనే అత్యంత చిన్న కుక్క ఎత్తు 3.8 అంగుళాలు. -
టైసన్ గే డోపి
ఒలింపిక్ పతకం వెనక్కి ఏడాది నిషేధం కొలరాడో స్ప్రింగ్స్: అమెరికా అథ్లెటిక్స్‌కు మరో మచ్చ. స్ప్రింట్ స్టార్ టైసన్ గే డోపింగ్‌లో పట్టుబడ్డాడు. పోటీలు లేనప్పుడు (రాండమ్ అవుట్ ఆఫ్ కాంపిటిషన్) జరిపిన రెండు టెస్టులతో పాటు ఓ ఈవెంట్ సందర్భంగా చేసిన మరో డోప్ టెస్టులోనూ అతను నిషేధిత ఉత్ప్రేరకాలు వాడినట్లు తేలింది. దీంతో అమెరికా యాంటీ డోపింగ్ అసోసియేషన్ (యూఎస్‌ఏడీఏ) అతనిపై ఏడాది పాటు నిషేధం విధించింది. అలాగే లండన్ ఒలింపిక్స్‌లో టైసన్ గే గెలిచిన రజత పతకాన్ని యూఎస్ ఒలింపిక్ కమిటీ వెనక్కి తీసుకుంది. గతేడాది జూన్ 23న యూఎస్ ట్రాక్ అండ్ ఫీల్డ్ చాంపియన్‌షిప్ సందర్భంగా యూఎస్‌ఏడీఏ, ఐఏఏఎఫ్లు సంయుక్తంగా టైసన్ గే మూత్ర నమూ నాలను సేకరించాయి. ఆ చాంపియన్‌షిప్‌లోనే అతను డోపింగ్‌కు పాల్పడినట్లుగా గుర్తించి నిషేధాన్ని అప్పట్నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.